సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశాడు. కార్తీ హీరోగా తెరకెక్కిన చినబాబు చిత్రం స్నీక్ పీక్ వీడియోను తాజాగా విజయ్ తన ట్విటర్‌లో విడుదల చేశాడు. ఈ సందర్భంగా తన తాతముత్తాతలు, తండ్రి కూడా రైతు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘నేను ఎంతగానో ఆరాధించే నటుడు నిర్మాతగా(సూర్య).. నాకిష్టమైన నటుడు(కార్తీ) కాంబోలో తెరకెక్కిన చిత్రం వీడియోను విడుదల చేయటం సంతోషంగా ఉంది’ అంటూ విజయ్ పేర్కొన్నాడు.
దీనికి స్పందించిన సూర్య .. విజయ్‌పై పొగడ్తలు గుప్పిస్తూ.. త్వరలోనే కలుద్దాం అంటూ రీ-ట్వీట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన విజయ్.. ‘అలాగే సర్.. మీ నుంచి క్రమశిక్షణ కొంచెం నేర్చుకోవాలి’ అంటూ మళ్లీ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే కార్తీ హీరోగా నటించిన చినబాబు ఈ శుక్రవారం విడుదల కానుంది. మరోవైపు సూర్య సెల్వరాఘవన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఎన్‌జీకే షూటింగ్‌లో బిజీగా ఉండగా.. విజయ్ దేవరకొండ ఓ అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
#ChinnaBabu is here :) Starring One of my favourite actors and produced by another actor I full-on admire, it's an absolute pleasure to launch their Sneak Peak. https://t.co/HWAfurMsyw
— Vijay Deverakonda (@TheDeverakonda) 11 July 2018
Done Thalaivaaa :) need to learn some discipline from you 😇 https://t.co/9nMApmrvYm
— Vijay Deverakonda (@TheDeverakonda) 11 July 2018
Comments
Please login to add a commentAdd a comment