Hansika Motwani Opens Up About Breakup With STR Simbu - Sakshi
Sakshi News home page

Hansika Motwani: శింబుతో బ్రేకప్‌.. తిరిగి ఎస్‌ చెప్పడానికి 8 ఏళ్లు పట్టింది!

Published Mon, Feb 20 2023 3:00 PM | Last Updated on Mon, Feb 20 2023 3:25 PM

Hansika Motwani on Breakup With STR Simbu - Sakshi

హీరోయిన్‌ హన్సిక మొత్వానీ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్‌ను పెళ్లాడింది. డిసెంబర్‌ 4న గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి సందడి హాట్‌స్టార్‌లో లవ్‌ షాదీ డ్రామా పేరుతో స్ట్రీమింగ్‌ అవుతోంది. సోహైల్‌కు ఇది రెండో వివాహం కాగా హన్సికకు ఇది రెండో లవ్‌.. అర్థం కాలేదా? గతంలో ఈ బ్యూటీ శింబుతో డేటింగ్‌ చేసింది. కొంతకాలం బాగానే ఉన్న ఈ లవ్‌ బర్డ్స్‌ తర్వాత బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ విషయాలను తాజాగా హన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

'ఒకసారి బ్రేకప్‌ అయిన తర్వాత వేరేవారికి ఎస్‌ చెప్పడానికి నాకు ఏడెనిమిదేళ్లు పట్టింది. నేను ప్రేమను నమ్ముతాను, కానీ రొమాంటిక్‌ పర్సన్‌ అయితే కాదు. అంత ఈజీగా అన్ని ఎమోషన్స్‌ను వ్యక్తపరచలేను. నాతో కలకాలం ఉండాలనుకుంటున్న వ్యక్తికి ఓకే చెప్పడానికి నేను చాలా సమయమే తీసుకున్నాను. ఎందుకంటే గత రిలేషన్‌షిప్‌ విచిత్రంగా సాగింది. అయినా ఇప్పుడది ముగిసిన కథ' అని చెప్పుకొచ్చింది. కాగా సోహైల్‌ మొదటి పెళ్లి పెటాకులవడానికి కూడా హన్సికే కారణమంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని అతడు క్లారిటీ ఇచ్చాడు.

చదవండి: పేరెంట్స్‌కు చెన్నైలో లగ్జరీ ఇల్లు గిఫ్ట్‌ ఇచ్చిన ధనుష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement