
సాక్షి, ఢిల్లీ: ఫామ్ హౌస్ వీడియోలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే వీడియోలపై ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు. ఇప్పటికే బండి సంజయ్ ఆలయంలో ప్రమాణం చేశారన్నారు. ఈ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
‘‘మునుగోడులో అధికారం దుర్వినియోగం చేసింది. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వరుకు మంత్రులు అక్కడే ఉన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారు. నిజ నిజాలేంటో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు’’ అని తరుణ్ చుగ్ అన్నారు.
కేసీఆర్‌కు తన ఎమ్మెల్యేలపై ఎందుకు విశ్వాసం లేదు అంటూ ఆయన ప్రశ్నించారు. మీ దగ్గర అమ్ముడుపోయే ఎమ్మెల్యేలే ఉన్నారా?. సీఎం కేసీఆర్ సినిమా కట్టుకథలు వినిపిస్తున్నారు. సెవెన్ స్టార్ ఫాంహౌస్‌లో కూర్చుని కథలు రచిస్తున్నారు. ముగ్గురు బ్రోకర్లలో ఎవరితోనూ తమకు సంబంధాలు లేవన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ప్రజలు చరమగీతం పాడతారని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు.
చదవండి: పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది?
Comments
Please login to add a commentAdd a comment