
త్రిగున్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందుతున్న చిత్రం 'కార్టూన్స్ 90టీస్ కిడ్స్ బె ఈడ'. సాయితేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై తీసిన తొలి సీన్‌కి హీరో ఆకాశ్ పూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో సిద్ధు జొన్నలగడ్డ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు.
'ఢీ’లో డ్యాన్సర్‌గా, కంటెస్టెంట్‌గా, కొరియోగ్రాఫర్‌గా చేశాను. స్నేహం నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. 1990 దశకంలో పుట్టినవారి అనుభవాలు కూడా ఉంటాయి' అన్నారు సాయితేజ సప్పన్న. 'ఇది కామెడీ డ్రామా మూవీ' అన్నారు శ్రీకాంత్ దీపాల.
Comments
Please login to add a commentAdd a comment