
తరుణ్
‘నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు తరుణ్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’. రమేష్ గోపి దర్శకత్వంలో అభిరామ్ సమర్పణలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇది. ట్రైలర్, సాంగ్ టీజర్‌కి సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వచ్చింది. యూత్‌తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లీన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఓవియా మా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు’’ అన్నారు రమేష్ గోపి. ‘‘2018 ది బెస్ట్ మూవీస్‌లో ‘ఇది నా లవ్ స్టొరీ’ ఒకటిగా నిలుస్తుంది. ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ఎస్.వి.ప్రకాష్.
Comments
Please login to add a commentAdd a comment