స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్‌డమ్ వచ్చాక సెట్‌లో తన తీరుతో నిర్మాతలకు అధిక భారం మోపుతుందంటూ ఆయన ఫైర్ అయ్యారు. కాగా పూజా ప్రస్తుతం దక్షిణాన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అయిపోయింది. ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీతో పూజా ఓవరన్ నైట్ స్టార్ అయ్యింది. ఇప్పుడు సౌత్‌లోనే కాక బాలీవుడ్‌లో సైతం చక్రం తిప్పుతుంది. వరుసగా భారీ బడ్జేట్ చిత్రాలకు సైన్ చేసిన ఆమె చేతిలో దాదాపు పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. దీంతో తన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ ‘బుట్టబొమ్మ’ ఇటీవల రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెచ్చేసిన సంగతి తెలిసిందే.
అలాంటి స్టార్ హీరోయిన్‌పై డైరెక్టర్ ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన షూటింగ్ సెట్‌లో పూజా తీరుపై మండిపడ్డారు. సెల్వమణి మాట్లాడుతూ.. ‘పూజా హెగ్డె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షూటింగ్ సెట్‌కు ఒకరిద్దరిని మత్రమే తన వెంట తీసుకుని వచ్చేది. కానీ ఇప్పుడు స్టార్‌డమ్ వచ్చాక తన టీంలో 12 మందిని వెంట తీసుకుని వస్తుంది. అంతమందిని సెట్‌కు తీసుకువస్తే నిర్మాతలు వారందరి ఖర్చులు భరించవలసి వస్తుంది. ఈ విధంగా పూజా నిర్మాతలపై అధిక భారం వేయడం ఎంతవరకు కరెక్ట్. ఇది సరైన పద్దతి కాదు. తన తీరు మార్చుకోవాలి’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా 2012లో పూజా తమిళ సినిమా ‘ముగమూడి’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో వచ్చిన ఒక ‘లైలా కోసం’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment