శింబు - నయనతార సినిమాలో హన్సిక నటిస్తే?
శింబు - నయనతార సినిమాలో హన్సిక నటిస్తే?
Published Wed, Feb 5 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
‘శింబు హీరోగా నయనతార, హన్సిక హీరోయిన్లుగా సినిమా’. వినడానికే విడ్డూరంగా ఉంది కదా. మాజీ ప్రియురాలు నయనతారతో కలిసి శింబు నటిస్తుండటమే ఇప్పుడు దక్షిణాదిన హాట్ టాపిక్ అయ్యింది. అలాంటిది మరో మాజీ ప్రియురాలు హన్సిక కూడా నటిస్తే... ఇంకేమైనా ఉందా! మీడియాకు కావాల్సినంత స్టఫ్ దొరికినట్టేగా. అసలు ఈ కాంబినేషన్‌ని సెట్ చేసే సత్తా ఎవరికుంది? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇది. కానీ.. నిజానికి వారి ముగ్గుర్నీ కలిపి నటింపజేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నిజం. వివరాల్లోకెళితే... శింబు, నయనతార జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.
కథ రీత్యా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం. కాగా, శింబు, నయన కలిసి నటిస్తుండంతో ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. సో... మరో మాజీ ప్రియురాలు హన్సిక కూడా ఈ సినిమాకు జత కూడితే... ఎలా ఉంటుంది? అనే ఆలోచన తమిళనాడుకి చెందిన కొందరు పంపిణీదారులకు వచ్చిందట. ఇంకేముంది... ఆలస్యం చేయకుండా తమ ఆలోచనను దర్శకుడు పాండిరాజ్‌కి విన్నవించారు. ఆయనక్కూడా ఇదేదో బాగుందనిపించి... ఆలస్యం చేయకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారట. మరి ఈ సినిమాలో నటించడానికి హన్సిక అంగీకరిస్తారో, లేదో చూడాలి. ఈ సినిమాకు నయనతార తీసుకుంటున్న పారితోషికం రెండు కోట్ల రూపాయలట. సో... ఈ ప్రాజెక్ట్‌లో తాను భాగం అయితే... క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హన్సిక ఎంత పారితోషికాన్ని డిమాండ్ చేస్తారో వేచి చూడాలి మరి.
Advertisement
Advertisement