సూర్య నిర్మాణంలో ఆయన తమ్ముడు కార్తీ హీరోగా వచ్చిన సినిమా చినబాబు. ఫ్యామిలీ నేపథ్యంలో, కుటుంబ బంధాలను చక్కగా చూపించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. ఇటీవలె ఖాకీతో హిట్ కొట్టిన కార్తీకి ‘చినబాబు’తో మరో హిట్ వచ్చింది.
సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నందుకు ఈ చిత్ర నిర్మాత సూర్య సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. ‘థియేటర్‌లో ప్రేక్షకులందరూ.. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. హాయిగా నవ్వుకుంటున్నారు. నేనూ మనస్పూర్తిగా నవ్వుకున్నాను, కన్నీటిని ఆపుకోలేకపోయాను. దర్శకుడు పాండ్యరాజ్, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. మా చిత్రం తరుపున ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.
To see the whole theatre laugh and connect with the emotions is bliss!!I laughed my heart out,n couldnt stop my tears..Thank you @pandiraj_dir and entire team!! Happy for you @Karthi_Offl .We #KadaikuttiSingam #Chinnababu team thank audience for blessing us with all the love. pic.twitter.com/t4HX6fGSTd
— Suriya Sivakumar (@Suriya_offl) July 14, 2018
Comments
Please login to add a commentAdd a comment