Pre Release Function
-
‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
టీజర్, సాంగ్స్ నచ్చితే మా సినిమా ఎంకరేజ్ చేయండి: హీరో
విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా 'ఈసారైనా'. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ నిరుద్యోగి అతడి ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడనేది కథ. విప్లవ్ నిర్మాతగా, సంకీర్త్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ నవంబర్ 8 న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విప్లవ్ మాట్లాడుతూ.. "ఈ సినిమా మీ అందరి ముందుకు రావడానికి కారణం సంకీర్త్ అన్న. ఆయన ముందు నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాకి నేనే నిర్మాతను. కష్టమైనా సరే అన్నింటినీ మేనేజ్ చేశాను. టీజర్, సాంగ్స్ చూడండి. నచ్చితే సినిమా చూడండి" అన్నారు.హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ.. ఈ సినిమాకు షూటింగ్ చేస్తున్నన్ని రోజులు సమ్మర్ హాలిడేస్లా అనిపించాయి. నా ఫస్ట్ మూవీకి ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది అని తెలిపింది. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ.. విప్లవ్ అన్న నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. సలార్ తర్వాత ఇష్టంగా చేసిన సినిమా ఇదే" అన్నాడు.కో ప్రొడ్యూసర్ సంకీర్త్ మాట్లాడుతూ, "నా దృష్టి లో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు. నా దృష్టిలో ఒక సినిమా మనతో పాటు ఇంటికి వచ్చిందంటే అది అందరికీ నచ్చుతుంది. నవంబర్ 8 న థియేటర్స్‌లో ఈ సినిమా చూడొచ్చు" అన్నారు. -
'పుష్ప2: ది రూల్' ప్రీ రిలీజ్‌కు చిక్కులు.. ఏపీ, తెలంగాణలో కష్టమే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2: ది రూల్' పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. సుమారు మూడేళ్ల తర్వాత వెండితెరపై తమ అభిమాన హీరోను ఫ్యాన్స్ చూడనున్నారు. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానున్నడంతో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించారు. పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురుకానుంది.తెలంగాణలో కష్టమేహైదరాబాద్ సిటీలో నెలరోజుల పాటు పోలీసుల ఆంక్షలు ఉండనున్నాయి. ఈమేరకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగునున్నట్లు సమాచారం రావడంతో బీఎన్ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించారు. ఇది అమల్లో ఉన్నప్పుడు నలుగురికి మించి గుమిగూడటం, కలిసి తిరగడంపై నిషేధాజ్ఞలు ఉంటాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల దాకా హైదరాబాద్‌లో ఎలాంటి సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో పుష్ప2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం కష్టమేనని చెప్పవచ్చు. నగరంలో వరుస ఆందోళనలతో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఏపీలోనే ఛాన్స్పుష్ప2 ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించడం దాదాపు కష్టమేనని చెప్పవచ్చు. పోలీసులు ఆంక్షలు నవంబర్ 28 నాటికి పూర్తి అయినా కూడా వెంటనే ఒక భారీ ఈవెంట్ జరుపుకునేందుకు అనుమతులు రావడం కష్టమేనని చెప్పవచ్చు. దీంతో పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం ఏపీలో జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అల్లు అర్జున్ మెగా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ జనసేన కార్యకర్తల నుంచి నాయకుల వరకు కొద్దిరోజుల క్రితమే డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గాల్లో పుష్ప చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటామని వారు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఒక వేదికపై పుష్ప చిత్రాన్ని తక్కువగా చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇలా పలు అడ్డుంకుల మధ్య పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం ఏపీలో జరుగుతుందా..? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'దేవర' కూడా పలు ఇబ్బందులు ఎదురుకావడంతో ప్రీ రిలీజ్ కార్యక్రమం లేకుండానే సినిమాను విడుదల చేశారు. ఆ తర్వాత చాలా బాధతో తన అభిమానుల కోసం ఎన్టీఆర్ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!
చిరంజీవి - మెహర్ రమేష్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘భోళా మేనియా ’ అంటూ సాగే ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. అన్నాచెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మేకర్స్ తుది మెరుగులు దిద్దుతున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి తల్లి కాబోతున్న మోడల్, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశముందా?) ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని వైజాగ్ లేదా విజయవాడలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి ప్లాన్ వర్క్ అవుట్ అవుతందని చిత్ర బృందం భావిస్తోందట. ఇదే జరిగితే నందమూరి, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారని మేకర్స్ స్కెచ్ వేస్తున్నట్లు సమచారం. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేశ్ అతిధిగా రావడం..ఆ తర్వాత మహేశ్ సినిమాకి తారక్ రావడం జరిగింది. ఇలాంటి సందర్భాలు జరిగితే అభిమానుల మధ్య మరింత ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అదుపులో లేని భావోద్వేగాలు.. బ్రేకప్ చెప్పా, కుమిలిపోయా: నటి) -
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే: సీపీ శ్రీకాంత్
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆంధ్ర యూనివర్శిటీ గ్రౌండ్లో అనుమతి ఇచ్చినట్లు విశాఖపట్నం సీపీ శ్రీకాంత్ తెలిపారు. నిర్వాహకులు అక్కడే ప్రీ రిలీజ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్లో ఈవెంట్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని సీపీ శ్రీకాంత్ అన్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటించగా.. రవితేజ ముఖ్య పాత్ర పోషించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. చదవండి: (వాల్తేరు వీరయ్య ట్రైలర్.. బాస్ నోట మాస్ డైలాగ్స్, చిరుకు రవితేజ వార్నింగ్) -
'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్‌డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న వారు తెలుగువారు మాత్రమే: త్రివిక్రమ్
‘నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న జాతి... తెలుగుజాతి మాత్రమే. ‘ఇలా లాంచ్ అవ్వాలి.. ఇలాంటి సినిమాలు’ చేయాలనే చట్రంలో సుశాంత్ ఇరుక్కుపోయాడా? అనే ఫీలింగ్ నాకు ఉండేది. కానీ ‘చిలసౌ’ సినిమాతో తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ఈ సినిమా చూసే ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చేయమని అడిగాను. ‘చిలసౌ’, ‘అల.. వైకుంఠపురములో...’ తర్వాత సుశాంత్‌కు ‘ఇచట వాహనములు నిలుపరాదు’ హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది’’ అని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. సుశాంత్, మీనాక్షి జంటగా ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అంటే... సినిమా వెళుతుంటే మన ఇంటి ఆడపిల్లను వేరే ఇంటికి పంపినట్లు ఉంటుంది. కాకపోతే వేరే ఇంటికి వెళ్లి సెపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందని ఎలా ఆడపిల్లను పంపిస్తామో... సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని థియేటర్స్‌లో, కామెడీ సీన్స్‌లో, టీవీలో, షోస్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ స్పాన్ పెంచుకుంటున్నప్పుడు మరింత ఆనందంగా, గర్వంగా ఉంటుంది. అలాంటి అనుభవాలు దర్శన్‌కు ఎదురు కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని ‘బండి తీయ్..’ పాటను ఒక్క రోజులో తీశారు. విజువల్‌గా నేను చూసినప్పుడు వాళ్లలో ఆనందం కనిపించింది. ఆ చిరునవ్వులోనే సగం సక్సెస్ కనిపిస్తోంది’’ అన్నారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ – ‘‘త్రివిక్రమ్‌గారు చెప్పింది నిజమే. కెరీర్ స్టార్టింగ్‌లో..కష్టపడాలి అని తెలుసు కానీ క్లారిటీ లేదు. ఏ డైరెక్షన్లో వెళ్లాలో మొదట్లో అర్థం కాలేదు. రాంగ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడ్డాను. అదీ నా తప్పే. ‘చిలసౌ’ సినిమా అప్పుడు. ..‘సినిమాలు ఆడినా,ఆడకపోయినా ఇండిపెండెంట్‌గా ఉండమని’ నాగార్జున గారు సలహా ఇచ్చారు. గట్ ఫీలింగ్‌తో నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ సినిమాలో దర్శన్ ఓ కొత్త సుశాంత్‌ను చూపించారు’’ అన్నారు. ‘‘నిర్మాతలు రవిశాస్త్రి (దివంగత నటి భానుమతిగారి మనవడు), ఏక్తాలగారిది ఒక లెగసీ, హీరో సుశాంత్‌గారిది మరో లెగసీ. వీరి కాంబినేషన్లో సినిమాకు అసోసియేట్ అవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు నిర్మాత హరీశ్. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, శ్రీనివాసరెడ్డి, జెమినీ కిరణ్, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
‘ప్రతిరోజూ పండగే’ ప్రీ రిలీజ్ వేడుక
-
`మిస్ మ్యాచ్` ప్రీ రిలీజ్ వేడుక
-
‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం
‘‘దాదాపు 35 ఏళ్ల క్రితం ‘కళ్ళు’ సినిమా ద్వారా నేను హీరోగా పరిచయమయ్యా. ఆ సినిమా నాకు 17 అవార్డులు తీసుకొచ్చింది. ఆ చిత్రంలో హీరో నేనే అయినా గొల్లపూడిగారు, రఘుగారే హీరోలని ఇప్పటికీ చెబుతుంటాను. ఎందుకంటే రచయిత, దర్శకుడే సినిమాకు ప్రాణం. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా కూడా రమాకాంత్‌దే’’ అని శివాజీ రాజా అన్నారు. ఆయన తనయుడు విజయ్ రాజా హీరోగా, పూజా సోలంకి, సాషా సింగ్ హీరోయిన్లుగా కె. రమాకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. సుదర్శన్ హనగోడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఇలాంటి కథను దర్శకుడు ఎలా ఆలోచించారు? ఎలా సీన్లు రాసుకున్నారు? వాటిని ఎలా కనెక్ట్ చేశారు? అని ఆశ్చర్యపోయాను. విజయ్ రాజాకి తొలి సినిమా అయినా బెరుకు లేకుండా నటించాడు’’ అన్నారు. ‘‘ఇదొక డార్క్ కామెడీ హారర్ థ్రిల్లర్. తెలుగు స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడని ప్రేమకథ మా సినిమాలో చూస్తారు’’ అన్నారు రమాకాంత్. ‘‘ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు నాలుగు ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. అన్ని పాటలు అప్పుడే కంపోజ్ చేశాం’’ అన్నారు శ్రీకాంత్ పెండ్యాల. ‘‘జిగర్తండా’లో బాబీ సింహాగారి నటన చూసి ఆయనతో కలిసి నటించాలనుకున్నా. నా ఫస్ట్ సినిమాకే ఆ అవకాశం రావడం అదృష్టం’’ అన్నారు విజయ్ రాజా. ‘‘ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సుదర్శన్ హనగోడు. ఈ చిత్రానికి సహ నిర్మాత: పి. సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌ప్రకాష్ అన్నంరెడ్డి, కెమెరా: సమీర్‌రెడ్డి. ∙సుదర్శన్, బాబీ సింహా, శివాజీరాజా, విజయ్ రాజా, రమాకాంత్ -
నంబర్ వన్ రేస్‌లో...
గణేశ్, రష్మికా మండన్నా కథానాయికలుగా సుని దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘చమ్మక్’. దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాతలుగా ‘గీతా..ఛలో: వీకెండ్ పార్టీ’ పేరుతో ఈ సినిమాను ఈ నెల 3న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయడమే కాదు. రిలీజ్ విషయంలోనూ సరైన ప్రణాళిక ఉండాలి. నిర్మాతలు పంపిణీరంగంలో అనుభవజ్ఞులు. ఈ సినిమాతో నిర్మాతలకు డబ్బు, పేరు రావాలి’’ అన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాలు ఎన్ని విడుదలైనా టేస్ట్‌ఫుల్ సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘గీత గోవిందం’ సినిమాలో వందకోట్ల క్లబ్లో చేరారు రష్మిక. నంబర్ 1 రేస్‌లో ఉన్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు ఈ చిత్రసమర్పకుడు దివాకర్. ‘‘కన్నడలో ఈ చిత్రం దాదాపు 30కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
మా సినిమా యూత్‌కు మాత్రమే
ఆదిత్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈనెల 21న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ– ‘‘17రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశాం. ఇందుకు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం మరువలేనిది. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. మా సినిమా ట్రైలర్, వీడియోస్‌కు చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ఆదిత్ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడిగారు. మాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ లేవు. రికార్డులు, రివార్డ్స్ లాంటివి కూడా లేవు. ఎవరూ చేయలేని స్క్రిప్ట్ చేయాలని అనుకుని చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాదు.. యూత్‌కి మాత్రమే’’ అన్నారు. ‘‘ఇది ప్యూర్ అడల్ట్ మూవీ. దయచేసి ఫ్యామిలీతో వెళ్లొద్దు. ఆ విషయాన్ని ట్రైలర్లో కూడా చెప్పాం. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నటుడు ‘సత్యం’ రాజేష్. ‘‘ఈ చిత్రంలో నేను కొత్తగా ఉండే పాత్ర చేశా. నన్ను నేను నిరూపించుకోవాలని చాలా కష్టపడ్డాను. ఆ పాత్రకు నాపేరు సూచించిన ‘సత్యం’ రాజేష్ అన్నకు థ్యాంక్స్. ’’ అని ‘తాగుబోతు’ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిక్కీ తంబోలి పాల్గొన్నారు. -
అఖిల్‌లో ఉన్న మంచి గుణం ఆత్మవిమర్శ
‘‘ఈ ఫంక్షన్‌కు అతిథిలా కాకుండా బంధువులా వచ్చాను. ఈ చిత్రానికి పని చేసిన చాలామంది నాకు కావాల్సిన వాళ్లు ఉన్నారు. ఒక నిర్మాత మంచి చిత్రాలు తీయాలంటే వ్యామోహం ఒక్కటే సరిపోదు. వ్యాపారం కూడా తెలియాలి. ప్రసాద్‌గారిలో వ్యాపారం చూడలేదు, కేవలం సినిమా మీద వ్యామోహం మాత్రమే చూశాను. ఈ సంస్థకు ‘మిస్టర్. మజ్ను’ మరో మైలు రాయి అవ్వాలి’’ అని ఎన్టీఆర్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టర్. మజ్ను’. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘ప్రసాద్‌గారితో ‘ఊసరవెల్లి, నాన్నకు ప్రేమతో’ చేశాను. ఆ రెండు సినిమాలు నాకు చాలా ఇష్టమైనవి. సంపాదించిన ప్రతి రూపాయిని సినిమాకే ఖర్చు పెడతారాయన. అలాంటి నిర్మాత బావుంటే ఇంకా మంచి సినిమాలు అందిస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఉన్న ఫ్రెండ్స్‌లో వెంకీ ఒకరు. ‘తొలిప్రేమ’ అనే టైటిల్‌తో ఏం తీస్తాడు అనుకున్నాను. ఆ చిత్రం చూశాక, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ‘మిస్టర్ మజ్ను’ కూడా మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. తమన్ సంగీతంపై నాకు బాగా నమ్మకం ఉంది. ఆ మధ్య తన చుట్టూ ఒక నెగటివిటీ ఏర్పడింది. మళ్లీ తన సామర్థ్యాన్ని చూపించే చిత్రం రావాలి అనుకున్నాను. ‘తొలిప్రేమ’ రిలీజ్ అయింది. ఒక నటుడికి అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆత్మ విమర్శ. అలాంటి గొప్ప గుణం తమ్ముడు అఖిల్‌లో చూశాను. అఖిల్ చేసుకునేంత ఆత్మవిమర్శ ఎవ్వరూ చేసుకోలేరు. ఆత్మవిమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలి. తనని తను మార్చుకుంటూ ఈ మజిలీకి చేరాడు. రాసిపెట్టుకోండి.. మనకున్న ఉత్తమ నటుల్లో అఖిల్ కూడా ఉంటాడు. స్టార్డమ్ గురించి మాట్లాడటం లేదు. ఉత్తమ నటుల్లో అఖిల్ మాత్రం కచ్చితంగా ఉంటాడు. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను. అది కూడా ఎంతో దూరంలో లేదు. ‘మిస్టర్ మజ్ను’ అఖిల్‌కు బెస్ట్ మూవీ అవుతుంది’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ – ‘‘మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్ (ఎన్టీఆర్). నన్ను చాలా ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడు. తారక్ దగ్గరి నుంచి అఖిల్ నేర్చుకోవాల్సింది.. యాక్టింగ్ అండ్ మాస్. రేయ్ మాస్ నేర్చుకోరా అక్కడా (అఖిల్‌ని ఉద్దేశిస్తూ). ప్రసాద్‌గారు 25 సినిమాల్లో 2 బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తమన్‌గారి తాతగారే నాన్నను (ఏయన్నారు) ఆర్టిస్ట్‌గా గుర్తించారు. ఆ విధంగా ఈ సర్కిల్ పూర్తయింది అనుకుంటున్నాను. వెంకీ అట్లూరి మా సినిమాలు చూసి ఇక్కడికి వచ్చాడని విన్నాను. ‘మజ్ను’ టైటిల్ నాన్నగారిది. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అఖిల్ చేశాడు. ఈ చిత్రం ఆ 2 సినిమాల కంటే పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ – ‘‘మజ్ను... మంచి టైటిల్ పెట్టావు వెంకీ. అఖిల్‌కి సూట్ అవుతుంది (నవ్వుతూ). అఖిల్‌ని ఫుల్ లవ్‌స్టోరీలో చూడాలనుకున్నాను. అఖిల్ ఫైట్స్, డ్యాన్స్ బాగా చేస్తాడని మనందరికి బాగా తెలుసు. తన బాడీ లాంగ్వేజ్‌కు లవ్‌స్టోరీ బావుంటుందని అనుకున్నాను. వెంకీ ‘తొలిప్రేమ’తో తన మార్క్ చూపించాడు. ‘మిస్టర్ మజ్ను’ కూడా అలానే ఉంటుందనుకుంటున్నాను. నిధీకు సక్సెస్ రావాలి. బ్లాక్‌బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ప్రసాద్‌గారు’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు గాడ్ ఫాదర్ బీవియస్‌ఎన్ ప్రసాద్‌గారు. తాతగారితో కూడా ఆయన సినిమా తీశారు. సినిమాకు పని చేసిన నిపుణులందరికీ థ్యాంక్స్. ఇంత స్పెషల్ ఆల్బమ్ ఇచ్చిన తమన్‌కు థ్యాంక్స్. వెంకీ నాకు పదేళ్ల నుంచి ఫ్రెండ్. మూడేళ్ల ముందే ఈ కథ చెప్పి, నా కోసం వెయిట్ చేశాడు. ప్రతి సినిమాకు నాన్నగారు చూపించే శ్రద్ధ చాలా గొప్పది. మీ ఇన్‌ఫుట్స్ లేకుంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదు నాన్న. అన్నయ్య ఎన్టీఆర్‌ని నేను టైగర్ అని పిలుస్తాను. ఈ ఫంక్షన్ వస్తున్నందుకు థ్యాంక్స్ అంటే.. అది నా బాధ్యత అని చెప్పారు. థ్యాంక్యూ సో మచ్ అన్నయ్య’’ అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ – ‘‘నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా ‘శివ’. ప్రేమ్ నగర్ సినిమాలో ‘ఎక్స్క్యూజ్ మీ మిస్’ డైలాగ్‌ని తీసుకొని ఇందులో పెట్టాను. ఈ సినిమా టీమ్ ఎఫర్ట్. చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులు ఆశ్వీర్వదించాలి’’ అన్నారు. ఈ వేడుకలో నిధీ అగర్వాల్, తమన్, శ్రీమణి, తదితరులు పాల్గొన్నారు. -
నేను పెద్ద హీరోని అనుకోను
‘‘సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను, వరుణ్ సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘నేను పెద్ద హీరోని అని ఎప్పుడూ అనుకోను. కథ, దర్శకుడు అనిల్‌ని నమ్మి ఈ సినిమా చేశా. ‘దిల్’ రాజుగారితో మంచి అనుబంధం ఉంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కలియుగ పాండవులు’ చిత్రంతో వెంకటేశ్‌గారి అభిమానిని అయ్యా. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడు అనిల్’’ అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. అది కూడా కామెడీ క్యారెక్టర్. ‘ఎఫ్ 2’తో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ‘ఫిదా’ తర్వాత మరోసారి పనిచేయడం హ్యాపీ. మా పెదనాన్నగారి (చిరంజీవి) కాన్టెంపరరీ హీరో వెంకటేశ్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో ఫ్రెండ్‌లా, మెంటర్‌లా ఉన్నారు. నెక్ట్స్ టైమ్ ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి రెడీ’’ అన్నారు. ‘‘ఎఫ్ 2’ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. టైమింగ్ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు’’ అన్నారు అనిల్ రావిపూడి. నటులు రాజేంద్రప్రసాద్, కథానాయికలు తమన్నా, మెహరీన్, నిర్మాత శిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎఫ్2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
కేటీఆర్.. నేను బెంచ్‌మేట్స్
‘‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వచ్చి ఆశీస్సులు అందించిన కళాభిమానులకు, మా మెగా అభిమానులకు కృతజ్ఞతలు. నేను అనుకున్న దానికంటే ఈ వేదిక చాలా వైబ్రంట్‌గా ఉందంటే దానికి ప్రధాన కారణం మీ రాక, మీ కేకలు, కేరింతలు. ఈ ఉత్సాహమే ఎప్పుడూ మేము కోరుకుంటాం’’ అని చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో.... చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ముందుకు నడిపించే ఇంధనం మీ ఉత్సాహం, ప్రోత్సాహమే. ఎవరైనా నన్ను ఏం సాధించావు? ఏం ఆర్జించావు? అని అడిగితే.. ఒకటి రామ్‌చరణ్, రెండోది కోట్లాదిమంది అభిమానులు అని చెప్పగలను. మనం నిజంగా కోట్లు గడించొచ్చు. కానీ, ఎంతకాలం మనవద్ద ఉంటాయో తెలియదు. కానీ, ఎప్పటికీ తరగనిది మీ అభిమానం అని గుండె లోతుల్లోంచి చెబుతున్నా. రాజకీయంగా కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ తిరిగొచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందా? అనే మీమాంస ఉండేది. ‘ఖైదీ నంబర్ 150’ని సూపర్ డూపర్ హిట్ చేసి, మీ అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని నిరూపించారు. కేటీఆర్‌గారి రాకతో ఈ ఫంక్షన్‌కి నిండుదనం వచ్చింది. మేమిద్దరం ఒకే బెంచ్‌మేట్స్.. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉంది ఏ స్కూల్లో, ఏ కాలేజ్‌లో అని అడగొద్దు.. అసెంబ్లీలో మేమిద్దరం ఒకే టైమ్‌లో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ‘రంగస్థలం’ షూటింగ్ అప్పుడు నెక్ట్స్ సినిమా ఏం చేస్తే బాగుంటుందని నాకు, రామ్‌చరణ్‌కి మధ్య చర్చ జరిగింది. ‘గోవిందుడు అందరివాడేలే’లో ఫ్యామిలీ డ్రామా చేశావ్, ‘ధృవ’ చిత్రంలో మోడ్రన్ కాప్‌గా చేశావ్. ఇప్పుడేమో గ్రామీణ నేపథ్యంలో ‘రంగస్థలం’ చేస్తున్నావ్. ఇక మిస్ అవుతున్నది ఏదైనా ఉందంటే అది మాస్. ప్రేక్షకుల్ని అలరించేలా, మన ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా మాస్ సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పా. ఎక్కడో ఓ లైన్ విన్నా.. బోయపాటి కాంబినేషన్ అని. ఆయనతో సినిమా చేస్తే మాస్‌కి దగ్గరవడానికి స్కోప్ ఉంటుంది చేయమని చరణ్‌ని ఉసిగొల్పా. తర్వాత బోయపాటిగారు వచ్చి ‘వినయ విధేయ రామ’ కథ చెప్పారు. హీరో పాత్ర వినగానే నాకు ‘గ్యాంగ్‌లీడర్’లో నా పాత్ర గుర్తుకొచ్చింది. సినిమా రషెష్ చూశా. చెప్పింది చెప్పినట్టు తీశారు బోయపాటి. ఈ చిత్రం ట్రైలర్ చూసి కొన్నిసార్లు శభాష్ అన్న సందర్భాలున్నాయి. చరణ్ చేశాడు అనడం కంటే బోయపాటి చేయించాడు.. అది చరణ్ తెరపై చక్కగా చూపించాడు. ‘రంగస్థలం’ సినిమాకి చక్కటి పాటలిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మంచి పాటలిచ్చారు. బోయపాటికి అవసరం మేరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వెన్నుదన్నుగా నిలిచారు దానయ్య. ఆయనకి విజయలక్ష్మి, ధనలక్ష్మి వరిస్తారు. ‘వినయ విధేయ రామ’ విజయం తథ్యం. దానయ్యగారు చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరం ‘భరత్ అనే నేను’, 2019 సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’, ఆ తర్వాతి ఏడాదికి అపజయం ఎరుగని రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేయడం ఆషా మాషీ కాదు. ఏ నిర్మాతకీ రాని గొప్ప అవకాశం ఆయనకి వచ్చింది. చాలా మంది నిర్మాతలు ‘ఏంటీ దానయ్య’ అని ఈర్ష్య పడేలా ఆయనకి అవకాశాలొస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను హీరోగా దానయ్యగారు ఓ సినిమా చేయనున్నారు. ఈ కాంబినేషన్‌ని సెట్ చేసింది రామ్‌చరణ్. దానయ్యగారితో చరణ్ వరుసగా రెండు సినిమాలు చేయడంతో పాటు నన్ను కూడా ఇరికించారు (నవ్వుతూ). త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్నది నా ఆకాంక్ష. మా కాంబినేషన్లో ఓ చక్కటి సినిమా వస్తుంది.. అది ఎప్పుడొస్తుందా అని నేను కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ– ‘‘మొత్తం తెలుగు చలన చిత్రపరిశ్రమకు... ఇంకా చెప్పాలంటే భారత చలన చిత్రపరిశ్రమలో ఒక దిగ్గజం, ఒక మహానటుడు... స్వయంకృషితో ఈ రోజు పరిశ్రమలో....ఇప్పుడే చరణ్ చెప్పినట్లు...సముద్రమంత అభిమానాన్ని.. అద్భుతమైన వారసులను కూడా అందించిన పెద్దలు, గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవిగారికి నమస్కారం. చరణ్ స్పీచ్ వింటుంటే మేము ఎలక్షన్స్‌లో స్పీచ్‌లు ఇచ్చిన దానికంటే బాగానే మాట్లాడాడని చెప్పవచ్చు. మా సోదరుడు చరణ్ ఈ మధ్య చాకచక్యంగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ‘ధృవ’కి కూడా నేను వచ్చాను. పెద్ద హిట్ సాధించింది. ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు బయట కలిశాం. ఆ గడ్డం చూసి ఏ సినిమా చేస్తున్నావ్? అని అడిగా. ఇదంతా రూరల్ సెట్టింగు. గ్రామీణ నేపథ్యంలో సినిమా అన్నాడు. నేను చచ్చినా చూడను ఆ సినిమా అన్నా. రిలీజ్ అయిన తర్వాత నా స్నేహితులు చాలా మంది చెప్పారు.. ఆ సినిమా అద్భుతంగా ఉందని. చూసిన తర్వాత చెబుతున్నాను.. అది నీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాను ఎలక్షన్స్‌లో కూడా బాగా వాడుకున్నాను నేను. ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటవా? అని నా స్పీచ్‌లో ప్రతిచోటా వాడాను. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మంచి సంగీతం ఇచ్చాడు. ఈ జోనర్ సినిమాలు నేను చూడను. కానీ బోయపాటిగారి కోసం చూస్తాను. చిరంజీవిగారి నుంచి వినయాన్ని, విధేయతను, సంస్కారాన్ని.. ఇలా అన్నింటినీ అలవరుచుకుని ఇండస్ట్రీలో అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్న చరణ్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు. కల్యాణ్‌గారు ఇక్కడ లేరు. ఈ మధ్య రెండు మూడు సార్లు మాట్లాడాను. వారి రాజకీయ, సినీ ప్రస్థానం కూడా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి విజన్‌ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్న కేటీఆర్‌గారి తపన చాలా స్ఫూర్తి. ఇప్పుడు బాస్ అనాలా? బిగ్‌బాస్ అనాలా? మెగాస్టార్ అనాలా? లేకుంటే ముద్దుగా మీరందరూ పిలిచే అన్నయ్యా అనాలా? అది తెలీదు కానీ నాకు మాత్రం నాన్నగారే. ‘సైరా’ షెడ్యూల్లో బిజీగా ఉండి కూడా వచ్చినందుకు థ్యాంక్స్ డాడ్. ‘వినయ విధేయ రామ’ అనగానే బోయపాటిగారు గుర్తొస్తారు. నాలుగేళ్ల కిందట ఈ సినిమా లైన్ చెప్పారాయన. అందరికీ నచ్చేలా మంచి సినిమా చరణ్‌కి ఇవ్వాలనే ఇన్నేళ్లు వెయిట్ చేసి రాసిన కథ ‘వినయ విధేయ రామ’. ప్రతి హీరో ఆయనతో ఒక్కసారైనా పనిచేయాలన్నది నా కోరిక. ఆయనతో పనిచేస్తే వచ్చే కిక్కే వేరప్పా. నా మాట నమ్మండి. అంతగొప్ప డైరెక్టర్, గొప్ప వ్యక్తి ఆయన. ఈ సినిమా నాకు మంచి మెమొరీగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమాకి నువ్వు ఎంత చాలెంజ్‌గా మ్యూజిక్ కొట్టావో తెలీదు కానీ మా కొరియోగ్రాఫర్లు మాత్రం మా మోకాళ్లు విరగ్గొట్టారు(నవ్వుతూ). భారీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ దానయ్యగారు అయిపోయారు. మా నాన్నగారి ‘ఖైదీ, గ్యాంగ్‌లీడర్’ వంటి కమర్శియల్ సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి ఒక లవ్లీ సినిమా ఇది. నాన్నగారు 1980లో ‘అభిలాష, ఖైదీ, మన్మథరాజు, మంత్రిగారి వియ్యంకుడు’ వంటి అన్ని జోనర్స్ చేశారు. అలా చేయాలని మాకూ కోరిక ఉండి ఈ సినిమా ఒప్పుకున్నా’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘వారసత్యం అనేది అసమర్థుడికి బరువు.. సమర్థుడికి ఓ బాధ్యత. రాజకీయరంగంలో కేసీఆర్‌గారి వారసుడిగా కేటీఆర్‌గారు, సినిమా రంగంలో చిరంజీవి వారసుడిగా చరణ్‌బాబు ఇద్దరూ ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. చరణ్‌బాబు ఆర్టిస్టుగా ఏంటో ఈ సినిమా విడుదల తర్వాత చూస్తారు. ప్రేక్షకులందరూ గుండెమీద చేయి వేసుకుని ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘పడి పడి లేచె మనసు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అది చూసి ఆ దర్శకుడికి పిచ్చెక్కిపోయింది: బన్నీ
‘‘ఆ మధ్య ఓ దర్శకుడు నాతో ‘శర్వా చాలా లిమిటెడ్ యాక్టర్’ అని అన్నారు. ‘స్కోప్ వస్తే ఏదైనా చేసే కెపాసిటీ తనకుంది’ అని నేను అన్నాను. తర్వాత ‘రన్ రాజా రన్’ రిలీజైంది. అది చూసి పిచ్చెక్కిపోయింది ఆ దర్శకుడికి. ఆయన నాకు ఫోన్ చేసి ‘స్వామీ.. నేను ఒప్పుకుంటాను. శర్వా ఏదైనా చేయగలడు’ అన్నారు. శర్వా సెల్ఫ్‌మేడ్ హీరో. అతని ఫంక్షన్‌కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అల్లు అర్జున్ అన్నారు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ట్రైలర్ నాకు చాలా నచ్చింది. బేసిక్‌గా లవ్ స్టోరీలంటే నాకు చాలా ఇష్టం. (ప్రేక్షకులు అరుస్తుంటే) ఏంటి అరుస్తున్నారు? నాకు పెళ్లి అయిపోయిందనా? ‘ఇంద్ర’ సినిమా స్టైల్లో చెప్పాలంటే ‘అదే యూత్.. అదే ఎనర్జీ’. ఈ చిత్రం ట్రైలర్లో మ్యాజిక్ కనిపించింది. మంచి సినిమాతో నిర్మాతగా మారిన సుధాకర్‌గారికి ఆల్ ది బెస్ట్. సాహిత్యం అందించిన కేకేగారికి, రచించిన హనుగారికి నా రెస్పెక్ట్. రచయితలను గౌరవించుకోవాలి. సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో నా కార్లో మ్యాగ్జిమమ్ విన్నది ‘పడి పడి..’ పాటలే. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్‌గారు పెద్ద పెద్ద హిట్లు ఇవ్వాలి. ‘ప్రేమమ్’, ఎంసీఏ, ఫిదా’లో సాయిపల్లవిని చూశాను. తనతో ఒకవేళ సినిమాలు చేస్తే సీన్స్ కన్నా కూడా సాంగ్స్ ఎప్పుడు చేస్తానా? అని వెయిట్ చేస్తున్నా. ‘ఫిదా’లో ‘వచ్చిండే..’ సాంగ్‌ని నేను చూసినన్నిసార్లు సాయిపల్లవి కూడా చూసుకొని ఉండదు. నా ఫేవరెట్ హీరోయిన్స్, డ్యాన్సర్స్, పెర్ఫార్మర్స్‌లో సాయి పల్లవి ఒకరు. మీకో (సాయి పల్లవిని ఉద్దేశించి) పెద్ద స్టార్ హీరో ఫ్యాన్ ఉన్నారు. ఆయన ఎవరో మాత్రం నేను చెప్పను. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై’ సినిమాల్లో లవ్‌ట్రాక్‌లు చాలా బావుంటాయి. హనుతో ఓ లవ్‌స్టోరీ చేయాలి అనుకున్నాను. కానీ శర్వా ఆ ఛాన్స్ కొట్టేశాడు. మన బలం మీద ముందుకు వెళ్తే ఇంకా బావుంటుంది అంటారు. హను బలం ప్రేమ కథలు. ఈ సినిమా ఆయనకు పెద్ద హిట్‌గా నిలుస్తుంది అనుకుంటున్నాను. మాతో కూడా లవ్‌స్టోరీలు తీయండి. శర్వా నాకంటే చిన్నోడు. పార్టీలో కలుస్తుంటాం. కానీ శర్వాగారు అంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకీ గౌరవం, స్థాయిని తెచ్చాయి. అందుకే గారు అంటున్నాను. ఈ మధ్యలో టీవీల్లోను, సమాజంలో సినిమా, రాజకీయ నాయకులని కూడా పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు. ‘గారు’ అని ఒక గౌరవం ఇవ్వండి. ఒకసారి టీవీలో చూస్తుంటే ఎవరో చిరంజీవిని పిలు అన్నారు. చిరంజీవి ఏంట్రా? చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్‌గారు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాలి. వినడానికి కొంచెం ఆర్టిఫీఫియల్గా ఉన్నా మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి. ‘గమ్యం’ నుంచి చూస్తున్నాను శర్వాగారిని. మాకు బ్యాగ్రౌండ్ ఉంది. నెపోటిజమ్‌కు (బంధుప్రీతి) బ్రాండ్ అంబాసిడర్లం (నవ్వుతూ). ఇలాంటి సెల్ఫ్ మేడ్ హీరోలంటే ఒకలాంటి అడ్మిరేషన్ నాకు. మనస్ఫూర్తిగా సినిమా ఆడాలి. అలాగే అదే రోజు విడుదలవుతున్న నా సొంత తమ్ముడు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ సినిమా కూడా ఆడాలి’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘హిట్ కొట్టనేమో అని టెన్షన్ పడకండి. హిట్ కొట్టే బాధ్యత నాది. దానికి కారణం ఏంటో చెప్పనా? ఈ మధ్యన ఇండస్ట్రీలో ‘గోల్డెన్ హ్యాండ్’ అంటున్నారు బన్నీని. మొన్న బన్నీకు ఫోన్ చేసి ‘ఇండస్ట్రీలో రెండు హిట్స్ విజయ్ దేవరకొండకు ఇచ్చారు. నన్ను టచ్ చేసి నాకు ఓ హిట్ ఇవ్వొచ్చు కదా?’ అని అడిగాను. బన్నీ నాకు ఇన్స్పిరేషన్. మేమందరం మంచి సినిమాలు చేస్తాం, డిఫరెంట్ సినిమాలు చేస్తాం. కానీ బన్నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సినిమాకు వంద కాదు నూట యాభై శాతం శ్రమిస్తాడు. ఇండస్ట్రీలో మంచి సినిమా వస్తే అది తీసిన టీమ్‌కు ఫస్ట్ కాల్ బన్నీ నుంచే వెళ్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే హను ఫ్లాప్ దర్శకుడు, సాయి పల్లవి, శర్వాకు ఇంతెందుకు ఖర్చు పెట్టారు? అని అడుగుతున్నారు. దానికి కారణం సినిమాలోని కంటెంట్. ఈ సినిమా నిర్మాత బ్రదర్‌లా అయిపోయారు నాకు. ఇప్పటి వరకూ ఏ దర్శకుడితో ఈ మాట చెప్పలేదు. హను నాకో గురువు అయిపోయాడు. సాయి పల్లవి చాలా డెడికేటెడ్. సంగీతదర్శకుడు విశాల్‌గారి నాన్నగారు పదిరోజుల క్రితం చనిపోయారు. ఆయినా కానీ సినిమాకు రీరీకార్డింగ్ చేశారు. రాసిపెట్టుకోండి.. నన్ను జేకే చూపించినంత అందంగా ఎవ్వరూ చూపించలేరు. 21న వస్తున్నాం. మా తమ్ముడు వరుణ్‌తేజ్ ‘అంతరిక్షం’ సినిమా కూడా వస్తోంది. క్రిస్మస్ సెలవల్లో మా రెండు సినిమాలు చూసి తెలుగు సినిమాను హిట్ చేయండి’’ అన్నారు.‘‘అల్లు అర్జున్‌గారి డ్యాన్స్‌కి నేను పెద్ద అభిమానిని. స్కూల్లో కూడా ఆయన పాటలకు డ్యాన్స్ చేసేద్దాన్ని. హనుగారికి థ్యాంక్స్. నన్ను నమ్మినందుకు. శర్వాగారు గురించి చాలా మంది హీరోయిన్స్ గొప్పగా చెప్పారు. నేనూ అదే చెబుతాను. ఆయన మంచి కో స్టార్. నటిగా నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేశారు’’ అన్నారు సాయి పల్లవి. ‘‘ఇది నాకు చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమాకి ముందు నాకు సక్సెస్ లేదు. ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నాను. నన్ను నమ్మారు శర్వానంద్. ప్రేమకథ చెప్పడానికి ముఖ్యంగా కావల్సింది సంగీతం, కథ, మంచి నటీనటులు. ఈ మూడు ఈ సినిమాకు బాగా కుదిరాయి. సుధాకర్‌గారికి సినిమాలంటే పిచ్చి. ఒక నిర్మాతకు అంత పిచ్చి ఉండటం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను’’ అన్నారు హను రాఘవపూడి. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
‘రంగు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
‘24 కిస్సెస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్ కొట్టదు!
‘‘మళ్లీ విజయ్ ఫంక్షన్‌కి వస్తారా? ఏదైనా ఇబ్బంది ఉందా? అని ఎస్కేయన్ అడిగాడు. ఇష్టమైనవాళ్ల కోసం చేసేది ఏదీ ఇబ్బంది కలిగించదు అన్నాను. దీన్నే విజయ్ స్టైల్లో చెప్పాలంటే నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్ కొట్టదు (నవ్వుతూ)’’ అని అల్లు అర్జున్ అన్నారు. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ తెరకెక్కించిన చిత్రం ‘టాక్సీవాలా’. యూవీ, జీఏ2 బ్యానర్స్‌పై ఎస్కేయన్ నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు పని చేసిన సాయికుమార్ రెడ్డిని, పాటలు రాసిన కృష్ణకాంత్‌ని మనం గౌరవించాలి. ఎందుకంటే.. కల్చర్‌ని ముందుకు తీసుకువెళ్లేది రచయితలే. సినిమాలకు అందరూ గుర్తింపు కోసం వస్తారు. అందరి కంటే ఎక్కువ పని చేసి తక్కువ పేరు పొందేది రచయితలే. నేనంటే క్రష్(ఇష్టం) ఉందని ప్రియాంక చెప్పింది. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం (నవ్వుతూ). ఉన్న అన్నీ పరిశ్రమల్లో అమ్మాయిలకు గౌరవం ఇచ్చేది చిత్రపరిశ్రమే. మీరు (కొత్త హీరోయిన్స్‌ని ఉద్దేశిస్తూ) సినిమాల్లోకి నమ్మకంగా రండి. ఎస్కేయన్ పెద్ద మెగా అభిమాని. జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, నిర్మాతగా ఎదిగాడు. ఎస్కేయన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను సినిమా చేయాలని అడిగిన ఏకైక ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్. ఎవరైనా ఎదిగితే నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న ఆఫీస్ బ్యాయ్ ఇప్పుడు ప్రొడక్షన్ మ్యానేజర్. నా దగ్గర పదేళ్లు ఉండి కూడా అలానే ఉంటే అతనికి నేనేం చేసినట్టు? ఏం చేయలేదు అనే ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. మనవాళ్లు మన పక్కనే ఉండకూడదు. మనతోపాటు ఎదగాలి. విజయ్ దగ్గర ఒర్జినాలిటీ ఉంది. మేం అందరం, మా కాంటెపరరీస్ ఒక రొట్టలో స్టక్ అయిపోయాం. నువ్వు అందులో లేవు. కొత్తగా చేస్తున్నావు. ఆ తీరు జనాలకు నచ్చింది. విజయ్ మంచి నటుడు. మేం గోల్డెన్ ప్లేట్. నా లాంచ్ రాఘవేంద్రరావుగారు, అశ్వనీదత్గార్లు చేశారు. తను ‘ఎవడే, పెళ్లి చూపులు..’ ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ సొంతంగా వచ్చాడు. సెల్ఫ్‌మేడ్ పర్సన్. నేనెంత పెద్ద నటుడిని అయినా సెల్ఫ్‌మేడ్ అని చెప్పుకోలేను. తనని తాను చెక్కుకున్న శిల్పం విజయ్. నేనెప్పుడూ టాలెంట్ ఉన్నోడి మీద జోక్‌లు వేయలేను. ఈ మధ్య విజయ్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. సడెన్‌గా స్టార్ అయితే నెగటీవ్ ఫోర్స్ కూడా ఉంటుంది. పట్టించుకోవద్దు విజయ్. అవన్నీ దాటి హిట్స్ కొడతావనే నమ్మకం నాకుంది. నాకంటే స్టార్ అయినా కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నీ సక్సెస్‌ని ఎంజాయ్ చేసేవాళ్లలో నేనొకడిని అని నమ్ము. పైరసీ చేయడం చాలా తప్పు. సినిమా అనేది మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే. పేపర్లో నాలుగో పేజీలో వార్తే. కానీ మాకు అది జీవితం. అందర్నీ గౌరవిస్తారు. సినిమా వాళ్లకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు? దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘విజయ్ వెరైటీ ఉన్న స్క్రిప్ట్స్‌నే ఎంచుకుంటాడు. రాహుల్ నీకు ఆల్ ది బెస్ట్. మా బ్యానర్లో ఎన్నో హిట్స్ వచ్చాయి. కానీ ‘గీతగోవిందం’ వందకోట్లు తీసుకువచ్చింది’’ అన్నారు. ‘‘ఫస్ట్ హాఫ్‌ని మూడు గంటల్లో రాసేశాం. సెకండ్ హాఫ్ 6 నెలలు రాశాం. మేం సంతృప్తి చెందినా ఇంకా బెటర్‌గా చేయండి అని మమ్మల్ని బన్నీ వాసు పుష్ చేశారు’’ అన్నారు రాహుల్ సంక్రిత్యాన్. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’ తర్వాత నన్ను పిలిపించారు బన్నీ అన్న. చాలా బాగా చేశారు. నాకిలాంటి సినిమాలు బాగా ఇష్టం. అని అభినందించారు. ‘అర్జున్ రెడ్డి’ అప్పుడు మళ్లీ పిలిపించి, 20 నిమిషాలు మాట్లాడారు. ‘గీత గోవిందం’ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ అన్న వచ్చారు. మళ్లీ ఇప్పుడు వచ్చారు. థ్యాంక్స్ అన్న. బన్నీ అన్నలా డ్యాన్స్ ఈ జన్మలో చేయలేను. ఇండస్ట్రీకు బయట వ్యక్తిని నేను. అవుట్‌సైడర్స్ నన్ను ఎక్కువ ఓన్ చేసుకోవడానికి కారణం అదే. మనలో ఒక్కడు సక్సెస్ సాధించినా మనవాడు కొట్టాడు అని సంతోషపడతారు. అందుకే చాలా మంది నాకు ఇంత ప్రేమని ఇస్తున్నారని అనుకుంటున్నాను. ‘పెళ్లి చూపులు’ చేస్తే గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ నాకు దారి చూపించాయి. వాళ్లు ఎస్కేయన్, బన్నీ వాసుని ఎలా తీసుకొచ్చారో అలా నేను కూడా వీలైనంత మందిని లాక్కెళ్తా. మా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. దాని వెనక చాలా మంది కెరీర్, ప్యూచర్ ఉంటుంది. ఎంటర్టైన్ అవ్వండి. కానీ వాళ్ల పనిని గౌరవించండి. థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి పైరేట్ చేసినవాళ్లు సిగ్గుపడేలా చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఎస్కేయన్ మాట్లాడుతూ – ‘‘ప్రొడ్యూసర్‌గా మారడానికి కారణం గాడ్ ఫాదర్ అల్లు అరవింద్‌గారు. మెగా అభిమానిగా బ్యానర్లు కట్టే నన్ను సినిమా ప్రొడ్యూసర్ని చేశారు. ఏ నిర్మాత అయినా కొడుకునో, మనవడినో నిర్మాతను చేస్తారు. మన ఫ్యాన్‌లో టాలెంట్ ఉందని తీసుకొచ్చి, నిర్మాతను చేశారు అల్లు అరవింద్‌గారు. ఇదెక్కడా జరిగి ఉండదు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. సూపర్ న్యాచురల్ సైన్స్ ఫిక్షన్. సినిమా లీక్ అయినా భయపడలేదు. మా కంటెంట్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. నా కెరీర్ ఏఏ (అల్లు అర్జున్)తో స్టార్ట్ అయింది. జీవితం ఇచ్చిన వాళ్ల గురించి చెప్పాలి. తన వాళ్లు కూడా ఎదగాలనుకునేవారు బన్నీ’’ అన్నారు. ‘‘నాకు అల్లు అర్జున్ మీద చాలా క్రష్ ఉంది.సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రియాంకా జవాల్కర్. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీను వైట్ల గొప్ప నటుడు
‘‘శ్రీను వైట్ల సినిమాలంటేనే ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మా కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా. ఫస్ట్ చిత్రం ‘నీకోసం’ కొంచెం ఎమోషనల్ లవ్‌స్టోరీ. ‘వెంకీ, దుబాయ్ శీను’ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండింటి కలయిక ‘అమర్ అక్బర్ ఆంటొని’. మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నా’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటొని’కి డబ్బింగ్ చెప్పేటప్పుడు విపరీతంగా నవ్వాను.. అంత ఎంజాయ్ చేశాను. తమన్‌తో ఇది 9వ సినిమా. నెక్ట్స్ పదో సినిమా. హిట్‌కి, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా నాకు ఎప్పుడూ సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తాడు. తమన్.. మనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నవీన్, రవి, మోహన్గార్లు సైలెంట్‌గా ఉన్నా వెటకారం ఎక్కువ. వీరితో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ. అంతమంచి ప్రొడక్షన్ హౌస్ ఇది. ఇలియానా.. ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. షీ ఈజ్ డార్లింగ్. మనం మళ్లీ పని చేస్తాం. శ్రీను వైట్ల కామెడీ, సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ సూపర్‌గానే ఉంటుంది. తను గొప్ప నటుడు. అతను చేసి చూపించినదాంట్లో మనం 50 శాతం చేస్తే చాలు విపరీతమైన పేరొస్తుంది. ఈ సినిమాలోని అందరి పాత్రల్లో శ్రీను కనిపిస్తారు.. ఇలియానాలో కూడా (నవ్వుతూ)’’ అన్నారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటొని’ కథని నేను, వంశీ రెండు నెలలు వర్కవుట్ చేసి, ఓ షేప్‌కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ప్రవీణ్, మరో అబ్బాయి ప్రవీణ్ జాయిన్ అయ్యి రచనా సహకారం అందించారు. మేం నలుగురం 8 నెలలు కష్టపడి స్క్రిప్ట్ పూర్తి చేశాం. ఈ సినిమా స్క్రిప్ట్ మేకింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాం. ఈ ప్రయాణం బాగుంది. ప్రయాణం బాగున్నప్పుడు ఫలితం కూడా అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముతాను. ఈ సినిమాని మీరు ఆశీర్వదిస్తారు, పెద్ద హిట్ చేస్తారని 100 శాతం నాకు నమ్మకం ఉంది. రవితేజ నా ట్రబుల్ షూటర్. నేనెప్పుడైనా డల్‌గా ఉన్నప్పుడు ఎనర్జీ ఇచ్చి మళ్లీ పైకి తీసుకొస్తుంటాడు. అలా ‘వెంకీ’ అప్పుడు, ‘దుబాయ్ శీను’ అప్పుడు చేశాడు.. ఇప్పుడు ‘అమర్ అక్బర్ ఆంటొని’కి చేశాడు. తనకి నామీద ఉన్న నమ్మకానికి నేనెప్పుడూ థ్యాంక్ఫుల్గానే ఉంటాను. థ్యాంక్యూ రవి. తను ఇచ్చిన ఎనర్జీయే ఈ సినిమా. మేం రాసుకున్న కథని అలాగే తీయగలిగాం. దానికి కారణం నిర్మాతలు. నేను చేసిన సినిమాల్లో చాలా లగ్జరీగా చేసిన సినిమా ఇది. రెండు షెడ్యూల్స్ అమెరికాలో చేసినా నిర్మాతలు నాకు బాగా సహకరించినందుకు చాలా థ్యాంక్స్. వెంకట్ సి.దిలీప్ మంచి విజువల్స్ ఇచ్చాడు. తమన్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఇలియానాతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నా.. ఇప్పటికి కుదిరింది. నేను ఫోన్ చేయగానే నటించేందుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. తన డెడికేషన్ ప్రత్యక్షంగా చూశాను. మంచి నటి. తనతో నేను కూడా మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి. కష్టపడి డబ్బింగ్ చెప్పినందుకు థ్యాంక్స్’’ అన్నారు. ఇలియానా మాట్లాడుతూ– ‘‘మిమ్మల్ని (ప్రేక్షకులు) చాలా మిస్ అయ్యాను.. మళ్లీ వెనక్కి వచ్చాను.. చాలా సంతోషంగా ఉంది.. లవ్ యూ. ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంలో తొలిసారి డబ్బింగ్ చెప్పాను. మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. నన్ను నమ్మినందుకు శ్రీనుగారికి థ్యాంక్స్. రవిగారితో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. తను రియల్లీ గుడ్ ఫ్రెండ్. తనతో చాలా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్ చక్కని పాటలు ఇచ్చారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘రవితేజగారి అభిమానులకు హాయ్. మీరిచ్చే కిక్కే వేరు. 100 సినిమాలు ఎలా చేశానని నాకే తెలీదు. ఇదంతా రవితేజగారు ఇచ్చిన కిక్కే. ఆయన ఇచ్చే ఎనర్జీ నా బండికి పెట్రోల్‌లాగా నడిపిస్తూ ఉంటుంది. ‘పవర్’ సినిమా ఆడియోలో చెప్పాను. ఆయనకు ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ అయితే.. నాకు అమ్మా నాన్న రవితేజ. అందులో నిజం ఉంది. మ్యూజిక్ చేయడానికి నాకు ధైర్యం రాలేదు. ‘నువ్వు చేయగలవు.. చేస్తావు’ అంటూ ఆయన ఇచ్చిన కిక్, ధైర్యం, నమ్మకం, బలంవల్లే 100 సినిమాలు చేయగలిగాను. రవితేజగారితో 9 సినిమాలు చేశాను.. ఏ హీరోతోనూ చేయలేదు. శ్రీను వైట్లగారితోనూ 5 సినిమాలు చేశాను. ఈ రోజుకి కూడా ‘దూకుడు’ పాటలు వింటుంటే నేనేనా కంపోజ్ చేసింది అనిపిస్తుంది. అంత ఈజీగా ఆయన నా వద్ద నుంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు. మనకు నచ్చిన హీరో, డైరెక్టర్‌తో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రావడంకంటే అదృష్టం ఏం ఉంటుంది. రవితేజని మాస్ మహారాజా అని పిలవను. ఆయన మనసే మహారాజ’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో ఈ సినిమా చేసినందుకు రవితేజ, శ్రీను వైట్లగార్లకు థ్యాంక్స్. తమన్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మళ్లీ ఆయనతో పని చేయాలనుకుంటున్నాం. శ్రీను వైట్లగారి గత సినిమాల్లో ఉన్నట్లు చాలామంది కమెడియన్స్ ఇందులో ఉన్నారు. టోటల్ ఎంటర్టైనర్ ఇది. శ్రీను వైట్లగారు దర్శకునిగానే కాదు.. మా నిర్మాతల రోల్ కూడా తీసుకున్నారు. ఓ మూవీ బడ్జెట్ కంట్రోల్ డైరెక్టర్ చేతిలో ఉంటుందని వంద శాతం నిరూపించారు’’ అన్నారు. చిత్రనిర్మాతలు వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి, నిర్మాతలు అనీల్ సుంకర, కిరణ్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్, నటులు గౌతంరాజు, గిరి, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, విశ్వ, పారిశ్రామికవేత్త రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. -
అందుకోసమే చైతుకు అమ్మాయిలు ఫోన్ చేసేవారట!
‘తాతగారు మెదలుపెట్టిన ప్రయాణం ఇది. నాన్నగారికి, సుమంత్ అన్నకు, నాకు, అఖిల్‌కు, సమంతకు ఇలా మా అందరికీ మీ ప్రేమాభిమానాలు, సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. తరాలు మారినా తరగని ప్రేమను అందిస్తున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరిచాను, కొన్నిసార్లు ఎనర్జీ ఇచ్చాను. కానీ మనం అందరం ఇలా కలసి ఉండటం నాకు ముఖ్యం’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిÔ¶ ంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ వేడుకకు వచ్చినందకు కొరటాల శివగారికి, రౌడీ విజయ్‌కు థ్యాంక్స్. ఉదయం లేవగానే ఓ చెడు వార్త వినాల్సి వచ్చింది. మా కుటుంబానికి చాలా సపోర్ట్‌గా ఉన్న శివప్రసాద్‌గారు మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం అందరి కంటే చందు ఎక్కువగా కష్టపడ్డాడు. యునిక్ పాయింట్‌కి కమర్షియల్ పాయింట్స్ కలిపి మంచి సినిమా తయారు చేశాడు. కీరవాణిగారు తాతగారితో, నాన్నతో చేశారు. ఆయనతో కలసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో నాన్న పంచుకున్న జ్ఞాపకాలు ఎప్పుడూ మాతో పంచుకుంటారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నన్ని రోజులు అమ్మాయిలు ఫోన్ చేసి, షూటింగ్‌కి రావచ్చా? మాధవన్‌ని చూడొచ్చా అని అడిగేవాళ్ళు. ‘చెలి’ చూసినప్పటి నా ఫ్రెండ్స్ ఇంకా మిమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. మీరు ఈ సినిమా అంగీకరించడంతో మా నమ్మకం ఇంకా పెరిగింది. మాధవన్ ఓ సినిమాని ఊరికే అంగీకరించరని మాకు తెలుసు. ఏదో కొత్తదనం లేకపోతే ఆయన ఒప్పుకోరు. ని«ధీ.. నువ్వు ఇక్కడ ఉండటానికి ఎన్ని కలలు కన్నావో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. భూమికగారు, ఇలా అందరికీ థ్యాంక్స్. మైత్రీ బ్యానర్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లారు. మిమ్మల్ని (అభిమానులు) ఆనందపరచడం కోసం నిజాయితీగా పని చేస్తాను. నా కెరీర్లో ఇది పెద్ద సినిమా. కాంబినేషన్‌ని నమ్మి కాదు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. ఇలాంటి నిర్మాతలు మనకు కావాలి. ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ – ‘‘నాగార్జునగారితో పని చేయడం ఎంత ఎంజాయ్ చేశానో చైతన్యతో పని చేయడం కూడా అంతే ఆనందించాను. రచయితలు అందరూ చక్కటి సాహిత్యం అందించారు. నిర్మాతలు ప్రతీది అడిగి తెలుసుకున్నారు. అడిగింది ఇచ్చారు’’ అన్నారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ ఇలా ప్రతీ సినిమాకు నేర్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. శివ గారికి, విజయ్ దేవరకొండకి ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు థ్యాంక్స్. చైతన్యతో ఇంకో లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. మాధవన్గారూ.. తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. ‘బాహుబలి’ తర్వాత కీరవాణిగారు ఈ సినిమానే చేశారు’’ అని నిర్మాతలు అన్నారు. మాధవన్ మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్ వాళ్ల వల్ల స్ట్రయిట్ తెలుగు సినిమా చేశాను. వాళ్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు. ఈ సినిమా కూడా సూపర్‌గా ఉంటుంది. సినిమాకు పని చేసిన వాళ్లందరూ సహృదయులు. ముఖ్యంగా నాగ చైతన్య. నేను మీ ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్‌ని చైతన్యా. నీతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చందూతో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మైత్రీ బ్యానర్ నా ఫ్యామిలీ లానే. పెద్ద హిట్ సాధిస్తారనుకుంటున్నాను. పవర్ఫుల్ టైటిల్‌తో వస్తున్నారు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్. చైతన్య చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రెండు సినిమాలు చేస్తున్నాను. వాళ్ల ప్యాషన్ అద్భుతం. మాధవన్‌గారిని తెలుగులో చూడటం ఆనందంగా ఉంది. చందూ మరో మంచి సినిమా తీశాడని అనుకుంటున్నాను. చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హ్యాండ్‌షేక్, నవ్విన తీరుకే నచ్చేశారు. ఇండస్ట్రీలో ఎవరు చైతన్య గురించి మాట్లాడినా మంచి విషయాలే చెబుతారు. వ్యక్తిగా అంత మంచివాడు’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కి థ్యాంక్స్. చైతూతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మాధవన్‌గారితో పని చేయడం మర్చిపోలేను’’ అన్నారు నిధి అగర్వాల్. రామకృష్ణ, మోనికా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కెమెరామేన్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.