rk selvamani
-
అలాంటి హీరోల వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారు: ఆర్కే సెల్వమణి
తమిళ్ సినీ నిర్మాతల మండలి, యాక్టివ్ నిర్మాతల మండలి కార్య వర్గాల్లో ఐక్యత లేదని ఫెఫ్సీ అధ్యక్షుడు, దర్శకుడు,నిర్మాత ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. నటుడు అశోక్ సెల్వన్, అవంతిక మిశ్రా జంటగా నటించిన చిత్రం ఎమక్కు తొళిల్ రొమాన్స్. నటి ఊర్వశి, అళగప్పన్ పెరుమాళ్, ఎంఎస్ భాస్కర్, భగవతి పెరుమాళ్, భడవా గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బాలాజీ కేశవన్ దర్శకత్వంలో టి.క్రియేషన్స్ పతాకంపై ఎం.తిరుమలై నిర్మించారు. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. కాగా ఈ వేదికపై చిత్ర నిర్మాత ఎం.తిరుమలై, నటుడు అశోక్ సెల్వన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఈయన పారితోషికాన్ని పూర్తిగా చెల్లించినా, చిత్రానికి సహకరించలేదని విమర్శించారు. నిర్మాతల డబ్బుతో ఎదిగిన అశోక్ సెల్వన్ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. తన చిత్రం ప్రమోషన్‌కు రాకపోవడం ఎంతవరకు సమంజసమో నిర్మాతల సంఘం కార్యవర్గం ఆలోచించాలన్నారు. నిర్మాతలు లేకుంటే నటీనటులు ఎక్కడ అని? నిర్మాత ఎం.తిరుమలై ప్రశ్నించారు. కాగా ఈ వేడుకలో పాల్గొన్న ఫెఫ్సీ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ ఈ చిత్రం విషయంలో నిర్మాత ఎం.తిరుమలైకి, నటుడు ఆశోక్ సెల్వన్‌కు మధ్య ఏమి జరిగిందో తనకు తెలియదంటూనే వారి వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు మాత్రం చాలా నష్టపోతున్నారన్నారు. చిత్రాలు హిట్ అయితే ఎక్కువగా లబ్ధి పొందేది హీరో, హీరోయిన్లేనని, ఆ తరువాత క్యూబ్ నిర్వాహకులు, సాంకేతిక వర్గం లాభపడతారని, నిర్మాతకు మాత్రం ప్రయోజనమే ఉండడం లేదన్నారు. ఈ విషయంలో నిర్మాతల మండలి కార్యవర్గంలో ఐక్యత లేదనే చెబుతానన్నారు. అదే ఉంటే ఇలాంటి ఘటనలు తలెత్తవన్నారు. నిర్వాహకులందరూ కలిసి నిర్మాతలకు లాభం కలిగేలా ఒక పరిష్కారాన్ని చేయాలన్నారు. అందుకు ఫెప్సీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. నిర్మాత ఎం.తిరుమలై నిర్మించిన ఎమక్కు తొళిల్ రొమాన్స్ చిత్రం ట్రైలర్, పాటలు చూస్తుంటే వినోదకరమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోందన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. -
సినిమా సెట్లో ఊహించని అతిథి.. చిత్రయూనిట్‌కు అభినందనలు!
పూంపారై మురుగన్ ప్రొడక్షన్స్ పతాకంపై రంజనీ నిర్మిస్తున్న చిత్రం నైట్రోస్. కయల్ ఆనంది కథానాయకిగా నటిస్తున్న ఇందులో ఆమెకు జంటగా నటుడు విజిత్ నటిస్తున్నారు. ఆర్కే సురేష్ విలన్‌గా వైవిధ్య భరిత పాత్రను పోషిస్తున్న ఇందులో రుసో శ్రీధరన్, శశిలయ, గణేష్, రామనాథన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు సుశీగణేశన్ శిష్యుడు అన్నది గమనార్హం. జోగన్ శివనేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో పోలీసు కంట్రోల్ రూమ్ ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. ఇందుకోసం భారీ సెట్ వేసి అత్యంత సహజంగా సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర కథ ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ చివరి రోజున ప్రముఖ దర్శకుడు, ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి అనూహ్యంగా విజిట్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారని దర్శకుడు పేర్కొన్నారు. నైట్రోస్ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
విజయకాంత్ ఆరోగ్యంపై ప్రకటన చేసిన నాజర్
జలుబు, దగ్గు, గొంతునొప్పితో డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ చికిత్స పొందుతున్నారు. నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని నవంబర్ 23న మయత్ ఆసుపత్రి యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ కొన్ని రోజుల తర్వాత, అకస్మాత్తుగా మరోక ప్రకటన విడుదల చేసి అతని పరిస్థితి గత 24 గంటల నుంచి నిలకడగా లేదు అంటూనే పల్మనరీ చికిత్స అవసరం ఉందని తెలిపి విజయకాంత్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పింది. ఆయనకు మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. దీంతో ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యంపై ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. 'కెప్టెన్ ఆరోగ్యంపై ఆసుపత్రి యాజమాన్యం రెగ్యులర్‌గా నివేదిక ఇస్తుంది. ఆయన ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు, నర్సులు, నేను అతనిని బాగా చూసుకుంటున్నాం.' అని తెలిపింది. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి అందరినీ కలుస్తారని ఆమె తెలిపారు. ఆమె ప్రకటనతో అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. విజయకాంత్ ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్లారు. విజయకాంత్ ఆరోగ్యం గురించి వైద్యుల ద్వారా పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయనపై వస్తున్న వార్తలు నమ్మెద్దు. విజయకాంత్ త్వరలో అభిమానులను కలుస్తారు. అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ICU వార్డులో అతను ఉన్నందున మేము చూడలేకపోయాం. కానీ విజయకాంత్ ఆరోగ్యంపై తమకు వైద్యులు సమాచారం అందించారు. వైద్య భద్రత దృష్ట్యా ఆయన్ను చూసేందుకు అనుమతించలేదు.' అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. -
హిజ్రాలకూ సభ్యత్వం కల్పిస్తా: ఆర్కే సెల్వమణి
మారుతీ ఫిలిమ్స్, టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేతలు ఎస్.రాధాకృష్ణన్, ఎస్.హరి కలిసి నిర్మిస్తున్న చిత్రం డెవిల్. సవరకత్తి చిత్రం ఫేమ్ ఆదిత్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు మిష్కిన్ సంగీత దర్శకుడుగా పరిచయం కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన ఒక పాట పాడి కీలక పాత్రను పోషించారు. కాగా నటుడు విదార్థ్, పూర్ణ, ఆదిత్ అరుణ్, శుభశ్రీ రాయ్ గురు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో శుక్రవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ముందుగా మిష్కిన్ నేతృత్వంలో లైవ్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు, పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బాల, వెట్రిమారన్, నిర్మాత థాను పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడిగా పరిచయం అయిన మిష్కిన్ మాట్లాడుతూ కథలన్నీ ఒక కథ నుంచే పుడుతాయన్నారు. అదే విధంగా ఈ డెవిల్ చిత్ర కథ అలాంటిదేనని పేర్కొన్నారు. ఒక ప్రశాంతమైన ఇంటిలోకి చీకటి చొరబడుతుందన్నారు. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు. ఆ తరువాత దాన్నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు. తనకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాన్ని నేర్పించిన రామమూర్తి తనకు ఒక గురువు కాగా మరొక గురువు ఉన్నారని ఆయనే ఇళయరాజా అని వారి పాదాలకు నమస్కారం చేస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు తాను చిన్న వయసు నుంచి చూస్తూ ఆశ్చర్యపడిన దర్శకుడు ఆర్కే సెల్వమణి అని, ఆయన ఆరి–2 కెమెరాతో చిత్రాలను చిత్రీకరించినా, పారా విజన్‌లో తీసినట్లు వుంటుందని అన్నారు. ఈ సందర్భంగా తాను ఆయనను ఒక కోరిక కోరుకుంటున్నానని, హిజ్రాలకు కూడా నటులుగా సభ్యత్వం కల్పించాలన్నదే ఆ కోరిక అన్నారు. దీనిపై స్పందించిన ఆర్కే సెల్వమణి సినీ పరిశ్రమకు చెందిన ఏ శాఖలో నైనా ఆసక్తి కలిగిన హిజ్రాలు చేరవచ్చునని చెప్పారు. బైలాస్‌లో కూడా ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. -
రోజా ఒక ఫైటర్..రాజకీయాల గురించి అడిగితే రోజా చెప్పే మాట..
-
'ప్రమాదానికి గురవుతున్న సినీకార్మికులకు సాయం అందడం లేదు'
బడ్జెట్లో సినీ కార్మికులకు నిధిని కేటాయించాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని ఫెఫ్సీ ఆవరణలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారత సినీ కార్మికుల పరిస్థితి ఇప్పటికీ శ్రమ, ప్రమాదాలతోనే నిండిపోయిందన్నారు. మూడేళ్లకోసారి సినీ నిర్మాతలతోనూ, బుల్లితెర నిర్మాతలతోనూ చర్చలు జరుపుతూ కార్మికుల వేతనాలను కొంచెం పెంచుకుందామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం కిందిస్థాయి కార్మికుల దాకా చేరడం లేదన్నారు. అదేవిధంగా షూటింగ్లో పనిచేసే కార్మికుల్లో ఇప్పటి వరకు 100కు పైగా ప్రమాదాల్లో మరణించారని, రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల షూటింగ్లో ప్రమాదవశాత్తూ మరణించే వారి కుటుంబాలకు మాత్రమే కాస్త సాయం అందుతుందని తెలిపారు. చిన్న చిత్రాల్లో ప్రమాదానికి గురైన వారికి ఎలాంటి సాయం అందట్లేదని పేర్కొన్నారు. సినీ కార్మికుల సాయం కోసం రానున్న వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం కొంత నిధిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 2010లో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కార్మికుల ఇళ్ల కోసం పైయనూర్‌లో స్థలాన్ని కేటాయించారని, అక్కడ స్టూడియోలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దానికి కలైంజర్ అనే పేరుతో ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారు. లైట్మెన్లకు సాయం కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిధిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని, అదేవిధంగా తమ సమాఖ్యలోని ఇతర కార్మికులకు సాయం అందించడానికి నిర్మాతలు, ప్రముఖ నటులు, సాంకేతిక నిపుణులు ముందుకు వస్తే బాగుంటుందని ఆర్కే సెల్వమణి కోరారు. -
శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్
హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. ఇది ఆమెకు 50వ చిత్రం కావడం మరో విశేషం. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ తాను దర్శకత్వం వహించిన పుళన్ విచారణై చిత్రం ట్రైలర్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. శింబు ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించడం అభినందనీయమన్నారు. ఆయన మంచి నటుడని, సకాలంలో చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే తమకు ఎన్ని పనులు ఉన్నా రోజూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అంతకంటే ముఖ్యచిత్రాలకు సంబంధించిన వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నిర్మాత మదియళగన్ సినిమా పరిశ్రమలో ప్రముఖులని, మహా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సెల్వమణి తెలిపారు. చదవండి: కాజల్ రీఎంట్రీ.. ఇండియన్ 2తో వస్తుందా? -
రూ. 100 కోట్లతో సినిమా నిర్మిస్తాం: ప్రొడ్యూసర్
తమిళనాడు సినీ దర్శకుల సంఘ సభ్యుల కోసం రూ.100 కోట్లతో సినిమాను నిర్మిస్తానని నిర్మాత కలైపులి ఎస్.థాను అన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో దర్శకుడు భాగ్యరాజా జట్టుపై ఆర్కే సెల్వమణి జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకారం కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఎన్నికల అధికారి సెంథిల్ నాథన్ సభ్యులతో పదవీ ప్రమాణం చేయించారు. దర్శకుడు భారతీరాజా అధ్యక్షతన దర్శకుడు విక్రమన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ దర్శకుల సంఘం సభ్యుల కోసం తాను రూ.100 కోట్ల బడ్జెట్‌తో చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నటీనటులందరూ అందులో నటించాలన్నారు. అందులో వచ్చిన లాభాన్ని దర్శకుల సంఘం, పెప్సీ సభ్యులందరూ పంచుకోవచ్చునని, ఆ చిత్రానికి దర్శకుడెవరు? కథ ఏమిటి? ఎవరెవరు నటిస్తారు అనేది దర్శకుల సంఘమే నిర్ణయించాలన్నారు. థాను నిర్ణయాన్ని సంఘం అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి స్వాగతించారు. ఆ చిత్రంలో ప్రముఖ నటీనటులదరూ నటించేలా మంచి కథను తయారుచేసిన దర్శకునికి రూ.50 లక్షలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆ చిత్రం ద్వారా వచ్చే లాభాన్ని సినీ కార్మికులందరికీ సమానంగా పంచుతామన్నారు. అదేవిధంగా సహ దర్శకులను ప్రోత్సహించే విధంగా ఏటా 70 మంది సహాయ దర్శకులతో లఘు చిత్రాలు రూపొందించడానికి సదుపాయాలు చేస్తామన్నారు. ఇకపై అసిస్టెంట్, అసోసియేట్ దర్శకులకు సంఘం ద్వారా వేతనాలను అందించనున్నట్లు వెల్లడించారు. -
ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలు
-
ఘనంగా రోజా భర్త సెల్వమణి బర్త్‌డే వేడుకలు
Roja Husband Rk Selvamani Birthday Celebrations: నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా ప్రొఫెషనల్ లైప్‌లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. పండుగలు, ఫంక్షన్లు, కుటుంబ సభ్యుల బర్త్‌డే వేడుకలకు మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా రోజా భర్త, డైరెక్టర్ ఆర్. కె. సెల్వమణి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే మై లవ్ అంటూ రోజా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. చదవండి: 'రకుల్ పెళ్లి ఆగిపోతుంది.. జైలుకు వెళ్లే అవకాశం'! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల సమక్షంలో సెల్వమణి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా సెల్వమణికి పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. చదవండి: నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్ View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) -
సెట్లో పూజా తీరుపై మండిపడ్డ ప్రముఖ డైరెక్టర్
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్డమ్ వచ్చాక సెట్లో తన తీరుతో నిర్మాతలకు అధిక భారం మోపుతుందంటూ ఆయన ఫైర్ అయ్యారు. కాగా పూజా ప్రస్తుతం దక్షిణాన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా అయిపోయింది. ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీతో పూజా ఓవరన్ నైట్ స్టార్ అయ్యింది. ఇప్పుడు సౌత్‌లోనే కాక బాలీవుడ్లో సైతం చక్రం తిప్పుతుంది. వరుసగా భారీ బడ్జేట్ చిత్రాలకు సైన్ చేసిన ఆమె చేతిలో దాదాపు పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. దీంతో తన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ ‘బుట్టబొమ్మ’ ఇటీవల రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెచ్చేసిన సంగతి తెలిసిందే. అలాంటి స్టార్ హీరోయిన్‌పై డైరెక్టర్ ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన షూటింగ్ సెట్లో పూజా తీరుపై మండిపడ్డారు. సెల్వమణి మాట్లాడుతూ.. ‘పూజా హెగ్డె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షూటింగ్ సెట్‌కు ఒకరిద్దరిని మత్రమే తన వెంట తీసుకుని వచ్చేది. కానీ ఇప్పుడు స్టార్డమ్ వచ్చాక తన టీంలో 12 మందిని వెంట తీసుకుని వస్తుంది. అంతమందిని సెట్‌కు తీసుకువస్తే నిర్మాతలు వారందరి ఖర్చులు భరించవలసి వస్తుంది. ఈ విధంగా పూజా నిర్మాతలపై అధిక భారం వేయడం ఎంతవరకు కరెక్ట్. ఇది సరైన పద్దతి కాదు. తన తీరు మార్చుకోవాలి’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా 2012లో పూజా తమిళ సినిమా ‘ముగమూడి’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో వచ్చిన ఒక ‘లైలా కోసం’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది. -
ఈ సమస్యలకు శింబునే కారణం: ఆర్కే సెల్వమణి
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలికి, దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ)కు మధ్య సమస్యకు నటుడు శింబునే కారణమని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి అన్నారు. శింబు ‘అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్’ మూవీ నిర్మాత మైఖెల్ రాయప్పన్‌కు ఆ చిత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. శింబు తీరుతోనే తాను నష్టపోయానని.. తనకు పరిహారం చెల్లించాలని రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. దీంతో రాయప్పన్‌కు శింబు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారు. లేనిపక్షంలో ఆయన నటిస్తున్న చిత్రాలకు ఎలాంటి సహకారం అందించబోమని ప్రకటించారు. అయినా శింబు చిత్రాలకు ఫెఫ్సీ కార్మికులు పని చేశారు. ఈ వ్యవహారంతో ఫెఫ్సీ, నిర్మాతల మండలి మధ్య సమస్యలు తలెత్తాయి. దీనిపై ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్మాతల మండలి విజ్ఞప్తి మేరకు శింబు నటిస్తున్న 4 చిత్రాలకు తాము కూడా ఎలాంటి సహకారం అందించలేదన్నారు. అయితే శింబు హీరోగా ఐసరిగణేష్ నిర్మిస్తున్న చిత్రం ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 4 రోజులు అనుమతి ఇవ్వాలని కోరాలన్నారు. నిర్మాతల మండలి అనుమతితోనే ఫెఫ్సీ కార్మికులు ఈ సినిమాకు పని చేశారని వివరించారు. సీఎం స్టాలిన్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఆయన పేర్కొన్నారు. -
వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకే షూటింగ్‌లోకి అనుమతి
చెన్నై: లాక్డౌన్ ముగిసి షూటింగులు ప్రారంభమైనా వ్యాక్సిన్ వేసుకున్న వారికే అనుమతి ఉంటుందని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు వ్యాక్సిన్ వేసుకున్న వారికే అనుమతి ఉంటుందని. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దాని బారిన పడి వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ నెల 31వ తేదీ వరకు సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లను నిలిపి వేస్తున్నట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి ప్రకటించారు. ఆయన తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ తర్వాత షూటింగులు ప్రారంభమైనప్పుడు అందులో పాల్గొనే వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని పేర్కొన్నారు. వారికే షూటింగ్లో పాల్గొనడానికి అనుమతి ఉంటుందని తెలిపారు. అందుకు తగిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని తెలిపారు. -
31 వరకు సినీ, టీవీ షూటింగ్స్ రద్దు.. అజిత్ 10 లక్షలు విరాళం
సాక్షి, చెన్నై: ఈ నెల 31వ తేదీ వరకు సినీ, టీవీ షూటింగులు నిర్వహించబోమని, కార్మికులను ప్రముఖ తారలు ఆదుకోవాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. కరోనా రెండో దశ ప్రాణాంతకంగా మారడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. దీంతో సినిమా పరిశ్రమ మరోసారి కష్టాల్లో పడింది. ముఖ్యంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ఆర్కే సెల్వమణి శనివారం వడపళని లోని ఫెఫ్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 18 టీవీ సీరియళ్ల షూటింగులు జరుగుతున్నాయని, వాటిని ఆదివారం నుంచి నిలిపి వేయనున్నట్టు పేర్కొన్నారు. కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖ నటీనటులు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై నటుడు అజిత్ స్పందించి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి వెల్లడించారు. -
మానవత్వం మరచిన తారలు
సినిమా: నటీనటులకు మానవత్వం లేదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. అది ఇప్పుడు భారత దేశాన్ని కూడా కలవరపెడుతోంది. నానాటికీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. పాలకులు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సినీ పరిశ్రమ కూడా అతీతం కాదు. ముఖ్యంగా దక్షణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు చెందిన సభ్యులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమాఖ్యలో 25 వేల మంది సభ్యులు ఉండగా, వీరిలో 18 వేల మంది రోజూవారీ వేతన కార్మికులే. వీరికి పనిచేస్తేగానీ పూట గడవని పరిస్థితి. దీంతో ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి ఆర్థికసాయంతో ఆదుకోవాలంటూ సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తికి చాలా అతి కొద్దిమంది మాత్రమే స్పందించారు. నటుడు శివకుమార్ కుటుంబం, నటుడు రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ లాంటి అతి కొద్ది మంది మాత్రమే ఫెఫ్సీకి ఆర్థికసాయం అందించారు. ఇందులో రజనీకాంత్ మాత్రమే భారీగా రూ. 50 లక్షలను సాయం చేశారు. దీంతో ఇతర ప్రముఖ నటీనటులు ఫెప్సీకి సాయంపై స్పందించకపోవడంపై ఆర్కే సెల్వమణి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలా మొత్తం మీద ఇప్పటి వరకు ఫెఫ్సీకి రూ. 1.60 కోట్లు, 25 కేజీలతో కూడిన 1,983 బస్తాల బియ్యం అందాయి. దీంతో సమాఖ్యలోని ఒక్కో సభ్యుడికి 25 కిలోల బియ్యం, రూ. 500 నగదు మాత్రమే సాయం చేయగలుగుతుందని, ఇది వారి కుటుంబానికి ఏ మాత్రం సరిపోదని అన్నారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో నటీనటులు కోట్ల రూపాయల్లో ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. అలాంటిది మన నటీనటులకు సాయం చేసే మానవత్వం లేకపోయిందని ఆర్కే సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు. -
19 నుంచి తమిళ చిత్రాల షూటింగ్స్‌కి బ్రేక్
తెలుగు చిత్రాల షూటింగ్స్ని ఆపివేయాలని ఆదివారం తెలుగు ఇండస్ట్రీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ చిత్రాల షూటింగ్స్ కూడా ఆగిపోనున్నాయి. ఈ నెల 19 నుంచి షూటింగ్స్ని ఆపివేస్తామని ‘ఫెఫ్సీ’ (దక్షిణ చలన చిత్ర కార్మికుల సమాఖ్య) సోమవారం ప్రకటించింది. ‘‘భారీ నష్టం జరుగుతుంది. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలి. నిర్ణయాలకు కట్టుబడాలి. మా కార్మికుల క్షేమమే మాకు ముఖ్యం. నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరూ మా నిర్ణయాన్ని ఆమోదించి ఈ 19 నుంచి షూటింగ్స్ ఆపివేయాలని విన్నవించుకుంటున్నాం’’ అని ‘ఫెఫ్సీ’ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్.కె. సెల్వమణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సినిమా షూటింగ్స్ మాత్రమే కాదు టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణను కూడా నిలిపివేయమని కోరారు. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలుపెట్టాలన్నది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని కూడా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విక్రమ్ ‘కోబ్రా’, అజిత్ ‘వలిమై’, శింబు ‘మానాడు’ చిత్రాల విదేశీ షెడ్యూల్స్ రద్దయ్యాయి. అన్ని చిత్రాల షూటింగ్స్ నిలివేయాలని సోమవారం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తెలుగు స్టూడియోలు ఖాళీగా ఉన్నట్లే తమిళ స్టూడియోలు కూడా ఖాళీగా ఉండబోతున్నాయి. -
తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి
పెరంబూరు : తమిళ సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన దర్శకుడు ఆర్కే.సెల్వమణి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల రాజకీయ ఎన్నికలను తలపించేలా గట్టి పోటీ మధ్య జరిగాయి. ప్రస్తుతం సంఘ కార్యవర్గం కాల వ్యవధి పూర్తి కావడంతో ఎన్నికలను నిర్వహించ తలపెట్టారు. కాగా గత నెలలో నిర్వహించిన 99వ సంఘ సర్వసభ్య సమావేశంలో దర్శకుడు భారతీరాజాను అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. అయితే ఆయన్ని ఏకగ్రీవంగా ఎంచుకోవడాన్ని సంఘంలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దర్శకుడు జననాథన్ సంఘ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని డిమాండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన భారతీరాజా తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కాగా ఈ నెల 14న జరగాల్సిన ఎన్నికలను 21వ తేదీకి వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో దర్శకుడు ఎస్పీ.జననాథన్, అమీర్ల నామినేషన్లను తిరష్కరించడంతో వారి వర్గం పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అధ్యక్ష పదవికి దర్శకుడు ఆర్కే.సెల్వమణి, విద్యాసాగర్ పోటీలో తలపడ్డారు. ఉపాధ్యక్ష పదవికి దర్శకుడు కేఎస్.రవికుమార్, రవిమరియ పోటీ పడ్డారు. ఉపకార్యదర్శి పదవికి దర్శకుడు లింగుసామి,సుందర్.సి సహా ఆరుగురు పోటీ చేశారు. అదే విధంగా కార్యవర్గ పదవులకు రమేశ్‌ఖన్నా, రాంకీ సహా 30 మంది పోటీ చేశారు. కాగా కార్యదర్శి పదవికి ఆర్వీ.ఉదయకుమార్, కోశాధికారి పదవికి పేరరసు ఏకగ్రీవంగా ఎంచుకోబడ్డారు. విగిలిన పదవులకు ఆవివారం ఉదయం చెన్నైలో జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓట్ల పోలింగ్ సాయంత్రం 4 గంటలకు పూర్తి అయ్యింది. ఎస్ఏ.చంద్రశేఖర్, కే.బాగ్యరాజ్ వంటి పలువురు దర్శకులు ఆసక్తిగా ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్శకుడు లింగుస్వామి, స్టాన్లీ కాగా ఈ సంఘంలో మొత్తం 1,900 మంది సభ్యులు ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో 1503 ఓట్లు పోలైయ్యాయి. కాగా వీటిలో దర్శకుడు ఆర్కే.సెల్వమణి 1,386 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందగా ఆయనకు పోటీగా నిలిచిన విద్యాసాగర్ కేవలం 100 ఓట్లనే రాబట్టుకుని ఓటమి పాలయ్యారు. అదే విధంగా ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేసిన దర్శకుడు కే ఎస్.రవికుమార్ 1,489 ఓట్లతో గెలుపొందారు. ఇతర వివరాలు వెల్లడించాల్సిఉంది. కాగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారికి శుభాకాంక్షలు అంటూ దర్శకుడు భారతీరాజా ముందుగానే మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అదే విధంగా ఈ ఎన్నికల పోటీ రాజకీయ పార్టీ ఎన్నికలను తలపించేవిధంగా జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.కాగా తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలుపొందిన దర్శకుడు ఆర్కే.సెల్వమణికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
‘ఫెఫ్సీతో ఒప్పందం అవసరం’
తమిళసినిమా: దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి నిర్మాతల మండలికి మధ్య ఒప్పందం అవసరం అని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ సమ్మె కారణంగా సినీ కార్మికులకు రూ.50 కోట్లు నష్టం వాటిల్లిందని అన్నారు. 50 ఏళ్ల సినీ చరిత్రలో 50 రోజుల పాటు సమ్మె కొనసాగడం, తమిళ ఉగాదికి కూడా కొత్త చిత్రాలు విడుదల కాకపోవడం ఇదే ప్రప్రథమం అని పేర్కొన్నారు. ఎట్టకేలకు చర్చల ద్వారా పరిష్కారం లభించి సమ్మె విరమణ కావడం సంతోషం అని, ఇందుకు ప్రభుత్వానికి, నిర్మాతల మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఫెఫ్సీలో మొత్తం 22 శాఖలున్నాయన్నారు. అందులో 12 శాఖలు ఒప్పందం విధానంలోనూ, 10 శాఖలు రోజూవారి వేతనాల విధానంలోనూ కొనసాగుతున్నాయని తెలిపారు. ఇకపై నిర్మాతల మండలిలో ఫెఫ్సీకి చెందిన 12 శాఖలకు చెందిన వారికి ఎంత పారితోషకం, ఎన్ని రోజులు షూటింగ్ అన్న అంశాల గురించి ఒప్పందం చేసుకుని నిర్మాతల మండలి నిర్వాహకుల సంతకాలతో కూడిన ఆ పత్రాలు ఫెఫ్సీకి అందిన తరువాతే టెక్నీషియన్స్ షూటింగ్‌కు వెళతారని చెప్పారు. అదే విధంగా రోజూవారి వేతనాల కార్మికులకు ఆ రోజు షూటింగ్ ముగిసిన వెంటనే చెల్లించాలని అన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి తెలిపారు. -
సయోధ్య దిశగా చర్చలు
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలికి దక్షణి భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ) మధ్య వేతనాలు, తదితర అంశాలపై కొంత కాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్య కారణంగా గత నెల ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఫెఫ్సీ సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. అయితే సమ్మె సరైన పరిష్కారం కాదన్న నటుడు రజనీకాంత్ హితవు మేరకు ఫెఫ్సీ ఆ సమ్మెను విరమించుకుంది. అయితే ఇటీవల ఫెఫ్పీకి వ్యతిరేకంగా కొత్త వారిని ఆహ్వానిస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటనలో పేర్కొనడంతో వారి నిర్ణయాన్ని ఖండిస్తూ ఫెఫ్సీ ఈ నెల ఒకటవ తేదీ నుంచి మళ్లీ సమ్మె బాట పట్టింది. అంతే కాదు నిర్మాతల మండలి చర్యలను ఖండిస్తూ ఐదవ తేదీన స్థానిక నుంగంబాక్కంలో గల వళ్లువర్‌కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే సమ్మె కొనసాగుతున్నా ఆందోళన నిర్ణయాన్ని ఫెఫ్సీ విరమించుకుంటున్నట్లు మంగళవారం ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి వెల్లడించారు. సోమవారం సాయంత్రం తమిళనిర్మాతల మండలి నిర్వాహకులు ఫెఫ్సీ నిర్వాహకుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఆ రోజు రాత్రి 12 గంటల వరకూ చర్చలు జరిగిన సమస్య ఒక కొలిక్కిరాలేదు. కాగా చర్చలు సయోద్య దిశగా సాగుతున్నాయని, ఫెఫ్సీ డిమాండ్లు నెరవేరబడతాయన్న ఆశాభావాన్ని ఈ సమాఖ్య అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి వ్యక్తం చేస్తూ మంగళవారం నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. -
నాకు నచ్చనది అదే: రజనీకాంత్!
చెన్నై: తనకు నచ్చని విషయాల్లో వర్క్ హాలిడే ఒకటని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళసినిమా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ)కి మధ్య వేతనాలు, విధి విధానాల విషయంలో విభేదాల కారణంగా ఫెఫ్సీ సమ్మెకు దిగడంతో మంగళవారం నుంచి చాలా వరకు చిత్రాల షూటింగ్‌లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి బృందం నిన్న ఉదయం నటుడు రజనీకాంత్‌ను కలిసి పరిస్థితులను వివరించారు. దీనిపై రజనీకాంత్ స్పందిస్తూ ఇరు సంఘాల వారు సామరస్య చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తనకు నచ్చని కొన్ని విషయాల్లో పని నిలిపివేయడం ఒకటన్నారు. ఎలాంటి సమస్య అయినా చర్చలతో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ మంగళ, బుధవారం 40కి పైగా చిత్రాల షూటింగ్‌లు రద్దయ్యాయని, అందులో రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం కూడా ఉందని పేర్కొన్నారు. కాలా షూటింగ్లో 150 మంది పని చేస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రజనీని కలిసి పరిస్థితి వివరించామన్నారు. ఆయన ఆనారోగ్యంతో ఉన్నా ఓపిగ్గా సమస్యను విన్నారని ఆర్కే.సెల్వమణి తెలిపారు. -
ఏ కారణంతోనూ షూటింగ్స్ ఆపం..!
పెరంబూరు: ఇకపై వేతనాల విషయంలోనే కాదు ఇతర ఎలాంటి కారణాలతోనూ షూటింగ్‌లను నిలిపివేసే ప్రయత్నాలు చేయమని దక్షిణ భారత సినీ కార్మికులు సమాఖ్య(ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొద్ది రోజులుగా తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులకు, ఫెఫ్సీ నిర్వాహకులకు మధ్య వేతన విషయాల గురించి వివాదం జరుగుతోంది. దీంతో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, ఫెఫ్సీకి చెందిన సభ్యులు లేకుండానే ఇతర కార్మికులతో షూటింగ్‌లు చేసుకుంటామని వెల్లడించారు. దీంతో ఆయనకు వాట్సాప్‌లో బెదిరింపులు వచ్చాయి.ఈ విషయమై విశాల్ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇకపై ఫెఫ్సీ సభ్యులెవరూ వేతనాలు విషయాల్లో షూటింగ్‌లను అడ్డుకోరని తెలిపారు. అదేవిధంగా ఫెఫ్సీ సభ్యుడు ధనపాల్, విశాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానన్నాని అన్నారు. ఇకపై నిర్మాతల మండలికి, ఫెఫ్సీకి మద్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా, నిర్మాతల మండలి, నడిగర్‌సంఘం, దర్శకుల సంఘాలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి చర్చలు జరుపుతామని తెలిపారు.అదే విధంగా విశాల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఫెఫ్సీ సభ్యుడు ధనపాల్ ఈ సందర్భంగా పత్రికాముఖంగా ఆయనకు క్షమాపణ చెప్పారు.