chinababu
-
వై ఎస్ ఆర్ సి పీలో మాజీ మార్కెటింగ్ చైర్మన్ గునిశెట్టి చినబాబు
-
చినబాబు అరెస్ట్, జ్యోతికి బ్లూ కార్నర్ నోటీస్!
సాక్షి, అమరావతి: విజిటింగ్ వీసాలతో మోసం చేస్తున్న ఏజెంట్ల ఏరివేతకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా మహిళలను అక్రమంగా విదేశాలకు పంపుతున్న ఏజెంట్ చినబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ‘జగనన్నా.. మమ్మల్ని కాపాడన్నా’ అని బోరున విలపిస్తూ పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు మహిళలు దుబాయ్ నుంచి వీడియో క్లిప్పింగ్ పంపిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ మీడియా దృష్టికి వచ్చిన ఆ వీడియోను డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు పంపించగా.. స్పందించిన ఆయన అలాంటి ఏజెంట్ల ఏరివేత బాధ్యతలను సీఐడీ విభాగానికి అప్పగించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆ వీడియోలో.....‘తమను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రధాన ఏజెంట్ జ్యోతి, మరో ఏజెంట్ దొండ వెంకట సుబ్బారావు (చినబాబు) ఎవరికో అమ్మేశారని బాధిత మహిళలు’ ఆరోపించడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఏజెంట్ చినబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి నుంచి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే జ్యోతి అనే ప్రధాన ఏజెంట్ దుబాయ్‌లో కార్యాలయాన్ని నడుపుతున్నట్టు తెలిసింది. ఆమెను ఇండియాకు రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయనున్నారు. దుబాయ్‌లో బాధిత మహిళలు ఎవరైనా ఉంటే రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మొగల్తూరుకు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో ఒక ఏజెంట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చదవండి: ఎడారి దేశంలో తడారిన బతుకులు ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొంతమంది మహిళలు.. ఏజెంట్ల మోసంతో తాము దుబాయ్‌లో చిక్కుకుపోయామని, కాపాడాలంటూ పంపిన వీడియో వైరల్ అయిందన్నారు. పాలకొల్లుకు చెందిన చినబాబు మహిళలను ఎంపిక చేసి గల్ఫ్ దేశాలకు పంపుతున్నట్లు చెప్పారు. లైసెన్స్ లేకుండా జిల్లాలోని కొందరు ఏజెంట్లు గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. నాగలక్ష్మి అనే మహిళ వద్ద నుంచి లక్ష రూపాయలు తీసుకుని, ఆమెను టూరిస్ట్ వీసాపై నర్సు ఉద్యోగానికి దుబాయ్ పంపాడని, ఆమెతో పాటు మరో అయిదుగురు మహిళా బాధితులు ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ అక్రమ రవాణాపై జిల్లాలో రెండు, రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇక దుబాయ్‌లో ఉండే జ్యోతి అనే మహిళ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలను దుబాయ్‌లో రిసీవ్ చేసుకుంటుందని తెలిపారు. ఎస్పీలను అప్రమత్తం చేశాం బాధిత మహిళల వీడియో క్లిప్పింగ్‌ను అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించాం. మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లతోపాటు మహిళలు, బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్ చేయాలని ఆదేశించాం. మహిళలు తమ సమస్యలను 112, 181, 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు. వాట్సాప్ నంబర్ 91212 11100కు సమాచారం ఇచ్చినా సహాయం అందుతుంది. -గౌతమ్ సవాంగ్, డీజీపీ -
ప్రేమికులరోజున ‘దేవ్’
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న దేవ్ సినిమా డేట్ ఫిక్స్ అయ్యింది. కార్తీ కథానాయకుడిగా నటించిన ధీరన్ అధికారం ఒండ్రు, కడైకుట్టి సింగం చిత్రాలు వరుసగా విజయం సాధించటంతో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం దేవ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రజత్ రవిశంకర్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న ఈ మూవీలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం తరువాత కార్తీతో ఈ బ్యూటీ నటిస్తున్న రెండవ చిత్రం ఇది. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న దేవ్ చిత్ర షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర తమిళ ఆడియో ఇటీవల విడుదలైంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర గీతాలకు మంచి స్పందన వస్తోందని చిత్రవర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో దేవ్ చిత్ర విజయంపై చాలా ధీమాగా ఉన్నారు. ఇది లవ్, యాక్షన్ సన్నివేశాలతో కూడిన రోడ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. దేవ్ చిత్రాన్ని ఫిబ్రవరి తొలివారంలోనే విడుదల చేయాలని చిత్ర వర్గాలు ముందు నిర్ణయించుకున్నారట. అయితే నిర్మాణ కార్యక్రమాలు కాస్త ఆలస్యం కావడంతో చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. -
కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి
తమిళసినిమా: కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి అని నటుడు సూర్య తన అభిమానులకు హితవు పలికారు. నటుడు, నిర్మాత సూర్య ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. సోదరుడు కార్తీ కథానాయకుడిగా, ఆయన నిర్మించిన కడైకుట్టిసింగం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇక సోమవారం ఆయన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సూర్య అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానం, రక్తదానం అంటూ పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్య తన అభిమానులనుద్ధేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో తన కొత్త అనుభవాలను, అభిమానులు ఆచరించాల్సిన విషయాలను తెలిపారు. అవేమిటో చూద్దాం. నేను చిన్నతనంలో తొలుత సైకిల్ కొనుక్కోవాలని ఆశ పడ్డాను. ఆ తరువాత మోటార్‌బైక్ కొనమని నాన్నను ఒత్తిడి చేశాను. ఆ తరువాత కారు ఇలా జీవితంలో కొత్త కొత్త విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. అదే విధంగా కళాశాల చదువు, ఉద్యోగం, వివాహం అంటూ జీవితం సాగిపోతుంది. ఇలా ఒక్కో వ్యక్తి జీవితంలో ఒక్కోరకమైన ఆసక్తి కలుగుతుంది. అయితే కొందరికి అలాంటి ఆసక్తి తగ్గుతూ పోతోందనిపిస్తుంది. ఇక చాలులే, అనే అసహనం ఏర్పడుతుంది. అయితే అలా కాకుండా ఇది చాలదు. ఇంకా తెలుసుకోవాలి. కొత్త కొత్త అనుభవాలు పొందాలని కోరుకోవాలి. చేసే పనిలో నేనే బెస్ట్ అనుకోవాలి. జీవితంలో సంతోషం చాలా ముఖ్యం. ఏ కారణంగానూ సంతోషాన్ని మనం వదులుకోకూడదు. అయితే డబ్బు మాత్రమే సంతోషాన్నివ్వదు. మనసును సంతోషంగా ఉంచుకోవడం ఒక కళ. ఎంత విద్యావేత్త అయినా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎవరూ దరి చేరరు. అదే ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తే కారణం లేకుండానే పది మంది చుట్టూ చేరతారు. ఎవరూ ఎవరితోనూ పోల్చుకోకూడదు. అది అనవసరంగా మనస్తాపానికి గురి చేస్తుంది. అభిమానులు నాపై ఎనలేని అభిమానం కురిపిస్తున్నారు. అంతే అభిమానం నాకు మీపై ఉంది. వయసు అయిపోతూనే ఉంటుంది. అంతలోగానే ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అవయవదానం, రక్తదానం చేస్తూ సేవాకార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న నా అభిమానులు ఎవరికీ బానిసలుగా ఉండనవసరం లేదు. అలా ఉండరని భావిస్తున్నాను. మంచి అలవాట్లను అలవరచుకోండి. అన్నింటి కంటే ముఖ్యం తల్లిదండ్రులకు ప్రాధాన్యతనివ్వండి అని సూర్య పేర్కొన్నారు. ఈయన నటుడు, నిర్మాతగా ఉంటూనే అగరం ఫౌండేషన్ ద్వారా విద్యాదానంతో పాటు పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.సూర్య వాణిజ్య ప్రకటనలోనూ ఎక్కువగానే నటిస్తున్నారు. అయితే తద్వారా వచ్చిన మొత్తాన్ని అగరం ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలకు కేటాయిస్తున్నారన్నది గమనార్హం. -
కార్తీ చిత్రానికి ఉప రాష్ట్రపతి ప్రశంసలు
తమిళసినిమా: కార్తీ కథానాయకుడిగా సూర్య నిర్మించిన కడైకుట్టి సింగం చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. నటుడు సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై ఆయన సోదరుడు కార్తీ హీరోగా నిర్మించిన చిత్రం కడైకుట్టి సింగం. నటి సాయేషా సైగల్, ప్రియ భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి పసంగ పాండిరాజ్ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో రైతు కుటుంబాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇదే చిత్రం తెలుగులో చినబాబు పేరుతో అనువాదమై విడుదలైంది. విశేషం ఏమిటంటే తెలుగు వెర్షన్ చినబాబు చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిలకించడం. చిత్రం చూసిన ఆయన తన ట్విట్టర్లో ప్రశంసించారు. ప్రజలపై, సమాజంపై చాలా ప్రభావాన్ని చూపే మాధ్యమం సినిమా అని నమ్మే ఆయన సమీపకాలంలో చినబాబు (తమిళంలో కడైకుట్టి సింగం) చిత్రం చూశాను. గ్రామీణ నేపథ్యంలో, మన జీవన విధానాన్ని, విస్మరిస్తున్న అంశాలను, సంస్కృతి, సంప్రదాయాలను అసభ్యతకు తావులేకుండా చూపిన మంచి చిత్రం అని పేర్కొన్నారు.వెంకయ్యనాయుడు ప్రశంసలకు చినబాబు (కడైకుట్టి సింగం) చిత్ర నిర్మాత సూర్య ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అధినేత శక్తివేల్ మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఖమ్మంలో కార్తీ సందడి
ఖమ్మంకల్చరల్ : ప్రముఖ తమిళ హీరో, సూర్య సోదరుడు, కార్తీ ఖమ్మంలో సోమవారం సందడి చేశారు. ఆయన నటించిన చినబాబు చిత్రం ప్రదర్శితమవుతున్న ఆదిత్య థియేటర్‌కు విచ్చేయడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సినిమా హాల్ లోపల అభిమానులందరికీ కార్తీ అభివాదవం చేస్తూ పలకరించారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ..కళాకారుల గుమ్మం ఖమ్మంలో విజయోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సినిమాను, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. ఎల్లప్పుడూ ఇదే ఆదరాభిమానాలను కొనసాగించాలని కోరారు. అనంతరం థియేటర్ వారు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. మహిళలకు హీరోకార్తీ చీరలు పంపిణీ చేశారు. తమ హీరోతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అంతా ఉత్సాహం చూపారు. కార్యక్రమంలో చిత్ర సహ నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, థియేటర్ యజమాని కాంపాటి పిచ్చయ్య, మేనేజర్ బెల్లంకొండ శ్రీనివాస్, హీరో కార్తీ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు. -
సక్సెస్మీట్కు ఆటోలో వచ్చిన కార్తీ
-
వైరల్.. ఆటోలో ‘చినబాబు’
నా పేరు శివ, ఆవారా సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ గతేడాది ఖాకీ సినిమాతో హిట్‌కొట్టి మంచి ఫామ్‌లోకి వచ్చాడు. రీసెంట్గా చినబాబుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించాడు. కుటుంబ కథా, రైతు, గ్రామీణ వాతావరణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో సూర్య నిర్మించారు. ఈ సినిమా యూనిట్ సక్సెస్మీట్లు నిర్వహిస్తూ ఉంది. వీటికి హాజరయ్యేందుకు విచ్చేస్తోన్న కార్తీ.. ట్రాఫిక్, వర్షం కారణంగా ఆలస్యమవుతుండటంతో.. ఏమాత్రం ఆలోచించకుండా ఆటోలో కార్యక్రమానికి వచ్చాడు. కార్తీ అలా రావడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
‘చినబాబు’పై వెంకయ్య ప్రశంసలు
ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు రావడం అరుదే. కార్తీ హీరోగా వచ్చిన ‘చినబాబు’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తోంది. పల్లె వాతావరణం, రైతు నేపథ్యం, కుటుంబం, బంధాలు, ప్రేమలు, అనురాగాలతో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. ‘వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో ‘చినబాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తీకి అభినందనలు. ఇటీవల కాలంలో నేను చూసిన మంచి సినిమా ‘చినబాబు’. అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా రూపొందిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్దతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాదభరితంగా రూపొందిన చినబాబు సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం’ అంటూ ట్వీట్ చేశారు. వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో “చినబాబు” చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తికి అభినందనలు. #Chinababu @Karthi_Offl @Suriya_offl pic.twitter.com/EVfusXKMzZ — VicePresidentOfIndia (@VPSecretariat) 16 July 2018 ఇటీవల కాలంలో నేను చూసిన మంచి సినిమా “చినబాబు”. అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా రూపొందిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్ధతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాద భరితంగా రూపొందిన “చినబాబు” సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం. #Chinababu @Karthi_Offl @Suriya_offl — VicePresidentOfIndia (@VPSecretariat) 16 July 2018 -
సిటీలో ‘చినబాబు’
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): నగరంలో చినబాబు చిత్ర యూనిట్ సందడి చేసింది. చినబాబు చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా ఆదివారం జగదాంబ థియేటర్లో హీరో కార్తి అభిమానులతో సరదగా మాట్లాడారు. కుటుంబ సమేతంగా చినబాబు చిత్రం చూడాలన్నారు. ఇటీవల వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు చినబాబు చిత్రం ఆడియో రిలీజ్ చేశారని, చిత్ర విజయోత్సవాన్ని కూడా వైజాగ్‌లోనే నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. గంటా మాట ప్రకారం చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. వైజాగ్‌లో మంచి కలెక్షన్స్‌తో చిత్రం ఆడుతోందని, ప్రతి థియేటర్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో చిత్రం నడుస్తోందన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తే మంచి అనుభూతి పొందుతారని, ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లు లేవని, అసభ్య దృశ్యాలు లేకుండా చిన్నారుల నుంచి అవ్వలు వరకు ఆనందంగా చూడదగ్గ సినిమాగా పేర్కొన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన వైజాగ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో థియేటర్ ప్రతినిధులు జగదీష్, వాసు తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటిని ఆపుకోలేకపోయా : హీరో
సూర్య నిర్మాణంలో ఆయన తమ్ముడు కార్తీ హీరోగా వచ్చిన సినిమా చినబాబు. ఫ్యామిలీ నేపథ్యంలో, కుటుంబ బంధాలను చక్కగా చూపించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. ఇటీవలె ఖాకీతో హిట్ కొట్టిన కార్తీకి ‘చినబాబు’తో మరో హిట్ వచ్చింది. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నందుకు ఈ చిత్ర నిర్మాత సూర్య సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. ‘థియేటర్లో ప్రేక్షకులందరూ.. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. హాయిగా నవ్వుకుంటున్నారు. నేనూ మనస్పూర్తిగా నవ్వుకున్నాను, కన్నీటిని ఆపుకోలేకపోయాను. దర్శకుడు పాండ్యరాజ్, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. మా చిత్రం తరుపున ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. To see the whole theatre laugh and connect with the emotions is bliss!!I laughed my heart out,n couldnt stop my tears..Thank you @pandiraj_dir and entire team!! Happy for you @Karthi_Offl .We #KadaikuttiSingam #Chinnababu team thank audience for blessing us with all the love. pic.twitter.com/t4HX6fGSTd — Suriya Sivakumar (@Suriya_offl) July 14, 2018 -
‘చినబాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : చినబాబు జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : కార్తీ, సయేషా, సత్యరాజ్, సూరి, శత్రు సంగీతం : డి ఇమాన్ దర్శకత్వం : పాండిరాజ్ నిర్మాత : సూర్య కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తన ప్రతీ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న కార్తీ, తాజాగా చినబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నిర్మించటం విశేషం. మరి అన్నదమ్ములు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా..? కార్తీ తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించాడా..? కథ; పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్) రైతు. ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న పెద్ద కుటుంబ యజమాని. ఎప్పటికైనా తన కూతుళ్లు, అల్లుల్లు.. వాళ్ల పిల్లలను ఇంటికి పిలిచి అందరితో కలిసి ఓ ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలని ఆశపడుతుంటాడు. రుద్రరాజు కొడుకు కృష్ణంరాజు (కార్తీ) ‘రైతే దేశానికి ఆధారం’ అని నమ్మే ఆదర్శ రైతు. రుద్రరాజు ఇద్దరు కూతుళ్లు తమ అమ్మాయిలను కృష్ణంరాజు కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కృష్ణంరాజు, నీల నీరధ(సయేషా)ను ఇష్టపడతాడు. (సాక్షి రివ్యూస్) దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో నీల నీరధ బావ, సురేంద్ర రాజు (శత్రు)ను ఓ హ్యతకేసులో కృష్ణం రాజు అరెస్ట్ చేయిస్తాడు. దీంతో ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో సురేంద్ర, రుద్రరాజు కుటుంబంలో మొదలైన గొడవలు మరింత పెద్దవి చేసి అందరిని విడదీయాలని, కృష్ణంరాజును చంపాలని ప్రయత్నిస్తాడు. ఈ సమస్యల నుంచి కృష్ణంరాజు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? ఎలా తిరిగి ఒక్కటి చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రైతు పాత్రలో కార్తీ జీవించాడు. ఆదర్శ రైతుగా, కుటుంబం కోసం ప్రాణమిచ్చే పల్లెటూరి యువకుడి పాత్రలో కార్తీ నటన సూపర్బ్. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఇలా ప్రతీ విషయంలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సయేషాది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. గత చిత్రాల్లో మోడ్రన్ అమ్మాయిగా కనిపించిన సయేషా పల్లెటూరి అమ్మాయిగానూ మెప్పించింది. (సాక్షి రివ్యూస్) కుటుంబ పెద్దగా సత్యరాజ్ హుందాగా కనిపించారు. తెలుగులో సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన శత్రుకు ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా అవకాశం దక్కింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైన చేసే పాత్రలో శత్రు మంచి విలనిజం పండించాడు. అక్కలు, బావల పాత్రలలో నటించిన వారంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావటం కాస్త కష్టమే. విశ్లేషణ ; మాస్ ఆడియన్స్‌లో మంచి పట్టున్న కార్తీని పల్లెటూరి రైతు బిడ్డగా చూపించాడు దర్శకుడు పాండిరాజ్. మాస్ కమర్షియల్, ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా, బలమైన ఎమోషన్స్ తో కథను నడిపించాడు. కార్తీ నుంచి ఫ్యాన్స్ ఆశించిన కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలకు లోటు లేకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సినిమా పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. నేటివిటి పరంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. (సాక్షి రివ్యూస్)నటీనటులు అంతా తమిళ వారే కావటం కూడా ఇబ్బంది పెడుతుంది. వేల్రాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద చూపించారు. ఇమాన్ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత బలాన్నించింది. ఎడిటింగ్ బాగుంది. సూర్య కథ మీద నమ్మకంతో తమ్ముడి కోసం భారీగానే ఖర్చు చేసి సినిమాను నిర్మించారు. ప్లస్ పాయింట్స్ ; ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధాన పాత్రల నటన మైనస్ పాయింట్స్ ; నేటివిటి ప్రధాన పాత్రల్లో తమిళ నటులే కనిపించటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
విజయ్ దేవరకొండకు స్పెషల్ థ్యాంక్స్
సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశాడు. కార్తీ హీరోగా తెరకెక్కిన చినబాబు చిత్రం స్నీక్ పీక్ వీడియోను తాజాగా విజయ్ తన ట్విటర్లో విడుదల చేశాడు. ఈ సందర్భంగా తన తాతముత్తాతలు, తండ్రి కూడా రైతు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘నేను ఎంతగానో ఆరాధించే నటుడు నిర్మాతగా(సూర్య).. నాకిష్టమైన నటుడు(కార్తీ) కాంబోలో తెరకెక్కిన చిత్రం వీడియోను విడుదల చేయటం సంతోషంగా ఉంది’ అంటూ విజయ్ పేర్కొన్నాడు. దీనికి స్పందించిన సూర్య .. విజయ్‌పై పొగడ్తలు గుప్పిస్తూ.. త్వరలోనే కలుద్దాం అంటూ రీ-ట్వీట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన విజయ్.. ‘అలాగే సర్.. మీ నుంచి క్రమశిక్షణ కొంచెం నేర్చుకోవాలి’ అంటూ మళ్లీ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే కార్తీ హీరోగా నటించిన చినబాబు ఈ శుక్రవారం విడుదల కానుంది. మరోవైపు సూర్య సెల్వరాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎన్జీకే షూటింగ్లో బిజీగా ఉండగా.. విజయ్ దేవరకొండ ఓ అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. #ChinnaBabu is here :) Starring One of my favourite actors and produced by another actor I full-on admire, it's an absolute pleasure to launch their Sneak Peak. https://t.co/HWAfurMsyw — Vijay Deverakonda (@TheDeverakonda) 11 July 2018 Done Thalaivaaa :) need to learn some discipline from you 😇 https://t.co/9nMApmrvYm — Vijay Deverakonda (@TheDeverakonda) 11 July 2018 -
అంత ఆశ అవసరమా అనిపిస్తోంది
‘‘ఐదుగురు అక్కల తర్వాత పుట్టిన తమ్ముడి కథ ‘చిన బాబు’. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. కొడుకు కూడా వ్యవసాయమే చేస్తాడు. ఎవరి వృత్తిని వాళ్లు బండిపై రాసుకున్నట్టు ఈ చిత్రంలో నేను ఫార్మర్ అని రాసుకుంటాను. రైతు అనే ఉద్యోగాన్ని గర్వంగానే భావించాను’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, సాయేషా సైగల్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చినబాబు’. హీరో, కార్తీ అన్న సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కార్తీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..పాండిరాజ్‌గారు చేసిన ‘పసంగ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. అది చిన్న పిల్లలు, తల్లిదండ్రులకు సంబంధించిన సినిమా. పేరెంటింగ్ గురించి చెప్పిన సినిమా. ఆయనతో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ‘చినబాబు’తో కుదిరింది. ఈ చిత్రంలో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుంటా. అక్కలకు, వాళ్ల కూతుళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండే పాత్ర నాది. మన సంస్కృతిలో పిల్లలు సంపద. అలాంటి సంపదను, కుటుంబ బంధాలను ఇందులో చూపించాం. ఈ సినిమాలోనే నేను తొలిసారి పెద్ద కుటుంబంతో పని చేశా. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఈ చిత్రంలో రైతుల కష్టనష్టాలను చూపించడం లేదు. పాజిటివ్ సైడ్‌లో చూపిస్తున్నాం. జర్మనీలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. కేరళలో ఏడాదికి రెండు, మూడు కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి విషయాలను మళ్లీ చెప్పాలనే అంశంతో ఈ సినిమా చేశాం.పాండిరాజ్‌గారు కూడా రైతే. ఆయన చేసి చూపించినవన్నీ నేను చేశా. రోజూ ఉదయం ఆరు గంటలకే పొలాలకు వెళ్లి పనులు చేసేవాణ్ని. వ్యవసాయం ఎక్కడైనా ఒకటే. తెలుగు అయినా తమిళ నాట అయినా.‘రంగస్థలం’ సినిమా తర్వాత నేను గోదావరి యాస ట్రై చేశాను. ఈ సినిమా చూసేవారికి అక్కలు, మావయ్యలు, బావలు కనిపిస్తారు. అందరూ కనెక్ట్ అవుతారు. మన కల్చర్‌ని ఈ తరం పిల్లలకు చూపించే సినిమా అవుతుంది. నాకు వ్యవసాయం టచ్ ఉంది. నా భార్య ఓ రైతు కూతురే. సెలవుల్లో ఆ పల్లెటూరికి వెళ్తాం. నా కూతురు కూడా సెలవుల్లో పల్లెటూళ్లోనే ఉంటుంది. మా పెదనాన్న రైతు. మా నాన్న ఎప్పుడూ ‘ఈ సిటీ బోర్ కొడుతోందిరా. నేను ఊరెళ్తున్నాను’ అంటారు. ఆ టచ్ మనకూ ఉండాలి. ఉంటుంది కూడా.మా అన్న సూర్యగారు మంచి నిర్మాత. షూటింగ్ స్పాట్‌కి ఒక్క రోజు కూడా రాలేదు. సినిమా ఎలా ఉంది? అని అడిగితే, ‘అది ఆడియన్స్ చెప్తారు’ అన్నారు. నేను పదేళ్లుగా నటిస్తున్నా. నా నటన నచ్చకపోతే నిర్మాతగా మారతాను. స్టార్టింగ్‌లో దర్శకుడిగా చేయాలనుకున్నా. ఇప్పుడు దర్శకులను, వాళ్లు పడే కష్టాన్ని చూస్తే నాకు నేను ‘అంత ఆశ ఎందుకురా నీకు’ అనుకుంటాను. వయసులో ఉన్నప్పుడే నటించాలి. వయసు మీద పడే కొద్దీ మనం సంపాదించుకున్న జ్ఞానంతో దర్శకత్వం చేయొచ్చు.∙ప్రస్తుతం‘ఆవారా’ లాంటి సినిమా చేస్తున్నా. రకుల్ హీరోయిన్. వినోద్‌గారు ‘ఖాకీ’ కథ చెప్పినప్పుడు సీక్వెల్ చేద్దామన్నారు. ఆయన కథతో వస్తే చేస్తా. మంచి కథ కుదిరితే తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తా. మల్టీస్టారర్ మూవీస్ పెద్దగా ఇష్టం ఉండదు. ‘ఊపిరి’ మంచి కథ. అందుకే చేశా. -
కార్తీ ‘చినబాబు’
-
రైతు సమస్యలపై చినబాబు పోరు
కార్తీ, సాయేషా జంటగా నటించిన చిత్రం ‘చినబాబు’. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. పాండిరాజ్ దర్శకత్వంలో 2డి ఎంటరై్టన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్స్‌లో హీరో సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో రైతుల సమస్యలను పాండిరాజ్ చక్కగా చర్చించారు. కామెడీ, యాక్షన్ కూడా ఉంటుంది. కార్తీ తొలిసారి రైతు పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో కార్తీ చెప్పిన డైలాగ్స్ ఆలోచింపచేసేలా ఉన్నాయి. టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నాం. ఇందులో శత్రు మెయిన్ విలన్‌గా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ప్రియా భవానిశంకర్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సి.హెచ్. సాయికుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్, సంగీతం: డి.ఇమాన్, కెమెరా: వేల్రాజ్. -
కలలు కనాలి.. సాధించుకోవాలి
‘‘సింగం 3’ సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చాను. అప్పుడు మీరు (ప్రేక్షకులు) చూపించిన ప్రేమ మర్చిపోలేను. రైతుల జీవితాల నేపథ్యంలో ‘చినబాబు’ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తమ్ముడితో సినిమా నిర్మించాలనే కల నిజం అయింది. అందరూ కలలు కనాలి. వాటిని సాధించాలి. పాజిటివ్‌గా ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. నాకంటే నా తమ్ముడు కార్తీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నా. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ‘చినబాబు’ అందరికీ నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు సూర్య. కార్తీ, సాయేషా జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చినబాబు’. హీరో సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. శనివారం వైజాగ్‌లో ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగింది. డి. ఇమాన్ స్వరకర్త. ఈ వేడుకలో కార్తీ మాట్లాడుతూ – ‘‘నన్ను, అన్నయ్యను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. రైతును మర్చిపోతున్న సమయంలో రైతును గుర్తు చేసుకొనే విధంగా సినిమా చెయ్యడం గర్వంగా ఉంది. అన్నయ్యకి ఈ సినిమా చాలా నచ్చింది. వచ్చే నెల ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. అందరూ కలిసి ఉండాలని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా చూశాక మీరు మీ అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతారు’’ అన్నారు. ‘‘1986లో నేను హీరోగా చేసిన ఓ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం వైజాగ్‌లో జరిగింది. ఇప్పుడు నేను నటించిన సినిమా ఆడియో వేడుక వైజాగ్‌లో జరగడం సంతోషంగా ఉంది. సూర్య, కార్తీ మంచి నటులు. ఈ సినిమాతో సూర్య సక్సెస్ఫుల్ నిర్మాత కాబోతున్నారు. డైరెక్టర్ పాండిరాజ్ ఈ సినిమాలో అందరికీ మంచి పాత్రలు ఇచ్చారు’’ అని సత్యరాజ్ అన్నారు.‘‘సూర్య, కార్తీ కథ ఓకే చేయడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయిందనిపించింది. మంచి యాక్షన్, చక్కని లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని పాండిరాజ్ చెప్పారు. ‘‘‘చినబాబు సినిమా టీజర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పా¯Œ ్స లభించింది’’ అన్నారు రచయిత శశాంక్ వెన్నెలకంటి. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘వ్యవసాయం చెయ్యాలని చెప్పిన తండ్రి కోసం రైతుగా మారి, విజయం సాధించే కొడుకు కథ ఇది. రైతు పాత్రలో కార్తీ నటన అద్భుతం. పాండిరాజ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను’’ అని భానుప్రియ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: సి.హెచ్. సాయికుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్. -
ఇంగ్లీష్‌పై కట్టప్ప జోకులు
బాహుబలితో ప్రభాస్ ఎంత ఫేమస్ అయ్యారో అదే రేంజ్లో పేరు వచ్చిన నటుడు సత్యరాజ్. ఈ సిరీస్‌లో తన నటనతో అందరినీ అంతలా ఆకట్టుకున్నాడు ఈ కటప్ప. కీలక పాత్రలు పోషించడంలో ముందుండే సత్యరాజ్ కార్తీ నటించిన చినబాబు చిత్రంలో కూడా నటించాడు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక శనివారం జరిగింది. ఈసందర్భంగా సత్యరాజ్ తనతీరుకు భిన్నంగా, కొత్త యాంగిల్లో స్టేజ్‌పై జోకులు పేల్చేరు. అందరి మొహంలో చిరునవ్వులు పూయించారు. సినిమా వేడుకలో మాట్లాడుతూ.. తాను బీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో చదివానని.. కానీ తనకు ఇంగ్లీష్ రాదని చెప్పారు. ఒకసారి తన ప్రొఫెసర్ ఇంగ్లీష్‌లో నాలుగుముక్కులు సరిగ్గా మాట్లాడలేవా అంటూ అడిగారట.. దానికి సత్యరాజ్ సమాధానం ఇస్తూ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు 50 కిలోమీటర్లు అంత దగ్గర ఉన్న తెలుగే సరిగ్గా రాదు. ఎక్కడో 8వేల కిలోమీటర్ల ఉన్న లండన్ ఇంగ్లీష్ ఎలా వస్తుందంటూ చమత్కరించారట. ఈ విషయాన్ని చినబాబు వేదికపై పంచుకొన్నారు. -
రైతు సమస్యలపై పోరాటం
కార్తీ కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కడైకుట్టీ సింగమ్’. సాయేషా, ప్రియా భవాని శంకర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తెలుగులో ‘చినబాబు’ అనే పేరు ఖరారు చేశారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై హీరో సూర్య, మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల 13న రిలీజ్ కానుంది. ‘‘ఈ నెల 23న జరగనున్న ‘చినబాబు’ ఆడియో ఫంక్షన్‌కు సూర్య కూడా హాజరు కానున్నారు. రీసెంట్గా విడుదలైన ‘చినబాబు’ టీజర్‌కు, ఫస్ట్ సాంగ్ (చినదాని..)కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రైతు పాత్రలో కార్తీ నటించారు. సినిమాలో రైతు సమస్యలను చర్చించాం. డి. ఇమ్మాన్ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యరాజ్, భానుప్రియ, శత్రు, సూరి, శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వేల్ రాజా. -
అన్నయ్యతో కలిసి నటించాలి
తమిళసినిమా: అన్నయ్య సూర్యతో కలిసి నటించాలనుందని కార్తీ పేర్కొన్నారు. నటుడు సూర్య తాజాగా తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కడైకుట్టి సింగం. ఇందులో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముంబై బ్యూటీ సాయేషాసైగల్, ప్రియ భవానీశంకర్ కథానాయికలుగా నటిస్తున్నారు. సత్యరాజ్, సూరి, భానుప్రియ, శ్రీమాన్, సరవణన్, ఇళవరసు, మారిముత్తు, జాన్‌విజయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి పసంగ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో అవిష్కరణ సోమవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ దర్శకుడు పాండిరాజ్ ప్లాన్‌గా చిత్రాన్ని పూర్తి చేశారని చెప్పారు. ఇందులో 28 మంది ప్రముఖ నటీనటులను నటించారని, అందరికీ ప్రాముఖ్యత ఉండేలా దర్శకుడు పాత్రలను తీర్చిదిద్దడం తనకే అశ్చర్యం కలిగించిందన్నారు. ఈ చిత్రం నగరంలో పని చేసేవారందరిని గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేయిస్తుందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు. డీ.ఇమాన్ సంగీతంలో తాను నటించిన తొలి చిత్రం కడైకుట్టి సింగం అని తెలిపారు. ఆయన మంచి పాటలను అందించారని చెప్పారు. అన్నయ్య నిర్మించే చిత్రంలో తాను హీరోగా నటిస్తానని ఊహించలేదన్నారు. అన్నయ్యతో కలిసి నటించాలని ఉందని అన్నారు. తనకు అక్క అంటే చాలా ఇష్టం అని షూటింగ్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి కాఫీ చేసి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో నటుడు శివకుమార్, సూర్య, సత్యరాజ్, సూరి, శ్రీమాన్, నటి సాయేషాసైగల్, ప్రియ భవానీశంకర్, 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర పాండియన్ పాల్గొన్నారు. -
చినబాబు ముగించాడు
‘ఆవారా, నా పేరు శివ, ఖాకి.. వంటి చిత్రాలతో తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కడై కుట్టి సింగమ్’. తెలుగులో ‘చినబాబు’ అనే టైటిల్ ఖరారు చేశారు. సాయేషా, ప్రియా భవానీ శంకర్ కథానాయికలుగా నటించారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తీ అన్నయ్య, హీరో సూర్య నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. అంటే ‘చినబాబు’ ముగించేశాడన్నమాట. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రైతు పాత్రలో నటించారు కార్తీ. సినిమా రిలీజ్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అప్పుడే తన నెక్ట్స్ చిత్రంపై కూడా కార్తీ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆ సినిమాలోని న్యూ లుక్ కోసం కసరత్తులు చేస్తున్నారు. కొత్త దర్శకుడు రజత్ రవిశంకర రూపొందించనున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్ కథనాయికగా నటించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్లో భాగంగా చెన్నై, హైదరాబాద్‌లలో షూటింగ్ జరిపి ఆ తర్వాత యూరప్ వెళ్లాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ టాక్. -
పల్లెబాట పట్టిన కార్తీ
తమిళసినిమా: నటుడు కార్తీ మరోసారి పల్లెబాట పట్టారు. ఆయన గ్రామీణ నేపథ్యంలో నటించిన కొంబన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నగర నేపథ్యంలో సాగే కథలను ఎంచుకుని నటిస్తున్న కార్తీ తాజా చిత్రం ధీరన్ అధికారం ఒండ్రు మంచి సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఆయన తన అన్నయ్య సూర్య 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీనికి పసంగ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే. ఇందులో కార్తీకి జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయేషాసైగల్ నటిస్తుండగా సత్యరాజ్, సూరి, నటి ప్రియ భవానీశంకర్, భానుప్రియ, మౌనిక ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దీనికి కడైకుట్టి సింగం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగులో చినబాబు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటుడు సూర్య పొంగల్ పండుగ సందర్భంగా 14వ తేదీన విడుదల చేశారు. ఆ పోస్టర్లో కార్తీ ఎర్రచొక్కా, గళ్ల లుంగీ కట్టి, తలపాగా చుట్టి మోపెడ్ బండిలో స్టైలిష్‌గా కూర్చున్న దృశ్యం ఆయన అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఈ చిత్రం నెడువాసల్ గ్రామంలో హైడ్రోకార్బన్ సమస్య ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. పుదుకోట్టై నేపథ్యంలో సాగే ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను ఇటీవలే తెన్‌కాశీ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశారు. దీనికి డి.ఇమాన్ సంగీత బాణీలు కడుతున్నారు. -
చినబాబు దర్శనం కోసం పడిగాపులు!
హైదరాబాద్ : చినబాబు.. నారా లోకేష్ దర్శనం కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పడిగాపులు గాస్తున్నారు. పారిశ్రామికవేత్తలతో భేటికే పరిమితమవుతున్న ఆయన.. కార్యకర్తలు, పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దాంతో చినబాబు దర్శనం కోసం రోజులు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వారికి నెలకొంది. కాగా గతంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి...15 రోజుల సమయం అడిగినా లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇటీవలే తీగల టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పౌర సరఫరాల శాఖమంత్రి సునీత ఫోన్ చేసినా లోకేష్ స్పందించనట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ శమంతకమణికి కూడా లోకేష్ దర్శనం కాకపోవటంతో ఆయనను కలవకుండానే వెనుదిరిగారు. కాగా చినబాబు వైఖరిపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకే లోకేష్ అపాయింట్మెంట్ దొరకని నేపథ్యంలో ..పార్టీ కార్యకర్తల పరిస్థితి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముందని గుసగుసలు వినిపిస్తున్నాయి.