శ్రీదివ్య చూపు గ్లామర్ వైపు | Sri Divya Says She will be a Glam Queen | Sakshi
Sakshi News home page

శ్రీదివ్య చూపు గ్లామర్ వైపు

Published Sat, Oct 10 2015 2:56 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

శ్రీదివ్య చూపు గ్లామర్ వైపు - Sakshi

శ్రీదివ్య చూపు గ్లామర్ వైపు

నటి శ్రీదివ్య పేరు చెప్పగానే మంచి హోమ్లీ నటి అనే అంతా అంటారు. ఆమె ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ కథా పాత్రలనే పోషించి సక్సెస్ అయ్యారు. కోలీవుడ్‌లో శ్రీదివ్య నటించి విడుదలైన తొలి చిత్రం వరుత్తపడాద వాలిభర్ సంఘం అనూహ్య విజయాన్ని సాధించింది.ఆ తరువాత నటించిన జీవా,వెళ్లైకారదురై, కాక్కిసట్టై చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. అధర్వతో నటించిన ఈటీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. వాటిలో కార్తీ సరసన నటిస్తున్న కాష్మోరా చిత్రం ఒకటి. కాగా ఈ తెలుగమ్మాయికి నటి కీర్తీసురేశ్‌తో పెద్ద చిక్కే వచ్చిపడిందట. ఈ మలయాళీ బ్యూటీ హోమ్లీ పాత్రలు ఎంపిక చేసుకుంటూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను పొందుతుండడంతో నటి శ్రీదివ్యకు వస్తాయని ఆశించి అవకాశాలు కీర్తీసురేశ్‌ను వరిస్తున్నాయట.

దీంతో ఆలోచనలో పడ్డ శ్రీదివ్య కొత్త నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదట. అదేమిటో తెలుసా?ఇకపై తన పంథాను మార్చుకుని గ్లామర్ వైపు దృష్టి సారిస్తున్నారట. ఇప్పటి వరకూ హోమ్లీ ఇమేజ్ రుచి చూసి శ్రీదివ్య ఇక గ్లామర్ సంగతి చూడాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement