సమయం వచ్చినప్పుడు విప్పుతా
సమయం వచ్చినప్పుడు విప్పుతా
Published Mon, Jan 27 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
సమయం వచ్చినప్పుడు మనసు విప్పుతానంటోంది అందాల తార హన్సిక. ఈ భామ ఏ అంశం గురించి ప్రస్తావిస్తుందో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మాజీ ప్రియుడిగా ప్రచారం జరుగుతున్న నటుడు శింబు గురించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. శింబు సరసన వాల్, వేట్టైమన్నన్ చిత్రాల్లో నటించిన సమయంలో పనిలో పనిగా ఆయన్ని లవ్వాడేసింది. అది ఎంత డేర్‌గా అంటే అవును ప్రేమించుకున్నాం త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాం అని బహిరంగంగా ప్రకటించేసింది. అయితే అసలు చిక్కులు పెళ్లెప్పుడన్న విషయంలోనే వచ్చాయి. శింబు వెంటనే పెళ్లికి రెడీ అంటే ఇప్పుడేమి తొందర లేదంది హన్సిక.
ఫలితం బ్రేక్ అప్ అనే ప్రచా రం ముమ్మరంగా సాగుతోంది. అలాంటి సమయంలోనే శింబు మాజీ ప్రియురాలు నయనతారతో సయోధ్య కుదరడం ఇద్దరు కలిసి నటించేయడం జరిగిపోయింది. ఈ జంట మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తోందని వదంతులు గుప్పుమంటున్నాయి. ఇది హన్సికకు ఏ మాత్రం రుచించని అంశం కావడంతో ఆమె శింబుకు శాశ్వతంగా దూరమైనట్లేనంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శింబుతో ప్రేమ శకం ముగిసినట్లేనా? అన్న ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు ఈ ప్రశ్నకు బదులిస్తానని హన్సిక అంటోంది. అంతేకాదు ప్రస్తుతం తాను ప్రశాంతంగా ఉన్నానని ఏ విషయం గురించి ఆలోచించడం లేదని పేర్కొంది. మరి ఆమె భగ్న హృదయం ఎప్పుడు ఎలా? భగ్గు మంటుందో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement