బాహుబలితో ప్రభాస్ ఎంత ఫేమస్ అయ్యారో అదే రేంజ్‌లో పేరు వచ్చిన నటుడు సత్యరాజ్. ఈ సిరీస్‌లో తన నటనతో అందరినీ అంతలా ఆకట్టుకున్నాడు ఈ కటప్ప. కీలక పాత్రలు పోషించడంలో ముందుండే సత్యరాజ్ కార్తీ నటించిన చినబాబు చిత్రంలో కూడా నటించాడు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక శనివారం జరిగింది. ఈసందర్భంగా సత్యరాజ్ తనతీరుకు భిన్నంగా, కొత్త యాంగిల్‌లో స్టేజ్‌పై జోకులు పేల్చేరు. అందరి మొహంలో చిరునవ్వులు పూయించారు.
సినిమా వేడుకలో మాట్లాడుతూ.. తాను బీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో చదివానని.. కానీ తనకు ఇంగ్లీష్ రాదని చెప్పారు. ఒకసారి తన ప్రొఫెసర్ ఇంగ్లీష్‌లో నాలుగుముక్కులు సరిగ్గా మాట్లాడలేవా అంటూ అడిగారట.. దానికి సత్యరాజ్ సమాధానం ఇస్తూ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు 50 కిలోమీటర్లు అంత దగ్గర ఉన్న తెలుగే సరిగ్గా రాదు. ఎక్కడో 8వేల కిలోమీటర్ల ఉన్న లండన్ ఇంగ్లీష్ ఎలా వస్తుందంటూ చమత్కరించారట. ఈ విషయాన్ని చినబాబు వేదికపై పంచుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment