
‘గ్యాంగ్ లీడర్’ భామ ప్రియాంకా అరుళ్ మోహన్ క్రేజీ ఛాన్స్ కొట్టేశారని కోలీవుడ్ టాక్. సూర్యతో జోడీ కట్టే అవకాశం ప్రియాంక కొట్టేశారన్నది ఆ వార్త. పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు సూర్య. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమట. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్‌ను కథానాయికగా అనుకుంటున్నారట. ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’ అనే సినిమా చేశారు ప్రియాంక. ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రెండో సినిమాకే సూర్యతో జోడీ అంటే క్రేజీ ఛాన్స్ అనాల్సిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమాలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment