కరోనా వల్ల సినీప్రేమికుడు మిస్సయిన వినోదాన్ని రెట్టింపు చేసి ఇచ్చేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం పెద్ద సినిమాలు థియేటర్‌లో, మధ్య, చిన్న తరహా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ జాబితా చూస్తుంటే ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. మరి మీరూ కొత్త సినిమాలు వీక్షించాలనుకుంటే ఈ వారం(మార్చి 7-13 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి..
ఈటీ
తమిళ స్టార్ హీరో సూర్య థియేటర్‌లో ప్రేక్షకులను పలకరించి చాలాకాలమే అయింది. ఆయన నటించిన 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్' చిత్రాలు ఓటీటీలో రిలీజై సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత ఆయన ఈటీ సినిమా చేయగా ఇది థియేటర్లలో రిలీజవుతోంది. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, వినయ్ రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అమ్మాయికు జరిగే అన్యాయాలపై పోరాటమే ప్రధాన కథగా సాగే ఈ సినిమా మార్చి 10న రిలీజవుతోంది.
రాధేశ్యామ్
డార్లింగ్ ప్రభాస్ థియేటర్లలో కనిపించి చాలా ఏళ్లవుతోంది. దీంతో అతడి సినిమా కోసం అభిమానులు కళ్లు కాయేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కరోనా ఉధృతి కొంత తగ్గడంతో 'రాధేశ్యామ్' రిలీజ్‌కు రెడీ అయింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి 11న విడుదలవుతోంది. విధితో పోరాటం చేసిన ప్రేమకథే ఈ సినిమా స్టోరీలైన్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు.
ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాల జాబితా..
హాట్‌స్టార్
► ఖిలాడి - మార్చి 11
► మారన్ - మార్చి 11
ఆహా
► ఖుబూల్ హై - మార్చి 11
సోనీలివ్
► క్లాప్ - మార్చి 11
జీ5
► రౌడీ బాయ్స్ - మార్చి 11
► మిసెస్ అండ్ మిస్టర్ షమీమ్ (వెబ్ సిరీస్) - మార్చి 11
► రైడర్ - మార్చి 11
నెట్‌ఫ్లిక్స్
► అవుట్ ల్యాండర్ (ఆరో సీజన్) - మార్చి 7
► ద లాస్ట్ కింగ్‌డమ్ (ఐదో సీజన్) - మార్చి 9
► ద అండీ వార్‌హోల్ డైరీస్ (వెబ్ సిరీస్) - మార్చి 9
► ఎ ఆడమ్ ప్రాజెక్ట్ - మార్చి 11
అమెజాన్ ప్రైమ్
► అప్‌లోడ్ (రెండో సీజన్) - మార్చి 11
ఎంఎక్స్ ప్లేయర్
► అనామిక - మార్చి 10
Comments
Please login to add a commentAdd a comment