
గణేశ్, రష్మికా మండన్నా
గణేశ్, రష్మికా మండన్నా కథానాయికలుగా సుని దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘చమ్మక్’. దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాతలుగా ‘గీతా..ఛలో: వీకెండ్ పార్టీ’ పేరుతో ఈ సినిమాను ఈ నెల 3న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయడమే కాదు. రిలీజ్ విషయంలోనూ సరైన ప్రణాళిక ఉండాలి. నిర్మాతలు పంపిణీరంగంలో అనుభవజ్ఞులు. ఈ సినిమాతో నిర్మాతలకు డబ్బు, పేరు రావాలి’’ అన్నారు.
‘‘డబ్బింగ్ సినిమాలు ఎన్ని విడుదలైనా టేస్ట్‌ఫుల్ సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘గీత గోవిందం’ సినిమాలో వందకోట్ల క్లబ్‌లో చేరారు రష్మిక. నంబర్ 1 రేస్‌లో ఉన్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు ఈ చిత్రసమర్పకుడు దివాకర్. ‘‘కన్నడలో ఈ చిత్రం దాదాపు 30కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment