తెలుగు దియా? | Samantha to star in remake of Kannada film Dia | Sakshi
Sakshi News home page

తెలుగు దియా?

Published Sun, Apr 19 2020 6:30 AM | Last Updated on Sun, Apr 19 2020 6:30 AM

Samantha to star in remake of Kannada film Dia - Sakshi

సమంత

2018లో ‘యు టర్న్‌’ (కన్నడ ‘యు టర్న్‌’– తెలుగు, తమిళ రీమేక్‌), 2019 లో ‘ఓ బేబీ’ (సౌత్‌ కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ తెలుగు రీమేక్‌), 2020లో ‘జాను’ (తమిళ ‘96’ తెలుగు రీమేక్‌)... ఇలా మూడేళ్లుగా ఏడాదికో రీమేక్‌ చిత్రంలో నటించారు సమంత. తాజాగా మరో కన్నడ చిత్రం తెలుగు రీమేక్‌లో సమంత నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ఏడాది కన్నడలో సూపర్‌ హిట్‌ సాధించిన ‘దియా’ తెలుగులో రీమేక్‌  కానుందనే టాక్‌ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో నడుస్తోంది. ఇందులో సమంత నటించే అవకాశాలు ఉన్నాయట. ఇక ‘దియా’ చిత్రకథ విషయానికి వస్తే... ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ అమ్మాయి కథ.. మరో కొత్త ప్రేమకు ఎలా దారి తీసింది? తన గత ప్రేమ తాలూకు అంశాలు ఆమె ప్రస్తుత ప్రేమను ఎంతలా ప్రభావితం చేశాయి? అనే అంశాల నేపథ్యంలో సాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement