మాపై నిందలు వేస్తూ.. కుట్రలకు పాల్పడుతున్నారు: ఆర్‌కే. సెల్వమణి | RK Selvamani Shocking Comments On Kollywood Producers Council, Check Out More Insights | Sakshi
Sakshi News home page

మాపై నిందలు వేస్తూ.. కుట్రలకు పాల్పడుతున్నారు: ఆర్‌కే. సెల్వమణి

Published Tue, Apr 1 2025 10:11 AM | Last Updated on Tue, Apr 1 2025 10:24 AM

RK Selvamani Comments On Kollywood Producers Council

తమిళ‌ నిర్మాతల మండలి,  దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మంధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాల మధ్య కొంత కాలంగా తీవ్రమైన ఆరోపణలు ఒకరిపైమరోకరు చేసుకుంటూనే ఉన్నారు. నిర్మాతల నుంచి కార్మికులకు అందే వేతనాల విషయంలో ఈ వివాదం రాజకుంది. తాజాగా ఇవి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో తమిళ‌ నిర్మాతల మండలి కార్మికులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి పోటీగా తమిళ్‌ సినీ కార్మికుల సమాఖ్యను ఎర్పాటు చేస్తున్నట్లు ప్రచారం వెలుగులోకి వచ్చింది.

తమిళ్‌ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఇటీవల ఒక దిన పత్రికలో ప్రకటన వెలువడింది. దీంతో  దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే. సెల్వమణి  చెన్నైలో  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  తాము నిర్మాతల మండలి కోసం ఎంతగానో దిగొచ్చామని చెప్పారు. కార్మికుల వేతనాల నుంచి చాలా విషయాల్లో నిర్మాతకు సహకరిస్తున్నామన్నారు. అయితే వారిలో ఐక్యత లేక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే  కొత్తగా తమిళ్‌ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో సంఘాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇటీవల  ఓ దినపత్రికలో తమిళ్‌ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు.  ఈ ప్రకటన వెనుక తమిళ్‌ నిర్మాతల మండలి ఉందని తెలిసిందని సెల్వమణి అన్నారు. నిర్మాతల మండిలి తెలివిగా మా మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందన్నారు.

కుట్రలు పాల్పడుతోంది వారే.. 
కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా  దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లడని సెల్వమణి అన్నారు. కారణం తమ సమాఖ్య అంత కట్టుదిట్టంగా ఉందని , వారి శ్రేయస్సు కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.  ఇకపోతే నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్‌లను తమిళనాడులో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో చేస్తున్నారని, అందువల్ల తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. తప్పని సరి అయితేనే తమిళ చిత్రాల షూటింగ్‌లను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే బాగుంటుందని, తమిళ చిత్రాలను నమ్ముకుని 25 వేల మంది కార్మికుల ఉన్నారని ఆర్‌కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈ విషయంలో నటీనటులు కూడా ఆలోచించాలన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement