new movie opening
-
శివాజీ తాజా చిత్రం ‘దండోరా’ ప్రారంభం (ఫొటోలు)
-
అర్జునుడి గీతోపదేశంలో...
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమాకు ‘అర్జునుడి గీతోపదేశం’ టైటిల్‌ను ఖరారు చేశారు. అఖిల్ రాజ్, దివిజా ప్రభాకర్, రాజీవ్, ఆదిత్యా శశికుమార్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాతో సతీష్ గోగాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిలోక్‌నాథ్. కె, ప్రదీప్ రెడ్డి .వి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి మల్లాల సీతారామరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, కె. అమ్మిరాజు క్లాప్ ఇచ్చారు. లక్కంశెట్టి వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సతీష్ గోగాడ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. మొదటి షెడ్యూల్‌ను మార్చి 20న అమలాపురంలో మొదలుపెడుతున్నాం. ఆ తర్వాత వైజాగ్, హైదరాబాద్, చెన్నై లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. రాజీవ్, దివిజ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్. -
నార్నే నితిన్ కొత్త సినిమా షురూ
హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు మారుతి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ‘‘జీఏ 2 బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్కేఎన్, కెమెరా: సమీర్ కళ్యాణ్, సంగీతం: రామ్ మిర్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: భానుప్రతాప్, రియాజ్ చౌదరి, అజయ్ గద్దె. -
తొలి అడుగు
భద్ర, పద్మాకర్ రావ్ హీరోలుగా, నేహా, అంజలి హీరోయిన్లుగా ఉప్పలపాటి శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మిస్పా మూవీ మీడియాపై పద్మాకర్రావ్ చిన్నతోట, ఆర్.సువర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం కడపలో ప్రారంభమైంది. పద్మాకర్రావ్ చిన్నతోట మాట్లాడుతూ–‘‘పదహారేళ్లుగా మీడియా రంగంలో రాణిస్తున్న మా మిస్పా మూవీ మీడియా సంస్థ నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
కృత్రిమ మేధస్సుతో...
శ్రవణ్ రెడ్డి, రియా కపూర్ జంటగా వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వంలో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. దేవాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్యామ్ దేవభక్తుని నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సుహాస్ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు అజయ్ ఘోష్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత కిరణ్ స్క్రిప్ట్ అందించగా, వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వం వహించారు. ‘‘కృత్రిమ మేధస్సు నేపథ్యంలో భారతదేశపు మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులోని ప్రధాన సన్నివేశాలను వర్చ్యువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్, కెమెరా: అఖిల్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్ గోపరాజు. వీరు, శ్రీహర్ష హీరోలుగా, కుషీచౌహాన్, నిషా సింగ్ హీరోయిన్లుగా తోట కృష్ణ దర్శకత్వంలో ‘చండిక’ సినిమా ఆరంభమైంది. కేవీ పాపారావు నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. ‘‘హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు తోట కృష్ణ. ‘‘చండిక’కి నేనే కథ అందించాను’’ అన్నారు కేవీ పాపారావు. -
NBK 109 Launch : గ్రాండ్‌గా బాలయ్య కొత్త సినిమా షురూ (ఫొటోలు)
-
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
తండ్రీకూతుళ్ల అనుబంధం
హీరో నాని కొత్త సంవత్సరం కొత్త సినిమా కబురు చెప్పారు. నాని హీరోగా శౌర్యువ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, వైర ఎంటర్టైన్మెంట్ పతాకంపై చెరుకూరి వెంకట మోహన్, డా.విజయేందర్‌రెడ్డి, మూర్తి కలగర ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్. న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ప్రకటించి, నాని వాయిస్ ఓవర్‌తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నాని కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరకర్త. ఈ సినిమాకు కెమెరా: సాను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఈవీవీ సతీష్. -
కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం!
కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా అంజీ రామ్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్‌పై దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి ప్రముఖ గాయకుడు మనో కెమెరా స్విచ్చాన్ చేయగా, దండమూడి అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టారు. హీరో ఆకాష్ పూరి గౌరవ దర్శకత్వం వహించగా, పాటల రచయిత భాస్కరభట్ల స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ– ‘ఈ సినిమాను హైదరాబాద్, బ్యాంకాక్, పుకెట్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరించటానికి సన్నాహాలు చేశాం. 35-40 రోజుల్లో మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాలనేది మా ప్లాన్. అందరూ మా యూనిట్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం’ అన్నారు. ‘‘సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి. ‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల ఆధారంగా రాసుకున్న కథ ఇది’’ అన్నారు అంజీ రామ్. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సంగీతం: అనుదీప్ దేవ్. -
కార్తీ కొత్త మూవీ జపాన్.. పూజా కార్యక్రమాలు ప్రారంభం (ఫొటోలు)
-
తండ్రి, కొడుకుల మధ్య ఎమెషనల్ స్టోరీ.. సినిమాకు శ్రీకారం
Karthik Rathnam Hrithika Srinivas Movie: బెక్కం మాధవి, బెక్కం ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ బ్యానర్ పై కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. కార్తిక్ రత్నం, హ్రితిక శ్రీనివాస్, పృథ్వీ (పెళ్లి సినిమా ఫేమ్), కాలకేయ ప్రభాకర్, మహేంద్రనాద్, సిఎంఆర్. శర్మ, కాళిచరణ్ సంజయ్ నటీ నటులుగా అరుణ్ కొత్తపల్లి దర్శకుడుగా పరిచయమవుతున్నారు. బెక్కం రవీందర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-1 సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం (జులై 10) ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టార్ మేకర్ సత్యానంద్.. చిత్ర హీరో, హీరోయిన్స్ పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మహేందర్ చక్రవర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు అరుణ్ కొత్తపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. పూజ కార్యక్రమాల అనంతరం చిత్ర నిర్మాత బెక్కం రవీందర్ మాట్లాడుతూ.. 'స్టార్ మేకర్ సత్యానంద్ ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. చిత్ర దర్శకుడు కొత్తవారైనా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఫాదర్, సన్ ల మధ్య జరిగే ఏమోషనల్, క్రైమ్ కామెడీ స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈ రోజు నుంచి పది రోజులు వైజాగ్ లోని పలు అందమైన లొకేషన్స్ లలో షూటింగ్ నిర్వహిస్తాం. ఆ తరువాత జరిగే రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేస్తాం. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ మా సినిమాకు చాలా చక్కగా కుదిరారు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని తెలిపారు. -
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న వీడియో
PVT04 Shooting Started Announcement Video Released: పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వైష్ణవ్ 'రంగరంగ వైభవంగా' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా నేడు జూన్ (22) ఉదయం 11.16 నిమిషాలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అతిరథుల మధ్య వైభవంగా ముహూర్తం జరుపుకుంది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కల్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. హీరో సాయిధర్మ తే జ్ క్లాప్ ఇవ్వగా,దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు. చిత్రం ముహూర్తం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇందులో "రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా..." అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరిక గా అంటే.. "ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా..!" అంటూ కథానాయకుడు మరింత గా హెచ్చరించడం చూడొచ్చు. పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది. ఈ మూవీని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ #PVT04 ~ #ProductionNo16 begins with a pooja ceremony today✨ Shoot begins soon! 🎬🎥 ▶ https://t.co/h0m5jrbdl4 Directed by #SrikanthNReddy Produced by @vamsi84 & #SaiSoujanya#PanjaVaisshnavTej @sreeleela14 @SitharaEnts @Fortune4Cinemas Sankranthi 2023 Release ⚡ pic.twitter.com/UxGDdh35Wm — Sithara Entertainments (@SitharaEnts) June 22, 2022 -
ఆ రాత్రి ఏం జరిగింది?
‘బాహుబలి’ ప్రభాకర్, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో పాలిక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి నిర్మాత ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ క్లాప్ కొట్టారు. ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ – ‘‘రిటైర్డ్ మిలటరీ మేజర్ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. సినిమాకు కీలకమైన పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాం’’ అన్నారు రావుల రమేష్. పాలిక్ మాట్లాడుతూ – ‘‘నా శిష్యురాలు వింధ్య రెడ్డి ఈ చిత్రకథ ఇచ్చారు’’ అన్నారు. వింధ్య రెడ్డి, సంగీత దర్శకుడు జాన్ భూషణ్ మాట్లాడారు. -
పొలిటికల్ థ్రిల్లర్‌గా కొత్త చిత్రం.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం
చెన్నై సినిమా: రాజకీయ నేపథ్యంలో మరో థ్రిల్లర్ రూపొందుతోంది. నటులు ప్రాజన్, అజిత్ నాయక్ హీరోలుగా నటిస్తున్న ఇందులో నటి ప్రఖ్యా నయన్, రష్మీ నాయికలుగా నటించనున్నారు. శ్రీకృష్ణ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. సూర్యకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్, కెన్నడీ ద్వయం కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రం ఆదివారం ధర్మపురిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు వినోద్‌కుమార్ ఛాయాగ్రహణం, విజయ్ యాట్లీ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. దుర్మార్గులైన రాజకీయ నాయకుల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను కొత్తకోణంలో చూపించబోతున్నట్లు చెప్పారు. షూటింగ్ ధర్మపురి, కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
స్నేహం నేపథ్యంలో 'కార్టూన్స్ 90టీస్ కిడ్స్ బె ఈడ' చిత్రం
త్రిగున్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందుతున్న చిత్రం 'కార్టూన్స్ 90టీస్ కిడ్స్ బె ఈడ'. సాయితేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై తీసిన తొలి సీన్‌కి హీరో ఆకాశ్ పూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో సిద్ధు జొన్నలగడ్డ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. 'ఢీ’లో డ్యాన్సర్‌గా, కంటెస్టెంట్‌గా, కొరియోగ్రాఫర్‌గా చేశాను. స్నేహం నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. 1990 దశకంలో పుట్టినవారి అనుభవాలు కూడా ఉంటాయి' అన్నారు సాయితేజ సప్పన్న. 'ఇది కామెడీ డ్రామా మూవీ' అన్నారు శ్రీకాంత్ దీపాల. -
మహేశ్-త్రివిక్రమ్ కాంబో రిపీట్.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం
Mahesh Babu Trivikram Srinivas Combo Movie Has Been Started: మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు' ఎంతపెద్ద హిట్ సొంతం చేసుకుందో తెలిసిందే. తర్వాత వచ్చిన 'ఖలేజా' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి మూవీ రానుందంటే ఆడియెన్స్‌లో కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి తప్ప సెట్స్‌పైకి వెళ్లింది మాత్రం లేదు. అయితే ఎట్టకేలకు మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు గురువారం (ఫిబ్రవరి 3) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ పూజాకార్యక్రమాలకు మహేశ్ బాబు హాజరు కాలేదు. మహేశ్ భార్య నమ్రత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా హారికా అండ్ క్రియేషన్స్‌లో వస్తున్న ఏడో మూవీ కాగా హీరోగా మహేశ్ బాబుకు 28వ సినిమా. ఇదిలా ఉంటే ఈ సినిమా అతడుకు సీక్వెల్‌గా పుకార్లు వినిపిస్తున్నాయి. 2005లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ 'అతడు' సినిమాకు కొనసాగింపుగా తీయాలని తివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి 'పార్థు' అని టైటిల్ పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఇందులో నిజమెంతుందో వేచి చూడాలి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సమంత మరో పాన్ ఇండియా చిత్రం టైటిల్ ఇదే, డైరెక్టర్లు ఎవరంటే..
Samantha New Pan India Movie Shooting Starts And Title Announced: విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో డజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో తన ఇంటర్నేషన్ ఫిలిం ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ కూడా ఉంది. ఈ సినిమాతోనే సామ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే సమంత ఇటీవల శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మానస్ బండారం బయట పెట్టిన అరియాన, కన్నీళ్లు పెట్టుకున్న పింకీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కబోతోన్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం(డిసెంబర్ 6) పూజ కార్యక్రమాలను జరుపుకున్న ఈ మూవీ టైటిల్‌ను యశోదగా ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే మొదలపెట్టనున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త డైరెక్షర్లు హరి, హరీశ్‌లు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ థ్రిల్లర్ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని మిగతా తారాగణాన్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. చదవండి: దోమకొండ గడికోటలో ఘనంగా ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, మెగా ఫ్యామిలీ సందడి ఈ మేరకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని చెప్పారు. With your blessings 🙏 @SrideviMovieOff @krishnasivalenk @hareeshnarayan @dirharishankar #Yashoda#YashodaTheMovie pic.twitter.com/OjogcgDvQm — Samantha (@Samanthaprabhu2) December 6, 2021 -
కొత్త సినిమా షూటింగ్లో చిరంజీవి
చిరంజీవి ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. ‘ఆచార్య’, ‘బోళాశంకర్’ సినిమాల షూటింగ్లో పాల్గొంటున్న ఆయన తాజాగా కొత్త సినిమా చిత్రీకరణలో గురువారం జాయిన్ అయ్యారు. ఈ సినిమాకు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్స్‌లో చిరంజీవికి సీన్ వివరిస్తున్న ఓ ఫొటోను బాబీ షేర్ చేసి, ‘‘చిరంజీవి అన్నయ్య తొలిరోజు షూటింగ్లో మాతో జాయిన్ అయ్యారు. కొంచెం నెర్వస్‌గా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రయాణానికి గొప్ప ఆరంభం ఇది’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఏ విల్సన్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, సహ నిర్మాత: జీకే మోహన్, సీఈఓ: చెర్రీ. -
రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం కొండా ప్రారంభం
-
'ఆటో రజని' మూవీ ప్రారంభం, క్లాప్ కొట్టిన ఎంపీ నందిగం సురేష్
-
ఆది కొత్త సినిమా షురూ
-
రౌడీ బేబీ కామెడీ
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటì స్తున్న చిత్రం ‘రౌడీ బేబీ’. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సహ నిర్మాత జీవీ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎంవీవీ సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మరగాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్‌రాజ్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కామెడీ చిత్రాలతో స్టార్ రైటర్‌గా ఎదిగాను. అదే కామెడీని బేస్ చేసుకుని ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యాం’’ అన్నారు కోన వెంకట్. ‘‘రెగ్యులర్ షూటింగ్‌ని బుధవారమే ప్రారంభించాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: చౌరస్తా రామ్. -
సస్పెన్స్ థ్రిల్లర్
తేజేశ్వర రెడ్డి, సిద్ధార్థ, భరత్ సాగర్ హీరోలుగా ప్రియాన్ష, అనోన్య హీరోయిన్లుగా మాస్టర్ కుశాల్ రెడ్డి కీలక పాత్రలో నటించనున్న చిత్రం ‘భిక్ష’. ‘మహానగరంలో శివచందు’, ‘సాయే దైవం’, ‘2 ఫ్రెండ్స్’, ‘స్నేహవే ప్రీతి (కన్నడ)’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన జిఎల్బి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జిఎల్బి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మా చిత్రాన్ని ప్రారంభించాం. సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, హైదరాబాద్, కరీంనగర్, కంఠాత్మకూర్, హంపీ, విజయవాడ, వైజాగ్‌లలో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్ర రెడ్డి, సంగీతం: శ్రీపాల్, సహ నిర్మాత: తీగుళ్ళ స్వప్నకిరణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భిక్షపతి గౌడ్ వడ్డేపల్లి. -
ఫైట్‌తో షురూ
‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా సోమవారం మొదలైంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్‌తో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటినుండి ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ‘సామజవరగమన....’ అంటూ ఫుల్ జోష్‌లో ఉన్న ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. -
షూటింగ్ షురూ
బాక్సింగ్‌కు సంబంధించిన శిక్షణ పూర్తయింది. దాన్ని స్క్రీన్ మీద చూపించడానికి రెడీ అయ్యారు వరుణ్ తేజ్. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం సోమవారం సెట్స్ మీదకు వెళ్లింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధూ ముద్ద నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వైజాగ్‌లో ప్రారంభం అయింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించబోతున్నారని టాక్. జూలై 30న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
సరికొత్త కోణానికి నాంది
‘అల్లరి నరేష్ నూతన చిత్రం ‘నాంది’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా, దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాతగా పరిచయమవుతున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్‌నివ్వగా, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ‘అల్లరి’ నరేష్ మాట్లాడుతూ – ‘‘క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. అందరూ కొత్తవారితో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన నరేష్‌గారికి, సతీష్‌గారికి థ్యాంక్స్. క్రైమ్ థ్రిల్లర్‌లో సాగే కథ అయినప్పటికీ ఓ సామాజిక అంశాన్ని కూడా చర్చిస్తున్నాం’’ అన్నారు విజయ్ కనకమేడల. ‘‘ఈ నెల 22నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. మార్చిలో షూటింగ్ పూర్తి చేసి, వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘నరేష్‌గారిలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి. ఈ సినిమాకు కథ: వెంకట్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సిద్. -
రవితేజ కొత్త చిత్రం ప్రారంభం
-
థ్రిల్లింగ్ రెడ్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘రామ్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సూపర్‌హిట్ అందించిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్. మా బ్యానర్లో రామ్ ఇప్పటివరకు చాలామంచి సినిమాలు చేశారు. ‘రెడ్’ కూడా మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నాను. నవంబర్ 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారం భిస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ సినిమా సోల్‌ను తీసుకుని, అందులో మార్చులు చేసి ‘రెడ్’ సినిమాను తెరకెక్కిస్తాం’’ అన్నారు. ‘‘కెరీర్లో తొలిసారి థ్రిల్లర్ జానర్లో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని రామ్ అన్నారు. ‘‘రామ్‌తో మూడోసారి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్రిల్లర్‌కు వాణిజ్య పరమైన అంశాలు జోడించి కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మణిశర్మగారు మా సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు కిశోర్ తిరుముల. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, రామ్ ఆచంట, కృష్ణ పోతినేని పాల్గొన్నారు. -
అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రారంభం
-
నూటొక్క జిల్లాలకే అందగాడు
ఒక వ్యక్తి బాగా అందంగా ఉంటే నూటొక్క జిల్లాల అందగాడు అని సంబోధిస్తారు. అప్పట్లో నూతన్ ప్రసాద్‌ని అలా పిలిచేవారు. ఇప్పుడు తాజా సినిమా కోసం అవసరాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడిగా మారనున్నారు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కనున్న చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, దర్శకుడు క్రిష్ సంయుక్తంగా ఈ సినిమాను సమర్పించడం విశేషం. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. సాగర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ చిత్రానికి రచయిత: అవసరాల శ్రీనివాస్, సంగీతం: స్వీకార్ అగస్తీ. -
పంచ్ పడుద్ది
ఈ ఏడాది ‘ఎఫ్ 2, గద్దలకొండ గణేష్’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి గురువారం కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు నాగబాబు క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటిలకు స్క్రిప్ట్‌ను అందించారు. కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. వరుణ్‌గారు కథ వినగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ మూవీ కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుని చాలా మేకోవర్ అయ్యారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: తమన్.ఎస్. -
చిరు152షురూ
‘ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ ఇచ్చారు. ‘‘ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాం. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, హీరో రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, చిరంజీవి కుమార్తె సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తిరు. -
నా జీవితంలో ఇదొక మార్పు
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వీవీ వినాయక్ ‘సీనయ్య’ చిత్రంతో తొలిసారి హీరోగా మారారు. నరసింహ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆది’ సినిమాతో వినయ్(వినాయక్)తో నా ప్రయాణం మొదలైంది. మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమా వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ చేశాం. ఈ సినిమా పేరే మా ఇంటిపేరుగా మార్చేంత హిట్ సాధించింది. 1982–1984 నేపథ్యంలో సాగే కంప్లీట్ ఎమోషనల్ స్టోరీ ‘సీనయ్య’. ఈ సినిమాలో ఎవర్ని హీరోగా అడుగుదామా? అనుకుంటున్న తరుణంలో మా సంస్థలో సినిమాలు చేసిన దర్శకులు గుర్తుకువచ్చారు. ఈ కథకు వినయ్ అయితే సరిపోతాడనిపించి నరసింహతో చెప్పగానే ఎగై్జటింగ్‌గా ఫీలయ్యాడు. ఆ తర్వాత వినయ్‌కు కథ చెప్పడంతో నటిస్తా అన్నాడు. ఈ కథలో భాగమైన హరిని భవిష్యత్‌లో దర్శకుడిగా పరిచయం చేస్తా. వచ్చే ఏడాది వేసవిలో ‘సీనయ్య’ విడుదల చేస్తాం’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘రాజుగారు ఓ రోజు వచ్చి...‘నువ్వు నన్ను ‘దిల్’ రాజుని చేశావ్. నేను నిన్ను హీరోని చేద్దాం అనుకుంటున్నా’ అన్నారు. నరసింహ చెప్పిన కథ నచ్చి, పాత్ర కోసం బరువు తగ్గాను. ఇప్పుడు ఎలాంటి దుస్తులైనా వేసుకోగలుగుతున్నా (నవ్వుతూ). జీవితంలో నాకు ఇదొక మార్పు’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్ కథ ఇది’’ అన్నారు నరసింహ. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సి.కల్యాణ్, డీవీవీ దానయ్య, అనిల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ, రచయిత హరి పాల్గొన్నారు. -
చిరంజీవి 152వ సినిమా ప్రారంభం
-
పల్లెల్ని ఎవరు పట్టించుకుంటారు?
‘‘నా పల్లె గొప్పది. నా పల్లె పాట ఇంకా గొప్పది. పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. అందరూ పట్టణాలకొస్తే పల్లెల బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? అని ప్రశ్నించే కథ, కథనాలతో మా సినిమా రూపొందనుంది’’ అని జె.ఎల్. శ్రీనివాస్ అన్నారు. ‘స్వాతిముత్యం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించిన జె.ఎల్. శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందించనున్నారు. సుగుణమ్మ రామిరెడ్డి సమర్పణలో లక్ష్మి శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై ఝాన్సీరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ సమక్షంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జె.ఎల్.శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘పల్లె సంస్కృతి గొప్పదనం చాటి చెప్పే చిత్రమిది. కోనసీమ, అరకుతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నాం’’ అన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
శివ కంఠమనేని హీరోగా నటించనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో నందితా శ్వేతా కథానాయికగా నటిస్తున్నారు. రాశీ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించనున్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర రావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మిస్తున్నారు. శివ, నందితా శ్వేత, రాశీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వాసవి గ్రూప్ విజయ్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నటుడు, నిర్మాత అశోక్‌కుమార్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సి. కల్యాణ్, నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణ మురళి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రమిది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. నాలుగు పాటలను రికార్డ్ కూడా చేశాం’’ అన్నారు. ‘‘చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. ఈ సినిమా కథ నచ్చి చేస్తున్నాను’’ అన్నారు రాశి. ‘‘ఈ సినిమాలో రాశికి అమ్మగా, నందితా శ్వేతకు అమ్మమ్మలా నటిస్తున్నాను’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఇందులో నా పేరు లక్కీ. టెర్రర్ గాళ్‌గా కనిపిస్తాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. ఆ తర్వాత కన్నడ పరిశ్రమకు వెళ్లి అక్కడ ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. ఓ మంచి పాయింట్‌తో తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు సంజీవ్. ‘‘అశ్లీలత, అసభ్యతలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చేసేలా సినిమా తీస్తున్నాం’’ అన్నారు ఆర్. వెంకటేశ్వరరావు. ‘‘కథ నచ్చి నిర్మించాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాంబాబు. సంగీత దర్శకుడు సుధాకర్ మరియో, మాటల రచయిత అంజన్ మాట్లాడారు. -
కొత్త ప్రయాణం
‘బొమ్మరిల్లు, పరుగు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్. ఆయన దర్శకత్వంలో అఖిల్ హీరోగా కొత్త చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, వాసూ వర్మలు నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. అల్లు అరవింద్ మనవరాలు బేబి అన్విత క్లాప్ కొట్టగా, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో స్టార్ట్ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్ భార్య నిర్మల, చిరంజీవి సతీమణి సురేఖ, అక్కినేని అమల, దర్శకులు శ్రీకాంత్ అడ్డాల, మారుతి, పరశురామ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. మణికందన్, సంగీతం: గోపీ సుందర్. -
అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం
-
నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభం
-
అంతకు మించి...
గోపీచంద్ హీరోగా, భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ‘సాహసం’ చిత్రం ఘనవిజయం సాధించింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తోంది. ఇప్పుడు మరోసారి గోపీచంద్–బీవీఎస్.ఎన్. ప్రసాద్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ఓ సినిమా ఆరంభమైంది. సంతోష్ శివన్, ‘జయం’ రాజాల వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బీవీఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సాహసం’ తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. బిను సుబ్రమణ్యం చెప్పిన కథ చాలా బాగుంది. ‘సాహసం’ చిత్రం ట్రెజర్ హంటింగ్ పాయింట్ మీద ఎంత అడ్వెంచరస్‌గా ఉంటుందో.. ఈ సినిమా దాన్ని మించి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. రాజీపడకుండా ఈ చిత్రం నిర్మిస్తాం. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సతీష్.కె ఛాయాగ్రాహకుడు. -
వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘‘దాడి’’ షూటింగ్ ప్రారంభం
-
మళ్లీ ఫిదా చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ!
క్లాస్ సినిమాలను తీస్తూ.. ప్రతీ ఫ్రేమ్‌లో ఆయన మార్క్‌ను కనపడేలా చిత్రాన్ని తెరకెక్కించడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. గతేడాది ఫిదాతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల ఇంతవరకు మరో ప్రాజెక్టును చేపట్టలేదు. అయితే రీసెంట్గా తన కొత్త మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్దమవుతున్నాడు. మళ్లీ కొత్తవారితో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్న శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలిలో ఓ మంచి ప్రేమకథా చిత్రంగా మలచబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది. -
ఇప్పుడు తమిళంలో...
ప్రస్తుతం మల్టీస్టారర్ మోడ్‌లో ఉన్నట్లున్నారు నాగార్జున. ఆల్రెడీ తెలుగులో మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’లో నటిస్తున్నారు. ఇందులో నాని మరో హీరో. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే మల్టీస్టారర్ మూవీలో చేస్తున్నారు. నాగార్జునకు ఇందులో అమితాబ్, రణ్‌బీర్ కపూర్ కో–స్టార్స్. ఇప్పుడు తమిళంలో ధనుష్‌తో కలిసి నాగార్జున నటించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్ర మాలు జరిగాయి. ఇందులో నటించడంతో పాటు ధనుష్ దర్శకత్వం కూడా వహిస్తుండటం విశేషం. ‘పవర్ పాండీ’ సినిమా తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న సెకండ్ సినిమా ఇది. ఈ చిత్రాన్ని తేనాండాళ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
'బుర్ర కథ' సినిమా ప్రారంభోత్సవం
-
కొత్త జంట
‘సమ్మోహనం’ సినిమాతో నటనలో మరో మెట్టు పైకి ఎక్కారు సుధీర్‌బాబు. వచ్చే నెల ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఈ ఏడాది మళ్లీ థియేటర్లోకి రానున్నారాయన. మరి.. ఇప్పుడేం చేస్తున్నారు అంటే కొత్త సినిమాకు రేపు కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో మెహారీన్ కథానాయికగా నటిస్తారు. రిజ్వాన్ నిర్మించనున్నారు. పులి వాసు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం జరగనుంది. నిర్మాత ‘దిల్’రాజు, దర్శకుడు వీవీ వినాయక్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ఖుర్షీద్ సహ నిర్మాత. ఇలా మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మస్త్ బిజీగా ఉంటున్నారు హీరో సుధీర్‌బాబు. -
‘వీడు అసాధ్యుడు’ షూటింగ్ ప్రారంభం
కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసెజ్ సినిమా అంటే ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిన ఓ కొత్త సినిమా గురువారం ప్రారంభమైంది. ఫిలింనగర్లో మొదలైన సినిమాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా హాజరయ్యారు. ‘వీడు అసాధ్యుడు’ సినిమాతో మరో కొత్త హీరో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ముహుర్తపు సన్నివేశానికి శివాజీ రాజా క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ‘ఒక కమర్షియల్ అంశానికి సోషల్ మెజేస్ జోడించి రూపొందిస్తోన్నాం. ఇందులో లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. హీరో అడ్వకేట్ గా నటించారు. హీరోయిన్ ఒక ఎన్నారై పాత్రలో నటిస్తోంది. వీరిద్దరికీ ఎలా పరిచయం అయింది. ఆ పరిచయం ఎలాంటి మలుపులకు దారి తీసిందనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుకుంటోన్న చిత్రమ’ని దర్శకుడు పియస్ నారాయణ తెలిపారు. తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని హీరో కృష్ణ సాయి కోరారు. ఈ సినిమాలో జహీదా శామ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని ఎమ్మెస్కే రాజు నిర్మించగా, శంభు ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. -
ఇది నా బయోపిక్
శివగణేశ్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్ జివి రెడ్డి, నాగేంద్ర వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా బయోపిక్’. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. విశ్వ కథానాయకునిగా పరిచయం అవుతున్నారు. నిఖితా పవర్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్ఎస్ నాయకులు మెట్ట సూర్యప్రకాశ్ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు జీవా క్లాప్ ఇచ్చారు. అనంతరం శివగణేశ్ మాట్లాడుతూ – ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కథా కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. దర్శకునిగా ఇది నా మూడో చిత్రం. గతంలో నేను ‘33 ప్రేమ కథలు’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాను.నా రెండో చిత్రం ‘సకల కళా వల్లభుడు’ రిలీజుకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. విశ్వ మాట్లాడుతూ – ‘‘హీరోగా నాకిది మొదటి సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. రవిచంద్ర ఈమండి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు శివగణేశ్ కథ చెబుతున్నంత సేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఫీలయ్యాను. జూలై 26న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీతదర్శకుడు అజయ్ పట్నాయక్, నటుడు జబర్దస్త్ మురళీ, హీరోయిన్ నిఖితా పవర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫారిన్లో ప్రేమ మొదలు
కొత్త లవ్‌జర్నీని మొదలెట్టాడు కుర్ర హీరో అఖిల్. కానీ ఇక్కడ కాదు. ఫారిన్లో. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ గురువారం యూకేలో మొదలైంది. ‘‘అఖిల్ థర్డ్ సినిమా మొదలైంది. జార్జ్ సి. విలియమ్స్ కెమెరామేన్‌గా చేస్తున్నారు. మా బ్యానర్లో ఇది 25వ సినిమా’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ‘‘కొత్త టీమ్‌తో పనిచేస్తున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది. ఇట్స్ టైమ్ టు స్టార్ట్’’ అన్నారు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్లో కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. మేజర్ షూటింగ్ ఫారిన్లోనే జరుగుతుంది. ఆ నెక్ట్స్ హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌తో చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట చిత్రబృందం. -
రేపే శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం!
అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ లాంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నారు యువ హీరో శ్రీ విష్ణు. మొదట్లో సహాయ పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు ప్రస్తుతం సోలో హీరోగా ట్రై చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటున్నారు. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ.. తన నటనతో అందరినీ మెప్పిస్తోన్న ఈ యువ హీరో మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. రేపు (జూన్ 22) ఉదయం 11 గంటల 27ని. లకు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నారా రోహిత్ ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, ఓం శ్రీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీ ‘అసుర’ ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. Update on my next movie !!! Directed by “Asura” fame Krishna vijay lingamneni under the production house Rizwan Enterainment & Shri Om cinemas@UrsVamsiShekar pic.twitter.com/GSeayniCyR — Sree Vishnu (@sreevishnuoffl) June 21, 2018 -
ఆది కొత్త సినిమా ఓపెనింగ్
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా ఆదివారం ప్రారంభమైంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ శౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ పాల్గొన్నారు. హీరో ఆది మాట్లాడుతూ... డైరెక్టర్ నాకు 3 గంటలు నెరేషన్ ఇచ్చారు. ఫ్యూర్ లవ్ స్టొరీ ఇది. మంచి ఆర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. త్వరలో హీరోయిన్ పేరు ప్రకటిస్తాము. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాను. నాకు కెరీర్ లో ఇది మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నానన్నారు. దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ... మంచి లవ్ స్టొరీ తో వస్తున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా చెయ్యడానికి మాకు సహకరిస్తున్న సాయి కుమార్ గారికి, హీరో ఆదికి, నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఈ సినిమాకు సంభందించి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాము. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నానన్నారు. -
కథలో నవరసాలు ఉన్నాయి
‘‘చాలా కాలం తర్వాత కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా. నాకు పక్కాగా యాప్ట్ అయిన సబ్జెక్ట్ ఇది. డైరెక్టర్‌ను అలీ నా దగ్గరకు పంపించాడు. కథ వినగానే ఓకే చేసా. మంచి ఎంటర్టైనర్. కథలో నవరసాలు ఉన్నాయి’’ అని శ్రీకాంత్ అన్నారు. ఆయన హీరోగా శాలు చౌరశియా, మమతా చౌదరి, జెబా అన్సమ్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పెళ్ళంటే...?’. మైను కె.ఎం.డి. దర్శకత్వంలో ఏంజెల్ ప్రొడక్షన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ బ్యానర్లపై అలీ భాయ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో తరుణ్ క్లాప్ ఇవ్వగా, నటుడు రాజేంద్ర కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు.‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా గౌరవ దర్శకత్వం వహించారు. మైను మాట్లాడుతూ– ‘‘పెళ్లి సందడి, పెళ్లాం ఊరెళితే’ చిత్రాల తరహాలో సాగే కథ ఇది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ ఎంటర్ టైనింగ్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి’’ అన్నారు. ‘‘జూన్‌లో రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్తాం. అధిక భాగం బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుగుతుంది’’ అన్నారు అలీ భాయ్. నటుడు అలీ, కథానాయికలు పాల్గొన్నారు. అలీ, రాజేంద్ర కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.కె, సంగీతం: మైను, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఒలీఖాన్. -
ఫస్ట్ డే ఫన్నీ డే
విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటించిన తొలి చిత్రం ‘యారా’. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాలో జోడీగా నటించేందుకు రెడీ అయ్యారు వీరిద్దరూ. అదెలా అంటే? అలా కుదిరేసిందంతే. జమాల్, శ్రుతి జంటగా తిగ్మాంషు దులియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యారా’ ఇంకా విడుదల కాలేదు. కానీ, మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం స్టార్ట్ అయ్యింది. ‘‘నా కెరీర్లో మరో సినిమా జర్నీ స్టార్ట్ అయింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. జమాల్‌తో మళ్లీ కలిసి నటించబోతున్నాను. ఫస్ట్ డే ఫన్నీడే’’ అని పేర్కొన్నారు శ్రుతి. గతేడాది ఆమె నటించిన ‘బెహన్ హోగి తేరి’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఈ సంగతి అలా ఉంచితే.. ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత తెలుగులో మరో చిత్రం ఒప్పుకోలేదు శ్రుతీహాసన్. -
ప్రేమ ప్రయాణం విజయం
ప్రస్తుతం సమాజంలో ప్రేమికుల్ని అర్థం చేసుకోకుండా విడదీసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేమికుల్ని విడదీయకూడదు.. కలిపే ప్రయత్నం చెయ్యాలనే కథాంశంతో ధన్వంతరీ క్రియేషన్స్ పతాకంపై ‘మా లవ్ జర్నీ సక్సెస్’ అనే చిత్రం ప్రారంభమైంది. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో కె.పి. లక్ష్మణాచారి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ సాలూరి కథానాయకుడిగా నటిస్తున్నారు. తొలి సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ నివ్వగా, కోటి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న కోటి మాట్లాడుతూ –‘‘మా అబ్బాయి రాజీవ్ నటిస్తున్న పదో సినిమా ఇది. మంచి కథ. రాజీవ్‌కి మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘హీరో పాత్ర మాస్‌గా, హీరోయిన్ క్యారెక్టర్ క్లాస్‌గా ఉంటుందని దర్శకుడు’’ తెలిపారు. పది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి కెమెరా: పి.విజయ్ కుమార్, పాటలు: చంద్రబోస్, వెనిగళ్ల రాంబాబు. -
నారా రోహిత్ 'శబ్దం' ప్రారంభం
-
‘అతని మౌనమే అతని ఆయుధం’
నారా వారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు నారారోహిత్. పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.... తను మాత్రం ప్రయోగాత్మక పాత్రలోనే నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. నారా రోహిత్ సినిమా అంటే కొత్తగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తాజాగా నారారోహిత్ మూగవాడి పాత్రలో నటిస్తున్న చిత్రం ఉగాది సందర్భంగా లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు శబ్దం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.బి. మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వికాస్ కురిమెళ్ల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను చిత్రబృందం విడుదల చేసింది. -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ఓపెనింగ్
-
సెల్ఫీతో సందడి
ఫ్రమ్ ఏ టూ సి... ఏ సెంటరైనా రవితేజకు ఫ్యాన్స్ ఉన్నారు. జస్ట్ రెండే సినిమాల (సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం)తో యూత్, ఫ్యామిలీస్‌కి దగ్గరయ్యారు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. మాస్ హీరో రవితేజతో ఈ యంగ్ డైరెక్టర్ చేస్తోన్న సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికా శర్మ కథానాయిక. ‘‘రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేశాం. సక్సెస్‌లో ఉన్న రవితేజ, కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో మా బ్యానర్‌పై సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఆల్రెడీ ఇండస్ట్రీలో బజ్ స్టార్ట్ అయ్యింది. ముకేశ్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఫస్ట్ డే షూటింగ్ స్పాట్లో యూనిట్ మెంబర్స్‌తో రవితేజ సరదాగా సెల్ఫీ దిగి, సందడి చేశారు. -
ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించిన పవన్
-
నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం
-
ప్రారంభమైన మంచు మనోజ్ కొత్త సినిమా
-
బెల్లంకొండ శ్రీనివాస్ - బోయపాటి శ్రీను కొత్త సినిమా ప్రారంభోత్సవం