ఆర్.ఎస్.నాయుడు, నభా నటేశ్, సుధీర్‌బాబు, రాణి, హరీష్ శంకర్, సందీప్ కిషన్
‘‘మా ప్రొడక్షన్‌లో వస్తున్న తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఆర్.ఎస్.నాయుడు చెప్పిన కథ హీరో సుధీర్‌బాబుతో పాటు ప్రొడ్యూసర్ సుధీర్‌బాబుకి బాగా నచ్చేసింది (నవ్వుతూ). హీరోగా చేస్తూ నిర్మాతగా చేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. బాగా ఎంజాయ్ చేశాను. నాకొక కొడుకో, కూతురో పుట్టినట్టుగా ఉంది’’ అని సుధీర్‌బాబు అన్నారు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభా నటేశ్ కథానాయిక.
ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారి పేరు (పోసాని రాణి) పెట్టి సినిమా చేస్తున్నాననే టెన్షన్ ఉండేది. సినిమా అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఆర్.ఎస్.నాయుడు చాలా మెతక మనిషి అనుకుంటాం. కానీ ఈ చిత్రం చూసిన తర్వాత ఎంత బాగా తీశాడో అనుకుంటాం’’ అన్నారు. ‘‘నేను చేసిన 15 నిమిషాల షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో సుధీర్‌బాబుగారు ఈ సినిమా నిర్మించారు.
‘సమ్మోహనం’తో నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు. మా సినిమాతో ఆయన నటన గురించి ఇంకా మాట్లాడుకుంటారు’’ అన్నారు ఆర్.ఎస్. నాయుడు. ‘‘కొత్తగా ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సుధీర్‌గారికి అభినందనలు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి’’ అన్నారు నిర్మాత కేకే రాధామోహన్. ‘‘నా దృష్టిలో సుధీర్ వన్నాఫ్ ది బెస్ట్ యాక్టర్స్. అతని సామర్థ్యాన్ని తెలుగు ఇండస్ట్రీ తక్కువగా వాడుకుంటోందని అనుకుంటున్నా.
నటుడిగా తన సత్తా బయటపెట్టే మంచి స్క్రిప్ట్స్ రావాలి’’ అన్నారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘భాగి’ సినిమాలో సుధీర్ స్క్రీన్ ప్రెజన్స్‌కి నేను ఫ్యాన్ అయితే.. ‘సమ్మోహనం’ సినిమాలో తన నటనకు అభిమాని అయ్యాను. తెలుగు సినిమా మారుతోంది. మంచి కంటెంట్ సినిమాలు, మంచి సక్సెస్‌లు వస్తున్నాయి’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. నభా నటేశ్, నిర్మాతలు రాజీవ్, శివలెంక కృష్ణ ప్రసాద్, అనీల్ సుంకర, హీరోలు రాహుల్ రవీంద్రన్, çసందీప్‌కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment