ఆర్.ఎస్. నాయుడు
సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభా నతేశ్ హీరోయిన్. ఆర్.ఎస్. నాయుడు (రాజశేఖర్ నాయుడు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు పలు విశేషాలు పంచుకున్నారు.
► మాది అనంతపూర్‌లో తాడిపత్రి. డిగ్రీ కంప్లీట్ చేశాను. సినిమాల మీద విపరీతమైన ఆసక్తితో రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను. సెమిస్టర్ మధ్యలో ‘నీ మాయలో’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. మంచి రీచ్ వచ్చింది. ఓ ఆఫర్ కూడా వచ్చింది. కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడే సినిమా స్టార్ట్ చేయాలని ఆ ఆఫర్‌ని వద్దన్నాను.
► ఏ దర్శకుడి దగ్గర అయినా పని చేస్తే వాళ్ళ ప్రభావం మన మీద పడిపోతుందేమో అని ఎవ్వరి దగ్గరా వర్క్ చేయలేదు. ఫిల్మ్ స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఆఫర్స్ కోసం చూస్తుంటే ‘ఎవరి దగ్గర పని చేశావు?’ అని అడిగేవారు. అప్పుడు ‘స్పందన’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. పెద్దగా రీచ్ అవ్వలేదు. కానీ రీచ్ అవ్వాల్సిన వాళ్లకు రీచ్ అయింది. ఒక ప్రొడ్యూసర్ కథ ఉందా? అని అడిగారు.
► నా కథ పట్టుకొని సుధీర్‌బాబు వాళ్ల మేనేజర్‌కి చెప్పాను. నేను చేసిన తప్పేంటంటే కథను హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో చెప్పాను. ఆ తర్వాత వేరే ప్రొడ్యూసర్‌కి ఇదే కథ చెప్పాను. ఆయనే మళ్లీ సుధీర్‌కు చెప్పారు. అలా ఈ కథ సుధీర్‌కే Ðð ళ్లింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని నన్ను సుధీర్ దగ్గరకు తీసుకువెళ్లిన నిర్మాతే నిర్మించాలి. కానీ మా ఇద్దరికీ ఎందుకో సఖ్యత కుదిరినట్టు అనిపించలేదు. అదే విషయం సుధీర్‌కి చెబితే సరే.. నేనే నిర్మిస్తా అన్నారు.
► ఫిల్మ్ స్కూల్‌లో నా ఫ్రెండ్ ‘వెళ్ళిపోమాకే’ తీశాడు. అది బావుంది అన్నారు కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. అప్పుడే అనిపించింది, ఎక్కువ మందికి రీచ్ అవ్వడమే ముఖ్యం అని ఫిక్స్ అయ్యాను.
► హీరోది మొత్తం నా క్యారెక్టరైజేషనే. హీరో నాన్న, బాబాయ్ పాత్రలకు కూడా మా నాన్న, బాబాయ్‌లనే ప్రేరణగా తీసుకుని రాసుకున్నాను. అలాగే పేర్లు కూడా అవే పెట్టాను. హీరోకు మాత్రం వేరే పేరు పెట్టాను (నవ్వుతూ). హీరోయిన్ పాత్ర మాత్రం నాకు ఆపోజిట్‌గా ఉండేట్టుగా హైపర్‌గా, ఎనర్జిటిక్‌గా రాశాను.
► కొత్తగా ఏదో చెప్పాం అనడంలేదు. కానీ కొత్త క్యారెక్టరైజేషన్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాం. కంటెంట్‌ని, కమర్షియాలిటీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాం. సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే ఓ మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ విషయాలు త్వరలోనే వెల్లడిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment