tharun
-
రెండు సంప్రదాయాల్లో డైరెక్టర్,హీరోయిన్ల పెళ్లి
కన్నడ ప్రముఖ దర్శకుడు తరుణ్ సుధీర్, నటి సోనల్ రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఆగష్టు 11న బెంగళూరు పూర్ణిమ ప్యాలెస్‌లో హిందూ సంప్రదాయంలో వారు పెళ్లి చేసుకున్నారు. సిని ప్రముఖలతో పాటు ఇరువైపుల కుటుంబసభ్యుల సమీక్షంలో జంట ఒక్కటయ్యారు. మంత్ర ఘోషణల మధ్య తరుణ్ సోనల్‌కు తాళి కట్టాడు. హీరో దర్శన్‌తో కాటేరా సినిమాను తెరకెక్కించి తెలుగు వారికి కూడా ఆయన పరిచయం అయ్యారు.తరుణ్ సుధీర్ సతీమణి నటి సోనల్ సూచన మేరకు మంగళూరులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 2న మరోసారి వివాహం చేసుకున్నారు. మంగళూరు చర్చిలో ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వారి వివాహాన్ని సంబరంగా చేసుకున్నారు. నూతన జంటకు సినీ, టీవీ రంగాల నటీనటులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. -
41 ఏళ్ల డైరెక్టర్‌తో 28 ఏళ్ల హీరోయిన్ పెళ్లి.. వీళ్లు ఎవరంటే?
ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఇది చాలాసార్లు ప్రూవ్ అయిన విషయమే. కలిసి పెరిగిన వాళ్లు కావొచ్చు, కలిసి ఒకేచోట పనిచేస్తున్న వాళ్లు కావొచ్చు ప్రేమలో పడుతుంటారు. అలా ఇప్పుడు ఓ కన్నడ డైరెక్టర్.. తన సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి వరకు వచ్చేశాడు. తాజాగా తన బంధాన్ని అఫీషియల్ చేస్తూ వివాహ తేదీని ప్రకటించాడు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య)తరుణ్ సుధీర్.. చైల్డ్ ఆర్టిస్టుగా 1990లోనే కన్నడ ఇండస్ట్రీకి వచ్చేశాడు. 2019 వరకు అప్పుడప్పుడు నటిస్తూ వచ్చాడు. మరోవైపు రైటర్‌గానూ స్టార్ హీరోల సినిమాలకు పనిచేశాడు. 2017లో 'చౌక' అనే మూవీ తీశాడు. దీని తర్వాత 'రాబర్ట్', 'కాటేరా' చిత్రాలు చేశాడు. ఇక 'రాబర్ట్' చేస్తున్న టైంలో అందులో నటించిన సోనాలి మొంటిరోతో ప్రేమలో పడ్డాడు. కాకపోతే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు.తాజాగా తామిద్దరం ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టిన తరుణ్, సోనాలి.. ఆగస్టు 11న బెంగళూరులో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే డైరెక్టర్, హీరోయిన్గా తాము ఎలా ప్రేమలో పడ్డాం అనేది సింబాలిక్‌గా చూపిస్తూ వెడ్డింగ్ వీడియో రూపొందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Sonal Monteiro Official (@sonal_monteiro_official) -
ఆ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి: విశ్వక్ సేన్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘గలీజ్..’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రోటి కపడా రొమాన్స్’ టీమ్‌ను చూస్తుంటే నాకు మా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు ప్రేమకథలపై మంచి జడ్జ్మెంట్ ఉంది. ఈ సినిమా విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్ రైడ్ ఫిల్మ్ ఇది’’ అన్నారు విక్రమ్ రెడ్డి. ‘‘ఓ కొత్త పాయింట్‌ను యువతకు చె΄్పాలని ‘రోటి కపడా రొమాన్స్’లాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తీశాం’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ‘‘ప్రేక్షకులందర్నీ అలరించే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత సృజన్‌కుమార్. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించిన ఈ ‘గలీజ్’ పాటను రాహుల్ సిప్లిగంజ్, పీవీఎన్ఎస్ రోహిత్ పాడారు. -
'నువ్వే కావాలి' హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేం చేస్తుంది? ఎలా ఉంది?
హీరోయిన్ రిచా పల్లాడ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నువ్వే కావాలి హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రేమకథాచిత్రం వచ్చి దాదాపుగా 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక నువ్వేకావాలి సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన రిచాకు ఈ సినిమాతోనే క్రేజ్ దక్కింది. అయితే ఆ తర్వాత ఆడపాదడపా సినిమాలు చేసినా కెరీర్లో నిలదొక్కుకోలేకపోయింది. ఇక 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. రిచాకు ఒప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు. 2016లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రిచా చివరగా ఆది పనిశెట్టి నటించిన మలుపు అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ రిచా నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. View this post on Instagram A post shared by Shibu Khan (@shibu_shimmer) -
కేసీఆర్‌కు తన ఎమ్మెల్యేలపై ఎందుకు విశ్వాసం లేదు: తరుణ్ చుగ్
-
సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సవాల్
సాక్షి, ఢిల్లీ: ఫామ్ హౌస్ వీడియోలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే వీడియోలపై ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు. ఇప్పటికే బండి సంజయ్ ఆలయంలో ప్రమాణం చేశారన్నారు. ఈ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘మునుగోడులో అధికారం దుర్వినియోగం చేసింది. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వరుకు మంత్రులు అక్కడే ఉన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారు. నిజ నిజాలేంటో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు’’ అని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్‌కు తన ఎమ్మెల్యేలపై ఎందుకు విశ్వాసం లేదు అంటూ ఆయన ప్రశ్నించారు. మీ దగ్గర అమ్ముడుపోయే ఎమ్మెల్యేలే ఉన్నారా?. సీఎం కేసీఆర్ సినిమా కట్టుకథలు వినిపిస్తున్నారు. సెవెన్ స్టార్ ఫాంహౌస్‌లో కూర్చుని కథలు రచిస్తున్నారు. ముగ్గురు బ్రోకర్లలో ఎవరితోనూ తమకు సంబంధాలు లేవన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ప్రజలు చరమగీతం పాడతారని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. చదవండి: పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? -
Nuvve Nuvve@20 Years: 'నువ్వే నువ్వే’లోని ఈ డైలాగ్స్ గుర్తున్నాయా?
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2002లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో 'సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా 'నువ్వే నువ్వే' నిలిచింది. వెండి నందిని 'స్రవంతి' రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో బాగా పేలాయి. ‘నువ్వే నువ్వే’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 10) నాటికి 20 ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు.. ► అమ్మ, ఆవకాయ్, అంజలి... ఎప్పుడూ బోర్ కొట్టవు. ► ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు... పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. ► కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం. ►ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు. ►సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ►డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు. ► మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు. ►ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని... వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు. ►ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు... ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని? ►నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా? ► డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు. ►తాజ్ మహల్... చార్మినార్... నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు. ► నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. -
చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్‌వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్‌వాలా బాగ్లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన ‘సైనిక చర్య’తో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్‌లో హైదరాబాద్ కలిసిన ‘సెప్టెంబర్ 17’కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం. అది 1919 ఏప్రిల్ 13. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని నిరసించిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు పెద్దఎత్తున సాగాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలోనే పంజాబీలకు ముఖ్యమైన పండుగ వైశాఖీ సందర్భంగా ఏడెకరాల విస్తీర్ణం గల ఓ తోటలో వేల మంది సమావేశమయ్యారు. బ్రిటిష్ సైన్యంతో అక్కడకు వచ్చిన ఓ అధికారి ప్రవేశ మార్గాలను మూసివేసి, నిరాయుధులైన జనంపై కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్ల కాల్పుల్లో గుళ్లవర్షం కురిపించారు. వెయ్యిమంది మరణించారు. మరో రెండువేలమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ నరమేధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ తోట పేరు జలియన్‌వాలా బాగ్. నిరాయధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన ఆ నరరూప రాక్షసుడే జనరల్ డయ్యర్. పంజాబ్‌కి చెందిన వ్యక్తిగా జలియన్ వాలా బాగ్ ఉదంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ భారత చరిత్రలో గుర్తింపునకు నోచుకోని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నిరంకుశ రాజ్యమైన నాటి హైదరాబాద్ సంస్థానంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పర్చుకున్న నేను నిజాం అరాచకాలూ, రజాకార్ల అకృత్యాల గురించీ తెలుసుకున్న తర్వాత విస్మయం కలిగింది. ఒకింత ఆగ్రహం, ఆవేదనా కలిగాయి. నిజాం రాజ్యంలోని ‘జలియన్ వాలా బాగ్’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్‌పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్‌పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్‌పల్లి పక్క గ్రామం లింగాపూర్ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో బైరాన్ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్‌పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్–జమీన్–జంగల్ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు, వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్‌లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్ వాలాబాగ్ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్ పటేల్ చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. తెలంగాణలో ఈ తరహా దుర్ఘటనలు గుర్తింపునకు నోచుకోకపోవడానికి కారణం సంతుష్టీకరణ రాజకీయాలే. నిజాంను దుష్టుడిగా చూపితే మైనార్టీ వర్గాల సెంటిమెంటు దెబ్బతింటుందన్న నెపంతో ఎందరో యోధుల త్యాగాలు, పరాక్రమాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సెంటి మెంటుతో రాజకీయాలు చేసే టీఆర్ఎస్ కూడా ఎంఐఎంకు తలొగ్గి సెప్టెంబర్ 17ను అప్రధానంగా చూడడం దురదృష్టకరం. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి. తరుణ్ చుగ్ (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్) -
డ్రగ్స్‌కేసు : ఈడి కార్యాలయంలో ముగిసిన తరుణ్ విచారణ
Tharun Appears Before ED In Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులను విచారించిన ఈడీ నేడు హీరో తరుణ్‌ను ప్రశ్నించింది. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై ఆయనను ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. కెల్విన్‌తో సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై ఈడీ విచారించింది. గతంలో 2017లో సైతం తరుణ్ ఎక్సైజ్ విచారణను సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి : 'సెలబ్రిటీల వద్ద డ్రగ్స్ లభించలేదు...కెల్విన్ వాంగ్మూలం సరిపోదు' కాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తెల్చి చెప్పిన సంగతి తెలిసిందే. సినీతారలపై కెల్విన్ ఇచ్చిన కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని, కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఈ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్‌లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ చార్జిషీట్‌ను ఈడీ పరిధిలోకి తీసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. చదవండి : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్చిట్ -
రేపు ఈడీ విచారణకు హాజరు కానున్న హీరో తరుణ్
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్చిట్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్‌లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)క్లీన్చిట్ ఇచ్చింది. 2017లో వాళ్లు ఇచ్చిన గోళ్లు, వెంట్రుకలు, రక్తం నమునాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చి చెప్పింది. 2017 జులైలో పూరి జగన్నాథ్, తరుణ్ నుంచి ఎక్సైజ్‌శాఖ నమూనాలు సేకరించింది. దీనిపై గతేడాది డిసెంబరు 8న ఎఫ్ ఎస్ఎల్ నివేదికలు సమర్పించినట్టు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌తో పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక వివరాలను కోర్టుకు సమర్పించినట్టు ఎక్సైజ్ అధికారులు వివరించారు. -
ఉదయ్‌కిరణ్, తరుణ్‌లతో నన్ను పోల్చకండి : వరుణ్ సందేశ్
Varun Sandesh : హ్యాపీడేస్ చిత్రంతో తొలిసారి తెలుగుతెరకు పరిచయం అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాతో మరో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వరుణ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో వరుణ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనుకున్న సమయంలో బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఆటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్-3 నుంచి బయటకు వచ్చిన అనంతరం వరుణ్ నటించిన తొలి సినిమా ఇందువదన. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న వరుణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరీర్‌ను తరుణ్, ఉదయ్‌కిరణ్‌లతో పోల్చవద్దని తెలిపాడు. నాకు ఉదయ్, తరుణ్ బాగా తెలుసు. ఉదయ్‌కు అలా జరగడం చాలా బాధాకారం. కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కెరీర్‌ను అలా పోల్చి చూడలేం. ఇక నా విషయానికి వస్తే..నేను కోల్పోయినదాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. బిగ్‌బాస్ తర్వాత కొన్ని కథలకు సైన్ చేశా. కానీ కోవిడ్ సహా మరికొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్స్ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇక తర్వాత నేను యూఎస్ వెళ్లి ఐటీ కోర్స్ చేశాను. వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాలనే ఆలోచన కూడా ఉంది అని వరుణ్ వివరించాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన చిత్రంలో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడదులైన మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై ఆకస్తిని కలిగించేలా ఉంది. -
లవర్ బాయ్ తరుణ్ రీఎంట్రీ, ఈ సారి..
తరుణ్..టాలీవుడ్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి లవర్ బాయ్‌గా పేరు పొందాడు. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తొలి సినిమా ‘నువ్వే కావాలి’తో రికార్డులు సృష్టించి టాలీవుడ్ లవర్ బాయ్‌గా విశేష ప్రేక్షకాదరణ పొందాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లోనే 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించిదంటే తరుణ్‌కు ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో అప్పట్లో ఆ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. ఆ తర్వాత నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సూపర్ హిట్ సినిమాలతోతరుణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తరుణ్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంట్ అని నిర్మాతలకు గట్టి నమ్మకం ఉండేది. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాలతో ఈయన కెరీర్ దారుణంగా దిగజారిపోయింది. వరుసగా లవ్ స్టోరీలనే చేస్తూ రావడం తరుణ్‌కు మైనస్‌గా మారింది. వరస ప్లాప్స్ తో కెరీర్ లో వెనుకబడ్డాడు. తొలి ఏడేళ్లలో తరుణ్ నుంచి దాదాపు 14 సినిమాలు వస్తే.. ఆ తర్వాత 14 ఏళ్లలో ఈయన నుంచి 7 సినిమాలు కూడా రాలేదు. తరుణ్ చివరగా 2017లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో తరుణ్ తీవ్ర నిరాశ చెందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల జోలికి వెళ్లలేదు. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ మళ్లీ వెండితెరపై మెరవబోతున్నాడు. నాలుగేళ్ళ అనంతరం తన స్నేహితుడితోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తన ఫ్రెండ్ రాసిన లవ్ స్టోరీ తరుణ్ కు బాగా నచ్చిందట. అంతేకాదు తరుణ్ ఈ సినిమాకు నిర్మాతగా మారనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. ప్రస్తుతం తరుణ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. -
తరుణ్, ప్రియమణి ప్రేమాయణం: పెళ్లి చేసుకోవాలని
చిత్ర పరిశ్రమలో హీరోహీరోయిన్ల మధ్య గాసిప్స్ రావడం సహజమే. కలిసి ఫోటోలకు పోజులిచ్చినా.. అనుకోకుండా ఎక్కడైన తారసపడినా వీరిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలా ఎంతో మంది నటీనటులపై అలాంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేశాయి, చేస్తున్నాయి. అయితే ఒకప్పటి టాలీవుడ్ జోడీపై ఇటీవల ఓ విషయం బయటకొచ్చింది. నవ వసంతం సినిమాలో జంటగా నటించిన హీరో తరుణ్, ప్రియమణి మధ్య ప్రేమాయణం నడిచిందనేదే ఆ వార్త సందేశం. 2005లో ఈ మూవీ షూటింగ్ సందర్భంగా జరిగిన కొన్ని విషయాలను ప్రియమణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తమ కుమారుడిని వివాహం చేసుకోవాలని తరుణ్ తల్లి అడిగినట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది. ‘నవ వసంతం సినిమా షూటింగ్ సమయంలో తరుణ్‌కు నాకు పరిచయం ఏర్పడింది. తను మంచి కోస్టార్. చాలా సహాయంగా ఉంటాడు. అతని ప్రవర్తన చాలా తనకు దగ్గర చేసింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ పరిచయంతోనే చాలా సార్లు లంచ్, డిన్నర్‌కు వెళ్లాం కూడా. సెలబ్రెటీస్‌పై సాధారణంగా వచ్చినట్లే తమపై కూడా ఎన్నో పుకార్లు వచ్చాయి. మేమిద్దం ప్రేమలో ఉన్నట్లు కథలుకథలుగా చర్చించుకునేవారు. ఈ విషయం కాస్తా తరుణ్ ఇంట్లో తెలిసింది. ఓ రోజు షూటింగ్లో తరుణ్ వాళ్ల అమ్మ రోజా రమణి వచ్చి కాసేపు నాతో మాట్లాడారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని నాకు తెలిసిందని, నీకు ఇష్టమైతే తరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని రోజా రమణి కోరారు. ఆమె మాటలు నన్ను ఒక్కసారిగా షాక్కింగ్‌కు గురిచేశాయి’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది. అయితే తరుణ్‌కు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేని, తమని పూర్తిగా అపార్థం చేసుకున్నారని ఆమెతో చెప్పినట్లు వివరించింది. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వార్తలు రావడం సహజమేనని పేర్కొంది. కాగా చాలా కాలంగా వెండితెరకు దూరమైన తరుణ్ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెరపై ఇప్పటికీ మెరుస్తున్న ప్రియమణి 2017లో ముస్తాఫ్ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. వెంకటేశ్ హీరోగా నటిస్తున్న నారప్ప మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. -
బిగ్‌బాస్-4 ఎంట్రీపై తరుణ్ క్లారిటీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్-4లో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆ వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా హీరో తరుణ్ కూడా బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టనున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తాను బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై తరుణ్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను బిగ్‌బాస్‌లో పాల్గొంటానని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన కూడా లేదని తెలిపారు. ఫేక్ న్యూస్ నమ్మవద్దని.. అలాగే ప్రచారం కూడా చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. (బిగ్‌బాస్-4పై ‘స్టార్ మా’ ప్రకటన) ‘అందరికీ నమస్కారం. ఈ కష్ట సమయంలో మీరు అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో, కొన్ని న్యూస్ పేపర్లలో నేను బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నట్టు వస్తున్న వార్తలపై మీకు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలు. నేను ఆ షోలో పాల్గొనడం లేదు.. అలాగే పాల్గొనాలనే ఆసక్తి కూడా నాకు లేదు. ఇవన్నీ కేవలం రుమార్లు. దయచేసి ఫేక్ న్యూస్ నమ్మకండి.. అలాగే వ్యాప్తి చేయకండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మీ అందరి ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు’ అని తరుణ్ పేర్కొన్నారు. కాగా, గత ఏడాది కూడా తరుణ్ బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.(తాత కాబోతున్న విలక్షణ హీరో) -
అయ్యో పాపం.. తరుణ్
మల్కాజిగిరి: కారు యజమాని నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణం తీసింది. అప్పటి వరకు ఉరుకులు..పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉన్న ఆ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు రివర్స్ తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్, ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండలం వదావత్ గ్రామానికి చెందిన రంగప్ప బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని వెంకటసాయి ప్లాజా అపార్ట్మెంట్లో నెల రోజుల క్రితం వాచ్‌మెన్‌గా చేరాడు. ఇతనికి పెద్ద కుమారుడు తరుణ్(5), మరో నెలల బాబు ఉన్నాడు. అదే అపార్ట్మెంట్లో నివాసముంటున్న మనోహర్ అనే వ్యక్తి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం బయట నుంచి వచ్చిన మనోహర్ తన మారుతీ వాగనార్ కారును అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడే ఆడుకుంటున్న తరుణ్‌ను గమనించకపోవడంతో కారు అతని మీద నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన తరుణ్‌ను వెంటనే తల్లిదండ్రులు, అపార్ట్మెంట్ వాసులు మనోహర్ కారులోనే స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకు వెళ్లగా...వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై తరుణ్ తండ్రి ఫిర్యాదు చేయడంతో 304 ఎ ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’
తరుణ్ తేజ్, లావణ్య హీరోహీరోయిన్లుగా రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఉండి పోరాదే'. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నవీన్ నాయని దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగల్ కట్ కూడా లేకుండా యూ/ ఏ సర్టిఫికెట్ పొందింది. సెప్టెంబర్ 6న సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత డా. లింగేశ్వర్ మాట్లాడుతూ - ‘మా ఉండి పోరాదే చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ పొందింది. సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా చూశాం అని.. నన్ను మా టీమ్‌ను అభినందించారు. నేను గతంలో చెప్పినట్టు సినిమా 100పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. లాస్ట్ 20 మినిట్స్ లో మన పక్కన ఉన్నవారిని కూడా మర్చి పోయేలా సినిమా ఉంటుంది. అందరూ థియేటర్ లో సినిమా చూసి పెద్ద సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను’అన్నారు. దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ... ‘ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వర్ గారికి థాంక్స్. సినిమా మేము అనుకున్న దానికన్నా హార్ట్ టచింగ్‌గా వచ్చింది. సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ 100పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 6న మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు. -
కథలో నవరసాలు ఉన్నాయి
‘‘చాలా కాలం తర్వాత కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా. నాకు పక్కాగా యాప్ట్ అయిన సబ్జెక్ట్ ఇది. డైరెక్టర్‌ను అలీ నా దగ్గరకు పంపించాడు. కథ వినగానే ఓకే చేసా. మంచి ఎంటర్టైనర్. కథలో నవరసాలు ఉన్నాయి’’ అని శ్రీకాంత్ అన్నారు. ఆయన హీరోగా శాలు చౌరశియా, మమతా చౌదరి, జెబా అన్సమ్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పెళ్ళంటే...?’. మైను కె.ఎం.డి. దర్శకత్వంలో ఏంజెల్ ప్రొడక్షన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ బ్యానర్లపై అలీ భాయ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో తరుణ్ క్లాప్ ఇవ్వగా, నటుడు రాజేంద్ర కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు.‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా గౌరవ దర్శకత్వం వహించారు. మైను మాట్లాడుతూ– ‘‘పెళ్లి సందడి, పెళ్లాం ఊరెళితే’ చిత్రాల తరహాలో సాగే కథ ఇది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ ఎంటర్ టైనింగ్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి’’ అన్నారు. ‘‘జూన్‌లో రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్తాం. అధిక భాగం బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుగుతుంది’’ అన్నారు అలీ భాయ్. నటుడు అలీ, కథానాయికలు పాల్గొన్నారు. అలీ, రాజేంద్ర కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.కె, సంగీతం: మైను, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఒలీఖాన్. -
మాలో వాళ్లని చూసుకుంటారు – తరుణ్
‘‘చాలా గ్యాప్ తర్వాత ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. క్లీన్ లవ్‌స్టోరీ ఇది. సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. అబ్బాయిలు వాళ్లని నాలో.. అమ్మాయిలు హీరోయిన్లో వాళ్లని చూసుకుంటారు’’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించిన ‘ఇది నా లవ్‌స్టోరీ’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. తరుణ్ మాట్లాడుతూ –‘‘రమేష్, గోపిలకు ఇది తొలి సినిమా అయినా చక్కగా డైరెక్ట్ చేశారు. క్రిస్టోఫర్ జోసెఫ్ అద్భుతమైన విజువల్స్, శ్రీనాథ్ విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఓవియా చక్కగా నటించారు. వీరిందరికీ తెలుగులో ఇది తొలి సినిమా. గోగినేని బాలకృష్ణగారు మా సినిమాని విడుదల చేస్తున్నారు’’ అన్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ లవ్‌స్టోరీ ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారనే కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా ఎవర్నీ నిరుత్సాహపరచదు. అందరికీ నచ్చుతుంది. అడగ్గానే మంచు మనోజ్గారు అతిథి పాత్ర చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు దర్శకులు రమేష్, గోపి. ‘‘ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ బాగా నచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. తరుణ్‌కి మంచి సక్సెస్ రావాలి’’ అన్నారు మంచు మనోజ్. నిర్మాతలు డి.సురేశ్‌బాబు, కె.ఎల్.నారాయణ, చిత్రనిర్మాత ఎస్.వి.ప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ విజయ్, హీరోలు శ్రీకాంత్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి ఫీల్‌తో...
‘నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు తరుణ్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’. రమేష్ గోపి దర్శకత్వంలో అభిరామ్ సమర్పణలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇది. ట్రైలర్, సాంగ్ టీజర్‌కి సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వచ్చింది. యూత్‌తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లీన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఓవియా మా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు’’ అన్నారు రమేష్ గోపి. ‘‘2018 ది బెస్ట్ మూవీస్‌లో ‘ఇది నా లవ్ స్టొరీ’ ఒకటిగా నిలుస్తుంది. ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ఎస్.వి.ప్రకాష్. -
చాలా విరామం తరువాత వస్తున్నా..
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ‘నేను చాలా విరామం తరువాత మంచి కథతో తీసిన సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’ అని యువ కథానాయకుడు తరుణ్ అన్నారు. పి.బి.సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో బుధవారం సాయంత్రం ఆయన సందండి చేశాడు. ఇది నా లవ్ స్టోరీ చిత్రం ప్రమోషన్లో భాగంగా తరుణ్ విద్యార్థులతో ముచ్చటించారు. గతంలో నటించిన ‘నువ్వే నువ్వే’ చిత్రం మాదిరిగానే ఈ చిత్రంలో కూడా కామెడీ, డైలాగ్స్, ఎమోషన్స్ సన్నివేశాలు ఉంటాయని వివరించారు. ఇప్పటికే సినిమా పాటలు విడుదల అయ్యాయని, పాటలు విన్నారా అంటూ విద్యార్థులను అడిగారు. పాటల్లో ఏ పాట బాగా నచ్చిందో చెప్పాలంటూ అడగ్గా ఏ నిమిషంలో నిను చూశానో అనే పాట నచ్చిందంటూ విద్యార్థులు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా చూడదగిన మంచి ప్రేమ కథా చిత్రమని తరుణ్ అన్నారు. డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తరుణ్‌ను కొత్తగా చూస్తారని, సినిమాను చూసే సమయంలో ప్రతి విద్యార్థి తనను తాను ఈ సినిమాలో చూసుకుంటారని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‡ శ్రీనాథ్ విజయ్, కెమెరామెన్ కిస్టోఫర్, పీఆర్ఓ సతీష్ పాల్గొన్నారు. తరుణ్‌తో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. -
వేలంటైన్స్ డేకి ప్రేమకథ
‘‘నాగార్జునగారు ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమా టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. టీజర్ పెద్ద హిట్ అయింది. నా పుట్టినరోజున (08.01.) ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేష్–గోపీ దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించిన చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఇది రెగ్యులర్ ప్రేమకథ కాదు. ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తా. ట్రిపుల్ రోల్ చేశానా? మూడు షేడ్స్ ఉన్న పాత్ర చేశానా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. రమేష్–గోపీ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి, నువ్వే నువ్వే’ సినిమాలకంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. లవర్స్‌కు మంచి ట్రీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 14న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ఎస్.వి.ప్రకాష్. సంగీత దర్శకుడు శ్రీనాథ్ విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జగదీశ్.ఎస్, అరుణ్ అజాద్, కో–ప్రొడ్యూసర్: ఎ.గణేశ్. -
మూసీలో గల్లంతైన బాలుడి శవం లభ్యం
-
మూసీలో గల్లంతైన బాలుడి శవం లభ్యం
హైదరాబాద్: గోల్నాక వద్ద మూసీనదిలో గల్లంతైన తరుణ్ మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. మూసీ నదిలో తరుణ్(7) అనే బాలుడు ఆదివారం గల్లంతయ్యాడు. శంకర్ నగర్ బస్తీ మూసి నదికి పక్కనే ఉండటంతో అక్కడే తన ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లిన తరుణ్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. బంతికోసం వెళ్లిన బాలుడు దానిని తీసే క్రమంలో కాలు జారీ అందులో పడి కొట్టుకుపోయాడని అతడి తల్లి వాపోయింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఇంజినీరింగ్ విద్యార్థి తరుణ్‌కు కన్నీటి వీడ్కోలు
పిడపర్తిపాలెం (కొల్లిపర): హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జి డ్యామ్ దుర్ఘటనలో చనిపోయిన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో ఒకరైన పెనుమాక వెంకటదుర్గాతరుణ్ మృతదేహనికి శుక్రవారం పిడపర్తిపాలెంలో అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. ఈనెల 18న ప్రమాదస్థలిలో దొరికిన తరుణ్ మృతదేహాన్ని గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన తరలించిన విషయం విదితమే. వెంకటదుర్గాతరుణ్ మృతదేహం గ్రామానికి చేరుకుంటుందన్న విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో గ్రామానికి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ఇంజినీర్‌గా ప్రయోజకుడై వస్తాడనుకున్న కుమారుడు ఇంటికి శవమై రావడంతో ఇలాంటి పరిస్థితి పగవారికైనా రాకూడదంటూ తరుణ్ తల్లిదండ్రులు సుబ్బారావు, జయలక్ష్మి(బుజ్జి) రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. డ్యామ్‌లో అంచెలంచెలుగా విడుదల చేయాల్సిన నీటని నిబంధనలకు విరుద్ధంగా ఒక్కసారిగా 400 టీఎంసీల నీటిని విడుదల చేయడం వల్లే విద్యార్థులు అధిక సంఖ్యలో మృత్యువాత పడ్డారని తరుణ్ తండ్రి సుబ్బారావు అన్నారు. ఇది కచ్చితంగా అధికారుల తప్పిదమేనన్నారు. తరుణ్ మృతదేహానికి మండల తహశీల్దార్ కె.సాయిప్రసాద్, సర్పంచ్ బొల్లు కృష్ణప్రియ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ చిక్కాల రాజేంద్ర, పలువురు గ్రామపెద్దలు నివాళులర్పించారు.