మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ఈటీ టీజర్‌ చూశారా? | Rana Daggubati Launched Suriya ET Telugu Teaser | Sakshi
Sakshi News home page

ET Telugu Teaser: మనల్ని ఎవరూ ఏమీ చేయలేరంటున్న సూర్య

Published Sun, Feb 20 2022 7:53 AM | Last Updated on Sun, Feb 20 2022 7:53 AM

Rana Daggubati Launched Suriya ET Telugu Teaser - Sakshi

మాస్‌ పాత్రల్లో విజృంభించి నటిస్తారు సూర్య. తాజాగా ‘ఈటి’ చిత్రంలో కూడా మాస్‌ క్యారెక్టర్‌లో రెచ్చిపోయినట్లుగా శనివారం విడుదలైన టీజర్‌ స్పష్టం చేస్తోంది. సూర్య  హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన  ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 10న రిలీజ్‌ కానుంది. తెలుగు హక్కులను ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ సంస్థ దక్కించుకుంది.

ఈ చిత్రం తెలుగు టీజర్‌ను రానా విడుదల చేశారు. విలన్లను రఫ్ఫాడిస్తూ, ‘నాతో ఉన్నవాళ్లు ఎప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని సూర్య చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. సూర్య సరసన ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమెరా: ఆర్‌ రత్నవేలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement