Tamil Directors Association
-
ఆగస్టులో నిర్మాతల మండలి ఎన్నికలు?
తమిళ నిర్మాతల మండలి ఎన్నికలను ఆగస్టులో నిర్వహించే అవకాశమున్నట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈ మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన విశాల్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. కొందరు నిర్మాతలు మండలి కార్యాలయంపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మండలి వ్యవహారం కోర్టుకెక్కింది. న్యాయస్థానం తమిళ నిర్మాతల మండలికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా జూన్ 30లోపు నిర్మాతల మండలి ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఆదేశించింది. మేలో ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు జరిగాయి. కరోనా వ్యాధి ప్రబలడంతో ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కొందరు నిర్మాతలు కోర్టు ను ఆశ్రయించారు. చదవండి: బాయ్‌కాట్ సల్మాన్ కోర్టు నిర్మాతల మండలి ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాల ని ఆదేశించింది. తాజాగా మండలి ఎన్నికలను ఆగస్టులో నిర్వహించడానికి సన్నాహాలు జరు గుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలకు హైకో ర్టు పూర్వ న్యాయమూర్తి జయచంద్రన్‌ను ఎన్నికల అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సారి నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి నిర్మాత మురళి, టి శివ పోటీ పడుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమ జట్లను ప్రకటించారు. వీరితో పాటు తాజాగా నిర్మాత కలైపులి దాను, టీ జీ.త్యాగరాజన్, నటుడు విశాల్ కూడా పోటీ చేసే అవాశం ఉందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. చదవండి: సుశాంత్ మామూ బతికే ఉన్నాడు! -
తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి
పెరంబూరు : తమిళ సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన దర్శకుడు ఆర్కే.సెల్వమణి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల రాజకీయ ఎన్నికలను తలపించేలా గట్టి పోటీ మధ్య జరిగాయి. ప్రస్తుతం సంఘ కార్యవర్గం కాల వ్యవధి పూర్తి కావడంతో ఎన్నికలను నిర్వహించ తలపెట్టారు. కాగా గత నెలలో నిర్వహించిన 99వ సంఘ సర్వసభ్య సమావేశంలో దర్శకుడు భారతీరాజాను అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. అయితే ఆయన్ని ఏకగ్రీవంగా ఎంచుకోవడాన్ని సంఘంలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దర్శకుడు జననాథన్ సంఘ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని డిమాండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన భారతీరాజా తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కాగా ఈ నెల 14న జరగాల్సిన ఎన్నికలను 21వ తేదీకి వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో దర్శకుడు ఎస్పీ.జననాథన్, అమీర్ల నామినేషన్లను తిరష్కరించడంతో వారి వర్గం పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అధ్యక్ష పదవికి దర్శకుడు ఆర్కే.సెల్వమణి, విద్యాసాగర్ పోటీలో తలపడ్డారు. ఉపాధ్యక్ష పదవికి దర్శకుడు కేఎస్.రవికుమార్, రవిమరియ పోటీ పడ్డారు. ఉపకార్యదర్శి పదవికి దర్శకుడు లింగుసామి,సుందర్.సి సహా ఆరుగురు పోటీ చేశారు. అదే విధంగా కార్యవర్గ పదవులకు రమేశ్‌ఖన్నా, రాంకీ సహా 30 మంది పోటీ చేశారు. కాగా కార్యదర్శి పదవికి ఆర్వీ.ఉదయకుమార్, కోశాధికారి పదవికి పేరరసు ఏకగ్రీవంగా ఎంచుకోబడ్డారు. విగిలిన పదవులకు ఆవివారం ఉదయం చెన్నైలో జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓట్ల పోలింగ్ సాయంత్రం 4 గంటలకు పూర్తి అయ్యింది. ఎస్ఏ.చంద్రశేఖర్, కే.బాగ్యరాజ్ వంటి పలువురు దర్శకులు ఆసక్తిగా ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్శకుడు లింగుస్వామి, స్టాన్లీ కాగా ఈ సంఘంలో మొత్తం 1,900 మంది సభ్యులు ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో 1503 ఓట్లు పోలైయ్యాయి. కాగా వీటిలో దర్శకుడు ఆర్కే.సెల్వమణి 1,386 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందగా ఆయనకు పోటీగా నిలిచిన విద్యాసాగర్ కేవలం 100 ఓట్లనే రాబట్టుకుని ఓటమి పాలయ్యారు. అదే విధంగా ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేసిన దర్శకుడు కే ఎస్.రవికుమార్ 1,489 ఓట్లతో గెలుపొందారు. ఇతర వివరాలు వెల్లడించాల్సిఉంది. కాగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారికి శుభాకాంక్షలు అంటూ దర్శకుడు భారతీరాజా ముందుగానే మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అదే విధంగా ఈ ఎన్నికల పోటీ రాజకీయ పార్టీ ఎన్నికలను తలపించేవిధంగా జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.కాగా తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలుపొందిన దర్శకుడు ఆర్కే.సెల్వమణికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
విక్రమన్ టీంకే పట్టం
తమిళసినిమా: ఆదివారం జరిగిన తమిళ దర్శకుల సంఘం ఎన్నికల్లో దర్శకుడు విక్రమన్ జట్టుకే పట్టం కట్టారు. స్థానిక వడపళనిలోని సంగీత కళా కారుల కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో పుదువసంతం, పుదియఅలైగళ్ వర్గాల మధ్య పోటీ జరిగినా, పుదువసంతం నుంచి అధ్యక్షపదవి బరిలో ఉన్న విక్రమన్, కార్యదర్శి పదవి పోటీల్లో ఉన్న ఆర్కే సెల్వమణిలతో పుదియ అలైగళ్ వర్గం పోటీ పెట్టలేదు. మిగిలిని పదవులు ఉపాధ్యక్షుడు, ఉప కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పదవులకు పోటీ జరిగింది. అయితే ఈ సారి కూడా విక్రమన్ వర్గమే విజయకేతం ఎగురవేసింది. కాగా దర్శకుడు విక్రమన్ తమిళ దర్శకుల సంఘం అధ్యక్షపదవికి మూడోసారి ఎంపికయ్యారన్నది గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ సంఘానికి కార్యదర్శిగా ఎంపికైన ఆర్కే సెల్వమణి ఫెఫ్సీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఫెఫ్సీకీ తమిళ నిర్మాతల మండలికి మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం కనిపించడం లేదు. సభ్యుల వేతనాల విషయంలో నిబంధనలు పాటించాలని ఫెఫ్సీ, మీకు మీరుగా విధించుక్ను నిబంధనలను తాము పాటించేది లేదని తమిళ నిర్మాతల మండలి పట్టుపడుతుండడంతో సమస్య జఠిలంగా మారింది. దీంతో మంగళవారం నుంచి ఫెఫ్సీ సమ్మెబాట పట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా తాము షూటింగ్‌లు నిర్వహిస్తామని నిర్మాతల మండలి ప్రకటన చేయడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన తమిళ చిత్ర పరిశ్రమలో నెలకొంది. ఈ విషయంలో ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్కే.సెల్వమణి తమిళ దర్శకుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో దర్శకుల సంఘం ఈ వివాదంలో ఏ పక్షాన నిలుస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.