సినిమా సెట్‌లో ఊహించని అతిథి.. చిత్రయూనిట్‌కు అభినందనలు! | Kollywood Director RK Selvamani Visit Night Rose Cinema Sets | Sakshi
Sakshi News home page

RK Selvamani: షూటింగ్‌లో సెట్‌లో మంత్రి రోజా భర్త..!

Jan 21 2024 4:44 PM | Updated on Jan 21 2024 4:45 PM

Kollywood Director RK Selvamani Visit Night Rose Cinema Sets - Sakshi

పూంపారై మురుగన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రంజనీ నిర్మిస్తున్న చిత్రం నైట్‌రోస్‌. కయల్‌ ఆనంది కథానాయకిగా నటిస్తున్న ఇందులో ఆమెకు జంటగా నటుడు విజిత్‌ నటిస్తున్నారు. ఆర్‌కే సురేష్‌ విలన్‌గా వైవిధ్య భరిత పాత్రను పోషిస్తున్న ఇందులో రుసో శ్రీధరన్‌, శశిలయ, గణేష్‌, రామనాథన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రాజశేఖర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు సుశీగణేశన్‌ శిష్యుడు అన్నది గమనార్హం. జోగన్‌ శివనేష్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. 

ఇది సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. ఇందుకోసం భారీ సెట్‌ వేసి అత్యంత సహజంగా సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర కథ ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్‌ చివరి రోజున ప్రముఖ దర్శకుడు, ఏపీ మంత్రి రోజా భర్త ఆర్‌కే సెల్వమణి అనూహ్యంగా విజిట్‌ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారని దర్శకుడు పేర్కొన్నారు. నైట్‌రోస్‌ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement