శింబు చిత్రానికి నో చెప్పిన హన్సిక | hansika opposes to act with simbu | Sakshi
Sakshi News home page

శింబు చిత్రానికి నో చెప్పిన హన్సిక

Published Mon, Dec 16 2013 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

hansika opposes to act with simbu

శింబు సరసన నటించడానికి నటి హన్సిక నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ జంట ఇప్పటికే వాలు, వేట్టై మన్నన్ చిత్రాల్లో కలిసి నటిస్తున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొలకెత్తింది. అయితే తాజాగా శింబు, హన్సికల ప్రేమ బ్రేకప్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో విషయం ఏమిటంటే శింబు సరసన మరో చిత్రంలో నటించే అవకాశాన్ని హన్సిక తిరస్కరించినట్లు తెలిసింది. అందుకు కారణం ఆ చిత్రంలో మరో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండటమేనట. శింబు ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చట్టెన్‌డ్రు మారువదు వానిలె చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పగలు రాత్రి శరవేగంగా జరుగుతోంది. 
 
 దీని గురించి శింబు తన ట్విట్టర్‌లో పేర్కొంటూ గౌతమ్ మీనన్ చిత్రం రెండవ షెడ్యూల్ మొదలైందని తెలిపారు. ఈ నెల 20 నుంచి పాండిరాజ్ దర్శకత్వంలో తాను నటించడానికి సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ఇందులో ఒక హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు.  వీరి మధ్య సన్నివేశాల చిత్రీకరణ జనవరి నుంచి ప్రారంభం అవుతుంది అని పేర్కొన్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా హన్సికను నటింప చేసే ప్రయత్నాలు జరిగాయట. అయితే నయనతార నటిస్తున్న చిత్రంలో తాను నటించనని హన్సిక నిర్మొహమాటంగా చెప్పేసిందట. దీంతో మరో హీరోయిన్ వేట జరుగుతోందని యూనిట్ వర్గాల సమాచారం. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement