హీరో సూర్య కొత్త ప్రయాణం | Hero Surya New Movie Under Pandiraj Direction | Sakshi
Sakshi News home page

హీరో సూర్య కొత్త ప్రయాణం

Published Mon, Mar 15 2021 8:21 AM | Last Updated on Mon, Mar 15 2021 8:21 AM

Hero Surya New Movie Under Pandiraj Direction - Sakshi

కెరీర్‌లో మరో కొత్త సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు హీరో సూర్య. పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యరాజ్, సూరి, వినయ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో మొదలైంది. సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతున్నారు సూర్య. ఈ షెడ్యూల్‌ దాదాపు 25 రోజులు జరుగుతుందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా కాకుండా వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడీవాసల్‌’ అనే సినిమా కమిట్‌ అయ్యారు సూర్య. 

చదవండి: రేలంగి తన సంపాదనంతా ఆమెకే ఇచ్చేవారు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement