మాలో వాళ్లని చూసుకుంటారు – తరుణ్‌ | Idi Naa Love Story Pre Release Event | Sakshi
Sakshi News home page

మాలో వాళ్లని చూసుకుంటారు – తరుణ్‌

Published Wed, Feb 14 2018 1:10 AM | Last Updated on Wed, Feb 14 2018 1:10 AM

Idi Naa Love Story Pre Release Event - Sakshi

మనోజ్, శ్రీకాంత్, తరుణ్, నిఖిల్‌

‘‘చాలా గ్యాప్‌ తర్వాత ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. క్లీన్‌ లవ్‌స్టోరీ ఇది. సినిమాకి అందరూ కనెక్ట్‌ అవుతారు. అబ్బాయిలు వాళ్లని నాలో.. అమ్మాయిలు హీరోయిన్‌లో వాళ్లని చూసుకుంటారు’’ అని హీరో తరుణ్‌ అన్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్‌.వి.ప్రకాష్‌ నిర్మించిన ‘ఇది నా లవ్‌స్టోరీ’ ఈరోజు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. తరుణ్‌ మాట్లాడుతూ –‘‘రమేష్, గోపిలకు ఇది తొలి సినిమా అయినా  చక్కగా డైరెక్ట్‌ చేశారు. క్రిస్టోఫర్‌ జోసెఫ్‌ అద్భుతమైన విజువల్స్, శ్రీనాథ్‌ విజయ్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఓవియా చక్కగా నటించారు. వీరిందరికీ తెలుగులో ఇది తొలి సినిమా. గోగినేని బాలకృష్ణగారు మా సినిమాని విడుదల చేస్తున్నారు’’ అన్నారు. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ లవ్‌స్టోరీ ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్కడో ఒక చోట కనెక్ట్‌ అవుతారనే కాన్ఫిడెన్స్‌ ఉంది.

సినిమా ఎవర్నీ నిరుత్సాహపరచదు. అందరికీ నచ్చుతుంది. అడగ్గానే మంచు మనోజ్‌గారు అతిథి పాత్ర చేసినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకులు రమేష్, గోపి. ‘‘ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌ బాగా నచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. తరుణ్‌కి మంచి సక్సెస్‌ రావాలి’’ అన్నారు మంచు మనోజ్‌. నిర్మాతలు డి.సురేశ్‌బాబు, కె.ఎల్‌.నారాయణ, చిత్రనిర్మాత ఎస్‌.వి.ప్రకాష్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీనాథ్‌ విజయ్, హీరోలు శ్రీకాంత్, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement