edhi na love story
-
మాలో వాళ్లని చూసుకుంటారు – తరుణ్
‘‘చాలా గ్యాప్ తర్వాత ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. క్లీన్ లవ్‌స్టోరీ ఇది. సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. అబ్బాయిలు వాళ్లని నాలో.. అమ్మాయిలు హీరోయిన్లో వాళ్లని చూసుకుంటారు’’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించిన ‘ఇది నా లవ్‌స్టోరీ’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. తరుణ్ మాట్లాడుతూ –‘‘రమేష్, గోపిలకు ఇది తొలి సినిమా అయినా చక్కగా డైరెక్ట్ చేశారు. క్రిస్టోఫర్ జోసెఫ్ అద్భుతమైన విజువల్స్, శ్రీనాథ్ విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఓవియా చక్కగా నటించారు. వీరిందరికీ తెలుగులో ఇది తొలి సినిమా. గోగినేని బాలకృష్ణగారు మా సినిమాని విడుదల చేస్తున్నారు’’ అన్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ లవ్‌స్టోరీ ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారనే కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా ఎవర్నీ నిరుత్సాహపరచదు. అందరికీ నచ్చుతుంది. అడగ్గానే మంచు మనోజ్గారు అతిథి పాత్ర చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు దర్శకులు రమేష్, గోపి. ‘‘ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ బాగా నచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. తరుణ్‌కి మంచి సక్సెస్ రావాలి’’ అన్నారు మంచు మనోజ్. నిర్మాతలు డి.సురేశ్‌బాబు, కె.ఎల్.నారాయణ, చిత్రనిర్మాత ఎస్.వి.ప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ విజయ్, హీరోలు శ్రీకాంత్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి ఫీల్‌తో...
‘నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు తరుణ్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’. రమేష్ గోపి దర్శకత్వంలో అభిరామ్ సమర్పణలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇది. ట్రైలర్, సాంగ్ టీజర్‌కి సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వచ్చింది. యూత్‌తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లీన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఓవియా మా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు’’ అన్నారు రమేష్ గోపి. ‘‘2018 ది బెస్ట్ మూవీస్‌లో ‘ఇది నా లవ్ స్టొరీ’ ఒకటిగా నిలుస్తుంది. ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ఎస్.వి.ప్రకాష్. -
వేలంటైన్స్ డేకి ప్రేమకథ
‘‘నాగార్జునగారు ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమా టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. టీజర్ పెద్ద హిట్ అయింది. నా పుట్టినరోజున (08.01.) ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేష్–గోపీ దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించిన చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఇది రెగ్యులర్ ప్రేమకథ కాదు. ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తా. ట్రిపుల్ రోల్ చేశానా? మూడు షేడ్స్ ఉన్న పాత్ర చేశానా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. రమేష్–గోపీ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి, నువ్వే నువ్వే’ సినిమాలకంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. లవర్స్‌కు మంచి ట్రీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 14న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ఎస్.వి.ప్రకాష్. సంగీత దర్శకుడు శ్రీనాథ్ విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జగదీశ్.ఎస్, అరుణ్ అజాద్, కో–ప్రొడ్యూసర్: ఎ.గణేశ్. -
హృదయాలను హత్తుకునే ప్రేమ
లవర్‌బోయ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఓవియా కథానాయిక. రమేష్ గోపి దర్శకత్వంలో రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ఎస్వీ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తరుణ్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా రమేష్ గోపి చక్కగా తెరకెక్కించారు. శ్రీనాథ్ విజయ్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతం ఎక్స్ట్రార్డినరీగా కుదిరింది’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. తరుణ్గారి నటన సూపర్బ్. ఈ సినిమాలో ఆయన నటనలోని మరో కోణాన్ని చూస్తారు. మేకింగ్ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రమేష్ గోపి. ‘‘ఒక మంచి ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి’’ అన్నారు శ్రీనాథ్ విజయ్. ఈ చిత్రానికి సమర్పణ: అభిరామ్.