తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి | RK Selvamani Elected As Tamil Film Directors Union President | Sakshi
Sakshi News home page

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

Published Mon, Jul 22 2019 7:34 AM | Last Updated on Mon, Jul 22 2019 7:35 AM

RK Selvamani Elected As Tamil Film Directors Union President - Sakshi

పెరంబూరు : తమిళ సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన దర్శకుడు ఆర్‌కే.సెల్వమణి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల రాజకీయ ఎన్నికలను తలపించేలా గట్టి పోటీ మధ్య జరిగాయి. ప్రస్తుతం సంఘ కార్యవర్గం కాల వ్యవధి పూర్తి కావడంతో ఎన్నికలను నిర్వహించ తలపెట్టారు. కాగా గత నెలలో నిర్వహించిన 99వ సంఘ సర్వసభ్య సమావేశంలో దర్శకుడు భారతీరాజాను అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. అయితే ఆయన్ని ఏకగ్రీవంగా ఎంచుకోవడాన్ని సంఘంలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దర్శకుడు జననాథన్‌ సంఘ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని డిమాండ్‌ చేశారు. దీంతో మనస్తాపం చెందిన భారతీరాజా తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కాగా ఈ నెల 14న జరగాల్సిన ఎన్నికలను  21వ తేదీకి వాయిదా వేశారు.

ఈ ఎన్నికల్లో దర్శకుడు ఎస్‌పీ.జననాథన్, అమీర్‌ల నామినేషన్లను తిరష్కరించడంతో వారి వర్గం పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అధ్యక్ష పదవికి దర్శకుడు ఆర్‌కే.సెల్వమణి, విద్యాసాగర్‌ పోటీలో తలపడ్డారు. ఉపాధ్యక్ష పదవికి దర్శకుడు కేఎస్‌.రవికుమార్, రవిమరియ పోటీ పడ్డారు. ఉపకార్యదర్శి పదవికి దర్శకుడు లింగుసామి,సుందర్‌.సి సహా ఆరుగురు పోటీ చేశారు. అదే విధంగా కార్యవర్గ పదవులకు రమేశ్‌ఖన్నా, రాంకీ సహా 30 మంది పోటీ చేశారు. కాగా కార్యదర్శి పదవికి ఆర్‌వీ.ఉదయకుమార్, కోశాధికారి పదవికి పేరరసు ఏకగ్రీవంగా ఎంచుకోబడ్డారు. విగిలిన పదవులకు ఆవివారం ఉదయం చెన్నైలో జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓట్ల పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు పూర్తి అయ్యింది. ఎస్‌ఏ.చంద్రశేఖర్, కే.బాగ్యరాజ్‌ వంటి పలువురు దర్శకులు ఆసక్తిగా ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.


 దర్శకుడు లింగుస్వామి, స్టాన్లీ  

కాగా ఈ సంఘంలో మొత్తం 1,900 మంది సభ్యులు ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో  1503 ఓట్లు పోలైయ్యాయి. కాగా వీటిలో దర్శకుడు ఆర్‌కే.సెల్వమణి 1,386 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందగా ఆయనకు పోటీగా నిలిచిన విద్యాసాగర్‌ కేవలం 100 ఓట్లనే రాబట్టుకుని ఓటమి పాలయ్యారు. అదే విధంగా ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేసిన దర్శకుడు కే ఎస్‌.రవికుమార్‌ 1,489 ఓట్లతో గెలుపొందారు. ఇతర వివరాలు వెల్లడించాల్సిఉంది. కాగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారికి శుభాకాంక్షలు అంటూ దర్శకుడు భారతీరాజా ముందుగానే మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అదే విధంగా ఈ ఎన్నికల పోటీ రాజకీయ పార్టీ ఎన్నికలను తలపించేవిధంగా జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.కాగా తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలుపొందిన దర్శకుడు ఆర్‌కే.సెల్వమణికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement