మమ్మీతో బర్త్‌డే | Hansika Motwani Celebrates Her 23rd Birthday with her mother | Sakshi
Sakshi News home page

మమ్మీతో బర్త్‌డే

Published Wed, Aug 13 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

మమ్మీతో బర్త్‌డే

మమ్మీతో బర్త్‌డే

గత ఏడాది తన జన్మదినోత్సవాన్ని ప్రేమికుడు శింబుతో జరుపుకున్న నటి హన్సిక ఈ ఏడాది తన తల్లితో జరుపుకున్నారు. వాలు, వేట్టైమన్నన్ వంటి చిత్రాల్లో శింబుతో కలిసి నటించారు హన్సిక. వాలు చిత్రం షూటింగ్ సమయంలో ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. దీన్ని ఇరువురూ ట్విటర్, ఫేస్‌బుక్ పేజీల్లో వెల్లడించారు. వీరి ప్రేమకు హన్సిక తల్లి వ్యతిరేకత తెలుపుతూ వచ్చారు. ఇలావుండగా మాజీ ప్రేయసి నయనతారతో ఇదు నమ్మ ఆళురూ. చిత్రంలో శింబు జంటగా నటించారు.
 
 ఇది హన్సికకు నచ్చలేదని సమాచారం. దీంతో హన్సిక శింబుతో తన ప్రేమను తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు. గత ఏడాది శింబు-హన్సిక ప్రేమ జంటగా చక్కర్లు కొట్టారు. ఆగస్టు 9వ తేదీ హన్సిక పుట్టిన రోజు సందర్భంగా... ఆమెకు ఏమి గిఫ్ట్ ఇవ్వాలనేది తెలియక సతమతమవుతున్నాను. ఐడియా వుంటే చెప్పండని తన అభిమానులను వెబ్‌సైట్ పేజీలో కోరారు శింబు.
 
 మరుసటి రోజు హన్సికతో పుట్టిన రోజు జరుపుకున్న చిత్రాలను ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. ఈ ఫ్లాష్‌బ్యాక్ జరిగి సరిగ్గా ఏడాది కావస్తోంది. ఈ ఆగస్టు 9వ తేదీన హన్సిక పుట్టిన రోజు వేడుకను తన తల్లి మోనా మొద్వానితో కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఆ సమయంలో తన విఫలమైన ప్రేమ గుర్తుకు రాగా ఆమె కళ్లు చెమర్చాయన సన్నిహితులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement