మారుతీ ఫిలిమ్స్, టచ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల అధినేతలు ఎస్.రాధాకృష్ణన్, ఎస్.హరి కలిసి నిర్మిస్తున్న చిత్రం డెవిల్. సవరకత్తి చిత్రం ఫేమ్ ఆదిత్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు మిష్కిన్ సంగీత దర్శకుడుగా పరిచయం కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన ఒక పాట పాడి కీలక పాత్రను పోషించారు. కాగా నటుడు విదార్థ్, పూర్ణ, ఆదిత్ అరుణ్, శుభశ్రీ రాయ్ గురు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర ఆడియో శుక్రవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ముందుగా మిష్కిన్ నేతృత్వంలో లైవ్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు, పెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, బాల, వెట్రిమారన్, నిర్మాత థాను పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
సంగీత దర్శకుడిగా పరిచయం అయిన మిష్కిన్ మాట్లాడుతూ కథలన్నీ ఒక కథ నుంచే పుడుతాయన్నారు. అదే విధంగా ఈ డెవిల్ చిత్ర కథ అలాంటిదేనని పేర్కొన్నారు. ఒక ప్రశాంతమైన ఇంటిలోకి చీకటి చొరబడుతుందన్నారు. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు. ఆ తరువాత దాన్నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు. తనకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాన్ని నేర్పించిన రామమూర్తి తనకు ఒక గురువు కాగా మరొక గురువు ఉన్నారని ఆయనే ఇళయరాజా అని వారి పాదాలకు నమస్కారం చేస్తున్నానని పేర్కొన్నారు.
దర్శకుడు తాను చిన్న వయసు నుంచి చూస్తూ ఆశ్చర్యపడిన దర్శకుడు ఆర్‌కే సెల్వమణి అని, ఆయన ఆరి–2 కెమెరాతో చిత్రాలను చిత్రీకరించినా, పారా విజన్‌లో తీసినట్లు వుంటుందని అన్నారు. ఈ సందర్భంగా తాను ఆయనను ఒక కోరిక కోరుకుంటున్నానని, హిజ్రాలకు కూడా నటులుగా సభ్యత్వం కల్పించాలన్నదే ఆ కోరిక అన్నారు. దీనిపై స్పందించిన ఆర్‌కే సెల్వమణి సినీ పరిశ్రమకు చెందిన ఏ శాఖలో నైనా ఆసక్తి కలిగిన హిజ్రాలు చేరవచ్చునని చెప్పారు. బైలాస్‌లో కూడా ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment