కథలో నవరసాలు ఉన్నాయి | Hero Srikanth Pellante Movie Opening | Sakshi
Sakshi News home page

కథలో నవరసాలు ఉన్నాయి

Published Mon, May 21 2018 1:09 AM | Last Updated on Mon, May 21 2018 1:10 AM

Hero Srikanth Pellante Movie Opening  - Sakshi

శ్రీకాంత్‌, తరుణ్‌

‘‘చాలా కాలం తర్వాత కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా. నాకు పక్కాగా యాప్ట్‌ అయిన సబ్జెక్ట్‌ ఇది. డైరెక్టర్‌ను అలీ నా దగ్గరకు పంపించాడు. కథ వినగానే ఓకే చేసా. మంచి ఎంటర్‌టైనర్‌. కథలో నవరసాలు ఉన్నాయి’’ అని శ్రీకాంత్‌ అన్నారు. ఆయన హీరోగా శాలు చౌరశియా, మమతా చౌదరి, జెబా అన్సమ్‌ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పెళ్ళంటే...?’. మైను కె.ఎం.డి. దర్శకత్వంలో ఏంజెల్‌ ప్రొడక్షన్స్, మదర్‌ అండ్‌ ఫాదర్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై అలీ భాయ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి హీరో తరుణ్‌ క్లాప్‌ ఇవ్వగా, నటుడు రాజేంద్ర కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా గౌరవ దర్శకత్వం వహించారు. మైను మాట్లాడుతూ– ‘‘పెళ్లి సందడి, పెళ్లాం ఊరెళితే’ చిత్రాల తరహాలో సాగే కథ ఇది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ ఎంటర్‌ టైనింగ్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి’’ అన్నారు. ‘‘జూన్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్తాం. అధిక భాగం బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుగుతుంది’’ అన్నారు అలీ భాయ్‌. నటుడు అలీ, కథానాయికలు పాల్గొన్నారు. అలీ, రాజేంద్ర కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.కె, సంగీతం: మైను, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఒలీఖాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement