
హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. ఇది ఆమెకు 50వ చిత్రం కావడం మరో విశేషం. మదియళగన్ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు.
చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ తాను దర్శకత్వం వహించిన పుళన్ విచారణై చిత్రం ట్రైలర్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. శింబు ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించడం అభినందనీయమన్నారు. ఆయన మంచి నటుడని, సకాలంలో చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే తమకు ఎన్ని పనులు ఉన్నా రోజూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అంతకంటే ముఖ్యచిత్రాలకు సంబంధించిన వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నిర్మాత మదియళగన్ సినిమా పరిశ్రమలో ప్రముఖులని, మహా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సెల్వమణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment