Actor Simbu Childhood Pic Viral - Sakshi
Sakshi News home page

Guess The Actor: ఈ హీరోకి చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్.. అందరూ హీరోయిన్లే!

Published Mon, Aug 7 2023 1:58 PM | Last Updated on Mon, Aug 7 2023 2:54 PM

Actor Simbu Childhood Pic Viral - Sakshi

చాలామంది హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. ఈ కుర్రాడికి మాత్రం స్టార్ హీరోయిన్లు పడిపోతారు. కలిసి సినిమాలు చేయడం లేటు.. ఆ బ్యూటీతో ఎఫైర్ పెట్టుకున్నాడనే రూమర్స్ వస్తాయి. అవి నిజమనేలా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తాయి. ఆ హీరో చిన్నప్పటి ఫొటో ఇప్పుడు ఒకటి వైరల్ అయింది. మరి అతడెవరో కనిపెట్టారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి తండ్రి యాక్టర్ కమ్ డైరెక్టర్. దీంతో చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు 17 ఏళ్ల పాటు పలు సినిమాల్లో నటించాడు. అవును మీరు ఊహించింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఎవరో కాదు హీరో శింబు. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకు మనోడు బాగానే తెలుసు. 'మన్మథ', 'వల్లభ' చిత్రాలతో అప్పట్లోనే తెలుగులో పాపులారిటీ సంపాదించాడు. కాకపోతే ఆ సక్సెస్‌ని‌ నిలబెట్టుకోలేకపోయాడు.

(ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్‌గా చేసింది!)

2002లో హీరోగా సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన శింబు.. 2004లో 'మన్మథ', 2006లో 'వల్లభ' లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌తో హిట్స్ కొట్టాడు. 2010లో 'ఏ మాయ చేశావె' తమిళ రీమేక్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే శింబు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ తమిళంలో అంతంత మాత్రంగానే ఆడేవి. ఇక్కడ అసలు రిలీజయ్యేవి కావు. దీంతో తెలుగు ఆడియెన్స్‌కి శింబు మెల్లగా దూరమైపోయాడు. ఈ మధ్య కాలంలో మళ్లీ 'మానాడు', 'పాతు తలా' చిత్రాలతో విజయాలు అందుకుని.. సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు.

సినిమాల గురించి పక్కనబెడితే కెరీర్ ప్రారంభంలో నయనతారతో రిలేషన్ మెంటైన్ చేశాడు. శింబు-నయన్ ముద్దులు పెట్టుకున్న ఫొటోలు అప్పట్లో హాట్ టాపిక్. ఆ తర్వాత త్రిష, హన్సిక, నిధి అగర్వాల్.. ఇలా చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు తెగ రూమర్స్ వచ్చాయి. ఓ దశలో నిధి అగర్వాల్‌ని శింబు పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ అది ఇప్పటికే రూమర్ గానే మిగిలిపోయింది. అలాంటి శింబు చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్స్ ఈ విషయాల్ని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement