payal
-
All We Imagine as Light: ఆస్కార్ బరిలో...!
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచే చాన్స్ ఉంది. కనికస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలో, ఛాయాకందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ఇది. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు ఈ చిత్రం గెలుచుకుంది. తాజాగా ఈ సినిమాను 2025 ఆస్కార్ బరిలో నిలిపేందుకు మేకర్స్ సన్నాహాలు మొదలు పెట్టారట. ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపేందుకు ఫ్రాన్స్ దేశం షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుక 2025 మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం అక్టోబరు 2న ఫ్రాన్స్‌లో రిలీజ్ కానుందని, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో రూ΄÷ందిన ఈ సినిమాను ఇండియాలో హీరో రానా నిర్మాణసంస్థ ‘స్పిరిట్ మీడియా’ డిస్ట్రిబ్యూట్ చేయనుందట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముంబైలో పని చేస్తున్న ఇద్దరు కేరళ నర్సులు ప్రభ (కనికస్రుతి), అను (దివ్య) జీవితాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథనం సాగుతుంది. -
బిగ్‌బాస్ నుంచి భర్త ఎలిమినేట్.. సంతోషంగా ఉందంటున్న భార్య
బిగ్‌బాస్ వల్ల పాపులారిటీ వస్తుందన్న విషయం పక్కనపెడితే దానివల్ల బంధాలు, కెరీర్ నాశనమైపోయిన సంఘటనలు కూడా కోకొల్లలు. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ రన్ అవుతోంది. ఈసారి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో కలిసి షోలో అడుగుపెట్టాడు. హవ్వ, ఇదేం ఘోరం, ఇంకెవరూ దొరకలేదా? అని జనాలు నోరెళ్లబెట్టారు. ముగ్గురూ కలిసిమెలిసి బాగానే ఉన్నారు.కృతిక అందంగా ఉందని కామెంట్ఇంతలో ఓ వారం పాయల్ ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ విశాల్ పాండే.. అర్మాన్ రెండో భార్య కృతికని అందంగా ఉందని కామెంట్ చేశాడు. వీకెండ్లో బిగ్‌బాస్‌కు వెళ్లిన పాయల్.. ఈ విషయంపై రాద్దాంతం చేసింది. తన మొదటి భార్యపై కామెంట్ చేశాడన్న కోపంతో అర్మాన్.. విశాల్ చెంప చెళ్లుమనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది.పాయల్‌పై ట్రోలింగ్ఈ గొడవ అంతటికీ కారణం నువ్వేనంటూ నెటిజన్లు పాయల్‌ను ఏకిపడేశారు. ఇది తట్టుకోలేకపోయిన పాయల్.. ఈ విమర్శల వల్ల ఒత్తిడికి లోనవుతున్నానని, బిగ్‌బాస్ నుంచి భర్త బయటకు వచ్చాక విడాకుల గురించి మాట్లాడతానంది. తాజాగా అర్మాన్ ఎలిమినేట్ అవడంతో సంతోషం వ్యక్తం చేసింది.ఇక ఆపేయండిఅర్మాన్ బయటకు వచ్చినందుకు హ్యాపీ. మీరు కూడా సంతోషంగా ఉన్నారనుకుంటాను. బహుశా స్వీట్లు కూడా పంచుకుంటారేమో! ఇంత ద్వేషాన్ని భరించేబదులు బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేయడమే మేలు. మీరు బలంగా కోరుకున్నారు కాబట్టే బయటున్నాడు. సంతోషమే కదా.. ఇకనైనా ద్వేషించడం ఆపండి అని చెప్పుకొచ్చింది.చదవండి: ఈ జీవితాన్ని అందంగా మార్చేశావ్.. థాంక్యూ: మౌనిక -
బిగ్‌బాస్ ఎంత పనిచేసింది.. యూట్యూబర్ విడాకులు!?
బిగ్‌బాస్ షో వల్ల పచ్చని కాపురం చెల్లాచెదురైపోయేలా ఉంది. ఇప్పుడు చెబుతుంది తెలుగు బిగ్ బాస్ గురించి కాదు. హిందీలో ప్రస్తుతం ప్రసారమవుతున్న ఓటీటీ మూడో సీజన్ గురించి. ఇద్దరు భార్యలతో కలిసి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ ఇందులో పాల్గొనగా.. ఓ భార్య ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమెనే విడాకులు తీసుకుంటానని అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్.. కృతిక-పాయల్ అనే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అలా ఫేమస్ అయిన అర్మాన్.. రీసెంట్గా మొదలైన బిగ్‌బాస్ ఓటీటీ 3లోకి భార్యలతో కలిసి వచ్చాడు. కాకపోతే పాయల్ తొలి వారమే ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె ఇంట్లో పిల్లల బాగోగులు చూసుకుంటోంది. అయితే ఈమెని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వ్లాగ్‌లో దీని గురించే బాధపడుతూ విడాకులు తీసుకుంటానని అంటోంది.తనని కృతికని లెస్బియన్స్ అంటున్నారని, అలానే ఓ వ్యక్తి ఇద్దరు భార్యలు ఉండటం తప్పులా చూస్తూ, అందరూ తననే నిందిస్తున్నారని పాయల్ చెప్పుకొచ్చింది. అలానే ఈ విమర్శలు వల్ల ఒత్తిడికి బాగా లోనవుతున్నానని.. బిగ్ బాస్ హౌస్ నుంచి అర్మాన్-కృతిక బయటకొచ్చిన తర్వాత విడాకులు గురించి మాట్లాడుతానని పాయల్ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా నిజంగానే చెబుతోందా? లేదంటే వ్యూస్ కోసమే చేసిన స్టంటా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?) -
ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు: దర్శకురాలు పాయల్ కపాడియా
కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం చరిత్రలో చెప్పుకునేలా సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘భారతీయ సినిమా’ కాన్స్‌లో మెరిసింది. తొలి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును మన దేశ దర్శకురాలు పాయల్ కపాడియా తెచ్చారు. ప్రతిష్టాత్మక పియరీ ఏంజెనీ అవార్డును అందుకున్న తొలి ఏషియన్‌గా ఛాయాగ్రాహకుడు–దర్శక–నిర్మాత సంతోష్ శివన్ సగర్వంగా దేశానికి తిరిగొచ్చారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో అనసూయ సేన్ గుప్తా ‘ది షేమ్‌లెస్’ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు.ఇదే విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన ‘సంతోష్’ ప్రదర్శితమైంది. కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇక చిదానంద ఎస్. నాయక్ దర్శకత్వం వహించిన కన్నడ లఘు చిత్రం ‘సన్‌ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ‘లా సినిఫ్’ విభాగంలో మొదటి బహుమతి పొందింది. అలాగే ‘బన్నీ హుడ్’ అనే మరో భారతీయ యానిమేటెడ్ మూవీ మూడో బహుమతి సాధించింది. ఇలా ఈసారి 77వ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం హవా కనిపించింది. మే 14న ఆరంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. దర్శకురాలు పాయల్ కపాడియా అందుకున్న అవార్డు విశేషాలతో పాటు మరిన్ని విషయాలు ఈ విధంగా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రం ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ సినిమా సత్తా చాటింది.గ్రాండ్ ప్రిక్ విభాగంలో అవార్డు సాధించింది. కాన్స్ చిత్రోత్సవాల్లోని ఈ ప్రధాన విభాగంలో అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చరిత్ర సృష్టించింది. కాగా ఈ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక విభాగమైన పామ్ డి ఓర్ అవార్డుకు కూడా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం పోటీలో నిలిచినప్పటికీ, అవార్డును అందుకోలేకపోయింది. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ రూపంలో ఓ భారతీయ చిత్రం పోటీలో నిలవడం ప్రశంసించదగ్గ విషయం. ఇక పామ్ డి ఓర్ విభాగంలో దాదాపు ఇరవై సినిమాలను వెనక్కి నెట్టి, సీన్ బేకర్ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘అనోరా’ అవార్డును ఎగరేసుకుపోయింది.‘గ్రాండ్ టూర్’ సినిమాకు గాను మిగ్యుల్ గోమ్స్ ఉత్తమ దర్శకుడిగా, ‘కైండ్స్ ఆఫ్ కైండ్‌నెస్’ సినిమాలోని నటనకు గాను జెస్సీ ప్లేమోన్స్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఎమిలియా పరేజ్’లో నటించిన అడ్రియానా పాజ్, కర్లా సోఫియా, సెలెనా గోమేజ్, జో సల్దానాలు ఉత్తమ నటీమణులుగా నిలిచారు. జాక్వెస్ డియార్డ్ నటించిన ఈ సినిమాకే జ్యూరీ ప్రైజ్ దక్కడం విశేషం. చిత్రోత్సవాల తొలి రోజు హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, ఆ తర్వాత జపాన్‌కు చెందిన యానిమేషన్ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లి’ ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ అవార్డు అందుకోగా చివరి రోజు హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ స్వీకరించారు.‘‘నిజానికి స్క్రిప్ట్ రాసేటప్పుడు కంగారుపడ్డాను. ఆ కంగారులో ఏదో రాశాను (నవ్వుతూ). మా సినిమాని ఇక్కడ వరకూ తీసుకొచ్చిన ‘కాన్స్’కి థ్యాంక్స్. దయచేసి మరో భారతీయ చిత్రం కోసం 30 ఏళ్లు వేచి ఉండొద్దు’’ అని అవార్డు అందుకున్న అనంతరం పాయల్ కపాడియా అన్నారు. వేదిక మీద ఉన్న ఈ మూవీలో నటించిన కనీ కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్లను ఆత్మీయంగా హత్తుకుని, ‘‘తమ సొంత సినిమాలా భావించి చేసిన ఈ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు’’ అన్నారు.ఇంకా ఈ చిత్ర నిర్మాతలు, భాగస్వాములు, ఇతర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అది మాత్రమే కాదు... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తొలి రోజు ఫెస్టివల్ వర్కర్లు మెరుగైన వేతనాలు డిమాండ్ చేస్తూ చేసిన నిరసనకు మద్దతు తెలిపారు. పాయల్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ – ‘‘నేను తీసిన ఈ సినిమా ముగ్గురి మహిళల స్నేహం నేపథ్యంలో ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా ఒకరికొకరు గోతులు తీసుకుంటారు.సమాజం అలానే చిత్రీకరించింది. అది దురదృష్టకరం. కానీ స్నేహం అనేది నాకు ముఖ్యమైన బంధం. ఎందుకంటే అది గొప్పతనానికి దారి తీస్తుంది. కలుపుగోలుతనాన్ని పెంచుతుంది. ఈ విలువలను కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తుండాలి’’ అన్నారు. ఆమె అవార్డు తీసుకురావడం పట్ల భారత ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు.పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. కని కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్ లీడ్ రోల్స్‌లో ఈ సినిమాను థామస్ హకీమ్, జూలియన్ గ్రాఫ్ నిర్మించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ నెల 23న ఈ చిత్రం ప్రదర్శితమైంది. కాగా పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌కే కాన్స్‌లోని ఓ ప్రధాన విభాగమైన గ్రాండ్ ప్రిక్ అవార్డు రావడం విశేషం.అయితే కాన్స్‌లో పాయల్ ప్రతిభ మెరవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఆ ఏడాది గోల్డెన్ ఐ అవార్డు పాయల్‌కు దక్కింది. అలాగే 2017లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్ నూన్ క్లౌడ్’ ప్రదర్శితమైంది. ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథ ఏంటంటే... కేరళ నుంచి ముంబైకి వెళ్లి నర్సులుగా పని చేస్తుంటారు ప్రభ (కని కస్రుతి), అను (దివ్య ప్రభ). భర్తతో విడిపోయిన ప్రభకు ఓ గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్‌ను ఆమె భర్త పంపిస్తాడు. దీంతో ప్రభకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు అను తన రిలేషన్షిప్లో ఇబ్బందులకు లోనవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ రోడ్ ట్రిప్‌కు వెళితే ఏం జరిగింది? అన్నదే కథ. -
All We Imagine as Light: గోల్డెన్ బరిలో మన బంగారం
డెబ్యూ ఫిక్షన్ ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ముంబైకి చెందిన పాయల్ కపాడియా. కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్లోని ప్రిస్టీజియస్ కాంపిటీషన్ సెక్షన్ పామ్ డ ఓర్ (గోల్డెన్ పామ్)లో పాయల్ ఫిల్మ్ పోటీ పడనుంది. మూడు దశాబ్దాల తరువాత మన దేశం నుంచి ఈ విభాగానికి ఎంపికైన చిత్రం ఇదే... ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న పాయల్‌కు ఆర్థికశాస్త్రం కంటే సినిమా శాస్త్రమే ఎక్కువగా దగ్గరైంది. ఆ ఇష్టంతోనే ‘పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో చేరాలనుకుంది. రెండో ప్రయత్నంలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. పాయల్‌కు తొలి గుర్తింపు ఆఫ్టర్నూన్ క్లౌడ్స్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2017)కు మన దేశం నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ఇది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డైలాగ్ రైటింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ స్క్రిప్ట్ రాసుకుంది. పాయల్ శబ్దప్రేమికురాలు. ‘చెవులు మూసుకొని సినిమా చూస్తే ఏ ఫీలింగ్ ఉండదు’ అంటున్న పాయల్‌కు ఏ దృశ్యంలో ఎలాంటి శబ్దం ఉపయోగించాలో బాగా తెలుసు. ‘సినిమాలు ఎందుకు తీస్తారు?’ అనే ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా జవాబు చెప్పవచ్చు. పాయల్ చెప్పే జవాబు మాత్రం... ‘నన్ను నేను అర్థం చేసుకోవడానికి, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చిత్రాలు తీస్తాను’ సినిమాను పాయల్ అర్థం చేసుకునే కోణం కూడా భిన్నమైనది. ‘సినిమా అనేది ΄్లాటే సర్వస్వంగా ఉండనక్కర్లేదు. చక్కని కవిత్వం చదివినట్లు ఉన్నా సరిపోతుంది’ అనేది ఆమె మనసులోని భావం. సోకాల్డ్ ఆడంబరాలు, పాపులర్ కల్చర్‌కు దూరంగా ఉండే ‘రిషి వ్యాలీ స్కూల్’లో చదువుకున్న చదువు పాయల్ ఆలోచనలను విశాలం చేసింది. ఇప్పుడంటే ప్రపంచ ‘చిత్ర’ పటంలో తనకంటూ కొంత గుర్తింపు సాధించింది పాయల్. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లితే మాత్రం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించి ఫస్ట్ రిజెక్షన్ ఆమెను అమితంగా బాధించింది. కలల మేడ కళ్ల ముందే కుప్పకూలినట్లుగా అనిపించింది. ‘స్కూల్ రోజుల నుంచి పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాలనేది నా కల. ఎందుకంటే నేను అభిమానించే ఎంతో మంది దర్శకులు అక్కడ చదువుకున్నారు. మొదట బాధ అనిపించినా ఆ తరువాత రెండో ప్రయత్నం చేయాలనుకున్నాను’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది పాయల్. రెండో ప్రయత్నం చేసి ఉండకపోతే ఆమె ప్రతిభ వృథాగా పోయేది. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’కు లభించిన గుర్తింపుతో పాయల్ మనసులో ఆత్మవిశ్వాసం అనే బీజం పడింది. ‘ది లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్’ ఫిల్మ్‌తో ఆ విత్తనం మొలకెత్తింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రైజ్ గెలుచుకుంది.‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పాయల్. ఇది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (2021)లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘గోల్డెన్ ఐ’ అవార్డ్ అందుకుంది. ఫిల్మ్‌మేకర్స్ డిజిటల్ ప్రపంచంలో ఉన్న ఈ కాలంలోనూ ‘ఫిల్మ్’ అంటే పాయల్‌కు ప్రత్యేక ఇష్టం. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ను ఫిల్మ్ పైనే షూట్ చేసింది. ‘డిజిటల్ ఫిల్మ్‌తో పోల్చితే ఓల్డ్–స్కూల్ ఫిల్మ్‌లో ఇమేజ్‌కు సంబంధించిన ఈస్థెటిక్ క్వాలిటీ, సాఫ్ట్‌నెస్ భిన్నంగా ఉంటుంది’ అంటుంది పాయల్. ఫిల్మ్‌మేకింగ్ అనేది ఇలా అనుకోగానే అలా అయిపోదు. కొన్నిసార్లు చాలా టైమ్ తీసుకోవచ్చు. అందుకు ఎంతో ఓపిక అవసరం. అందుకే చిత్రనిర్మాణాన్ని శిల్పం చెక్కడంతో పోల్చుతుంది పాయల్. ‘చిత్రనిర్మాణం అనేది చాలా ఓపికగా శిల్పం చెక్కడం లాంటిది. ఆ శిల్పం ఎలా రూపుదిద్దుకోనుందో శిల్పికి కూడా తెలియదు. చిత్రం కూడా అంతే’ అంటుంది పాయల్. పాయల్ తల్లి నళిని మలాని ఆర్టిస్ట్. దేశవిదేశాలకు చెందిన అత్యుత్తమ సినిమాల క్యాసెట్లను ఇంటికి తీసుకువచ్చేది. సినిమాలపై పాయల్ ఆసక్తికి తల్లి ఫిల్మ్ కలెక్షన్ ఒక కారణం. ‘చూడాలేగానీ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఎంతో అందం దాగుంది. అలాంటి అందాలను అమ్మ ఆస్వాదిస్తూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది’ అంటుంది పాయల్. తల్లి ప్రభావం పాయల్‌పై కనిపిస్తుంది. ‘జీవనోత్సాహం నుంచే సృజన జనిస్తుంది’ అంటున్న పాయల్ తనదైన విజువల్ లాంగ్వేజ్‌ను తయారు చేసుకుంటోంది. మూడు దశాబ్దాల తరువాత... పాయల్ కపాడియా గుర్తింపును మరో స్థాయికి తీసుకు వెళ్లిన ఫీచర్ ఫిల్మ్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ముంబైలోని నర్స్ ప్రభ, భర్త, ప్రభ స్నేహితురాలు అను కేంద్రంగా సాగే చిత్రం ఇది. షాజీ ఎస్ కరుణ్ మలయాళ చిత్రం ‘స్వాహమ్’ తరువాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాన పోటీకి ఎంపికైన చిత్రంగా ప్రత్యేకతను సాధించి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆల్ వి...’కి దర్శకత్వంతో పాటు రచన కూడా చేసింది పాయల్. ఈ చిత్రంలో దివ్య ప్రభ(మలయాళం సినిమా టేక్ ఆఫ్ ఫేమ్), కనీ కుస్రుతి (కేరళ కేఫ్ ఫేమ్), హృదు హరూన్ నటించారు. -
సూపర్ మహిళా గేమరే కాదు.. అంతకుమించిన అందగత్తె కూడా! (ఫొటోలు)
-
Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్
ఇటీవల ప్రధాని మోదీ దేశంలో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఏడుగురు గేమర్స్‌ను కలిశారు. వారిలో ఒక్కతే అమ్మాయి పాయల్ ధారే. గేమ్స్‌ను ఆడుతూ తన వ్యాఖ్యానం వినిపిస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ ద్వారా 35 లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకున్న పాయల్ పురుషుల ఆధిపత్య రంగమైన గేమింగ్‌లో తనదైన స్థానం పొందారు. పాయల్ పరిచయం. వీడియో గేమ్స్ అనగానే మూడు విధాలైన భాగస్వాములు ప్రస్తావనకు వస్తారు. 1. గేమ్స్ ఆడేవాళ్లు 2. చలామణిలో ఉన్న గేమ్స్‌ను ఆడుతూ తమ వ్యాఖ్యానం వినిపిస్తూ (లైవ్ స్ట్రీమింగ్) వీడియోలు చేసేవారు, 3. గేమ్స్ తయారు చేసేవారు. మన దేశంలో 2014 తర్వాత సెల్ఫోన్ల అందుబాటు పెరిగాక గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే వారితోపాటు గేమ్స్ చుట్టూ షోస్ చేసేవారి (గేమర్స్) పలుకుబడి కూడా పెరిగింది. వీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారారు. ఇక ఒరిజినల్‌గా మన దేశంలో గేమ్స్ తయారు చేసేవారు పై రెండు వర్గాలతో పోల్చితే తక్కువ. ఇటీవల ప్రధాని మోడి గేమ్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన 7 మంది గేమర్స్‌ను న్యూఢిల్లీలో కలిసి వారితో మాటామంతి జరిపారు. తీర్థ్ మిత్ర, అనిమేష్ అగర్వాల్, అన్షు బిస్త్, నమన్ మాధుర్, మిథిలేష్, గణేష్ గంగాధర్ అనే యువ గేమర్‌లతోపాటు వీరితో పాల్గొన్న ఒకే ఒక మహిళా గేమర్ పాయల్ ధారే. 15000 మంది గేమర్స్ మన దేశంలో 15 వేల మంది గేమర్స్ ఉన్నారు. అంటే వీడియో గేమ్స్‌ను ఆడుతూ వాటిని వివరిస్తూ వాటిపై వ్యాఖ్యానం చేస్తూ ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన వారు. ఇలాంటి వారిలో అత్యంత ఆదరణ పొందిన వారికి లక్షల మంది ఫాలోయెర్స్ ఉంటారు. ఇదంతా గేమింగ్ కమ్యూనిటీ. గేమ్స్ చుట్టూ వీడియోలు చేసేందుకే మన దేశంలో దాదాపు 1500 స్టుడియో లు కూడా ఉన్నాయి. గేమ్స్‌ను స్వయంగా తయారు చేసే సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా ఉన్న గేమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. పాయల్ ధారే కూడా అలా పేరు పొందింది. సంవత్సరానికి 5 కోట్లు 23 ఏళ్ల పాయల్ ధారేకు ‘పాయల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్లో ఆమె వీడియో గేమ్స్ ఆడుతూ తన సరదా వ్యాఖ్యానంతో వీడియోలు చేసి పెడుతుంటుంది. మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న గేమ్స్‌ను పరిచయం చేయడం లేదా ఆడటం వల్ల, సరదా వ్యాఖ్యానం చేయడం వల్ల గేమ్స్ అంటే ఇష్టం ఉన్న యువత అంతా ఈమె వీడియోలు ఫాలో అవుతుంటారు. దానివల్ల ఆమెకు సంవత్సరానికి రూ. 5 కోట్ల ఆదాయం అందుతోందని ఒక అంచనా. ఆశ్చర్యం ఏమంటే ఇంటర్ చదివే వరకూ కూడా పాయల్‌కు సెల్‌ఫోన్ లేదు. గేమ్స్ తెలియదు. పల్లెటూరి అమ్మాయి పాయల్ ధారేది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా అనే చిన్న పల్లె. ఫోన్ కూడా చూడని ఆ అమ్మాయి 2021లో లాక్డౌన్ సమయంలో గేమ్స్ గురించి తెలుసుకుంది. ఆ సంవత్సరమే తన వీడియోలు రిలీజ్ చేయసాగింది. 2023 నాటికి అంటే కేవలం రెండేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ పొందింది. ‘మా అమ్మ నేను గేమింగ్‌లోకి వెళతానంటే భయపడింది. మా నాన్న ప్రోత్సహించారు. వీడియో గేమింగ్‌లో ఆడపిల్లలకు అంత సులువుగా ప్రవేశం లభించదు’ అంటుంది పాయల్. ఇప్పుడు తనను చూసి కనీసం 200 మంది అమ్మాయిలు గేమింగ్‌లోకి వచ్చారని తెలిపింది. మంచి మార్గం కోసం ‘గేమ్స్‌ను తప్పించలేము. యువతకు మంచి లక్ష్యాలను ఏర్పరడానికి వీటిని మీరు ఉపయోగిస్తూ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి’ అని ప్రధాని గేమర్స్‌ను కోరారు. ‘మన పంచతంత్రం వంటి కథలను గేమ్స్‌కు వాడండి. పర్యావరణ సమస్యలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో గేమ్స్ తయారు చేస్తే ఇండియన్ సంస్కృతి ఉన్న గేమ్స్ తయారు చేస్తే ఆటకు ఆట, బోధనకు బోధన సమకూరుతాయి’ అని ప్రధాని అన్నారు. చదువుకు తగిన సమయం ఇస్తూ, ఒకవేళ ఏదైనా ఉపాధి ఉంటే ఆ ఉపాధి, ఉద్యోగాల్లో ఉంటూ జీవనానికి తగు గ్యారంటీ ఉన్నప్పుడు గేమింగ్‌లోకి వచ్చి ఆ రంగంలో నిలదొక్కుకోవాలని గేమర్స్‌కు సూచించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్ డ ఓర్’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డ ఓర్’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు. కాన్స్‌లో అత్యధిక బహుమతిని అందించే పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’తో పాటు అమెరికన్ ఫిల్మ్ ‘అనొర’, యూకే ఫిల్మ్ ‘ఓహ్.. కెనడా’, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘బీటింగ్ హార్ట్స్’, పోర్చుగల్ ఫిల్మ్ ‘గ్రాండ్ టూర్’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్‌లెస్’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ ‘బ్లాక్‌డాగ్’, ‘సెప్టెంబర్ సేస్’, జపాన్ ఫిల్మ్ ‘మై సన్‌షైన్’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘అవుట్ ఆఫ్ కాంపిటిషన్’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్మాక్స్ సాగ’, ‘రూమర్స్’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్నైట్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది సఫర్’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్ ప్రీమియర్‌లో ‘ఇట్స్ నాట్ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్‌ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్ కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. ‘నీచా నగర్’ చిత్రం తర్వాత ‘అమర్ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్ డ ఓర్’కు నామినేషన్ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్ డ ఓర్’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వీ ఇమాజిన్... కథేంటంటే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ 2015లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక అయింది. అలాగే పాయల్ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021లో జరిగిన కాన్స్ ఫెస్టివల్లో ‘గోల్డెన్ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్ అవార్డును గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ కథేంటంటే... బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్‌కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి. -
ఇండియన్ సినిమాకు అరుదైన ఘనత.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ సినిమాకు చోటు లభించింది. పాయల్ కపాడియా డైరెక్షన్లో తెరకెక్కించిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' కేన్స్‌లో పామ్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయింది. పాయల కపాడియా తెరకెక్కించిన మొదటి ఫిక్షన్ చిత్రమిది. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకు జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారాల కోసం పోటీలో నిలిచింది. దాదాపుగా పామ్ డి ఓర్ అవార్డు కోసం పోటీ పడుతున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా.. గతంలో 1994లో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన 'స్వహం' మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలతో కపాడియా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' పోటీ పడుతోంది. ఈ ఏడాది జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీకి 'లేడీబర్డ్', 'బార్బీ' డైరెక్టర్ గ్రెటా గెర్విగ్ అధ్యక్షత వహించనున్నారు. అంతే కాకుండా బ్రిటీష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి చిత్రం 'సంతోష్' కూడా అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగానికి ఎంపికైంది. కాగా.. గతంలో పాయల్ కపాడియా డాక్యుమెంటరీ 'ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్' 2021 ఎడిషన్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ అవార్డ్‌ను గెలుచుకుంది. 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అనే మూవీని ఒక నర్సు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన భారతీయ చిత్రాలలో చేతన్ ఆనంద్, వి శాంతారామ్, రాజ్ కపూర్, సత్యజిత్ రే, ఎంఎస్ సత్యు, మృణాల్ సేన్ రచనలు ఉన్నాయి. 'నీచా నగర్' పామ్ అవార్డ్ గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. Explore the dark heart of India with Sandhya Suri’s sophomore feature SANTOSH, in Official Selection at UN CERTAIN REGARD.#Santosh #SandhyaSuri @shahanagoswami @sunita_rajwar #GoodChaos @hautetcourt #LionfishFilms @BFI @Festival_Cannes #Cannes2024 #UnCertainRegard pic.twitter.com/UClJuS7rtW — mk2 films (@FilmsMk2) April 11, 2024 ALL WE IMAGINE AS LIGHT – Payal KAPADIA#Competition #Cannes2024 — Festival de Cannes (@Festival_Cannes) April 11, 2024 -
టాలీవుడ్ యంగ్ హీరో సస్పెన్స్ థ్రిల్లర్.. సాంగ్ రిలీజ్!
ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సుహాస్ హీరో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం ప్రసన్న వదనం. ఈ సినిమాకు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఉగాది శుభ సందర్భంగా ఈ చిత్రంలోని 'నిన్నా మొన్న' అనే సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ పాటని ఆకట్టుకునే లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్‌లో సుహాస్, పాయల్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
కాలికి ధరిస్తే కళ్లు పట్టేస్తున్నాయి..
అందమైన పాదాలను అంటిపెట్టుకునే అందియలు అమ్మాయిలకు అత్యంత ఇష్టం అందుకే, పట్టీలు వారి అలంకరణలో ఎప్పుడూ ప్రత్యేకతను నింపుకుంటాయి. ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలు పట్టీలు పెట్టుకోవడం లేదు అనే నిన్నటి తరం నిరాశను దూరం చేస్తూ... ఆంకిల్స్ పేరుతో వచ్చి కొత్తగా చేరిపోయాయి. వాటితో పాటు బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలలోనూ, ఇమిటేషన్ జ్యువెలరీలోనూ సగం పాదాన్ని కప్పేస్తున్నట్టుగా ఉండే పట్టీల డిజైన్లు ఎన్నో వచ్చాయి. సందర్భానికి తగినట్టు అలంకరించుకోవడానికి వేటికవి ప్రత్యేకతను కలిగి ఉంటున్నాయి. కాలికి ధరించేవే అయినా కళ్లనూ పట్టేస్తున్నాయి. మొఘలాయ్ రాణివాసపు హంగు కాలి అందియలలోనూ కనిపిస్తుంది. పెళ్లి పల్లకీ, రాజు రాణీ, నెమళ్లు, పువ్వుల డిజైన్లతో ఆకట్టుకుంటున్న పట్టీలు నేటితరం అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పూసలు, రత్నాలు వరసలుగా అల్లుకుపోయిన పూసలు కాలి పట్టీలుగా అమరి ఆధునికతనూ, సంప్రదాయతకు మేళవింపుగా ఉన్నాయి. పెద్ద పెద్ద రత్నాలు వీటిలో విశేషంగా అమరిపోయాయి. ఆధునికత... స్నేక్, రౌండ్ స్టైల్లో ఉండే బంగారు, వెండి ఆంక్లెట్ మోడ్రన్ స్టైల్‌కి అదనపు హంగుగా అమరుతున్నాయి. ఇవి చదవండి: ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్! -
మంచి సినిమా అంటున్నారు
‘‘అలా నిన్ను చేరి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రేక్షకుల నుంచి ఎక్కువగా స్పందన వస్తోంది. వారంతా ఫస్ట్ హాఫ్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు’’ అని కొమ్మాలపాటి సాయి సుధాకర్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చూసిన చాలామంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందనడం సంతోషం. ‘అలా నిన్ను చేరి’ నిర్మాతగా మొదటి సినిమా అయినా కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టా. సినిమా చూసిన మా నాన్నగారు బాగా తీశారని మెచ్చుకున్నారు. నా తర్వాతి సినిమా కోసం ప్రస్తుతం థ్రిల్లర్ జానర్లో ఓ కథ విన్నాను’’ అన్నారు. -
కథే హీరో
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి..’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దినేష్ తేజ్ మాట్లాడుతూ– ‘‘జీవితంలోని ఓ దశలో ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అంటూ ప్రతి మధ్యతరగతి అబ్బాయి గురయ్యే సంఘర్షణను ఇందులో చూపించాం. ఈ సినిమాలో నేను కొత్తగా కాస్త కమర్షియల్ రోల్లో నటించాను. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకి వస్తారని చెప్పగలను. కథ ఉంటేనే ఏమైనా చేయగలం. అందుకే కథే హీరో అని నమ్మే వ్యక్తిని నేను. ప్రేక్షకులు మెచ్చుకునే కథల్లో భాగం కావాలనుకుంటాను’’ అన్నారు. -
ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!
ఆర్ట్ సైంటిస్ట్ ఆర్ట్, ఫ్యాషన్‌ను కలిపి తనదైన కళను ఆవిష్కరించింది ఢిల్లీకి చెందిన పాయల్ జైన్. ఫ్యాషన్ రంగంలో పేరుగాంచిన పాయల్ జైన్ మంచి ఆర్టిస్ట్ కూడా. ఆమె తాజా ఎగ్జిబిషన్....సోల్ ఆఫ్ ఏ ఉమెన్. ఎగ్జిబిషన్లో కనిపించే 30 పీస్‌లలో ప్రతిదాంట్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చరిత్ర నుంచి కవిత్వం వరకు ఏదో ఒక అంశ ధ్వనిస్తుంది. ‘ఆర్ట్‌లో సైన్స్ ఉంటుంది. సైన్స్‌లో ఆర్ట్ ఉంటుంది’ అనే పాయల్ జైన్‌ను ఆర్ట్ సైంటిస్ట్‌గా పిలుచుకోవచ్చు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తన మూడు దశాబ్దాల ప్రయాణానికి ‘సోల్ ఆఫ్ ఏ ఉమెన్’ ప్రతిబింబం అంటుంది పాయల్. ఈ ఎగ్జిబిషన్‌లోని ముప్ఫై పీస్‌లలో ప్రతి పీస్‌కు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మెక్సికన్ పెయింటర్ ప్రీదా ఖాలోను స్ఫూర్తిగా తీసుకొని ‘ఫర్బిడెన్ లవ్’ కలెక్షన్ రూపొందించింది. పాయల్ అభిమానించే ఖాలో పెయింటర్, మ్యాజికల్ సర్రియలిస్ట్, ఫెమినిస్ట్, రెవల్యూషనరీ. పాయల్ ఆర్కిటెక్చర్ నుంచి ఫ్యాషన్ రంగంలోకి రావడానికి కారణం చిత్రకళ పట్ల తనకు ఉన్న అనురక్తి. స్కెచ్చింగ్ తనకు ఇష్టమైన పని. ఆమె తల్లి కూడా ఆర్టిస్టే. సితార్ అద్భుతంగా వాయించేది. తన కలల గురించి తల్లిదండ్రులకు చెప్పిప్పుడు ‘ ఏదో ఒక డిగ్రీ నీ చేతిలో కనిపించాలి. ఆ తరువాతే ఏదైనా’ అన్నారు. అలా బీకామ్ పూర్తి చేసింది. పాయల్ స్కెచ్చింగ్ నైపుణ్యాన్ని చూసి ‘నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రయత్నించవచ్చు’ అని సలహా ఇచ్చారు సన్నిహితులు. మొదట ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించి పుస్తకాలు, మ్యాగజైన్స్ విరివిగా చదివేది. అలా ఫ్యాషన్ కూడా తన ప్యాషన్‌గా మారింది. శాన్ఫ్రాన్సిస్కోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ‘ఫ్యాషన్‌కు ఆర్ట్, సైన్స్ అనే రెండు కోణాలు ఉంటాయి. ఆర్ట్ అనేది సృజనాత్మకతకు సంబంధించిన కోణం, సైన్స్ అనేది సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన కోణం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నా దృష్టిని విశాలం చేసింది. ప్యాటర్న్మేకింగ్, డ్రాపింగ్, గ్రేడింగ్, ఇలస్ట్రేషన్, ఫ్యాషన్ మార్కెటింగ్...ఇలా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను’ అంటున్న పాయల్ ఎన్నో కార్పొరేట్ హోటల్స్‌కు ఆకట్టుకునేలా ‘హోటల్ యూనిఫామ్’ను డిజైన్ చేసి ఇచ్చింది. ‘డిజైనర్స్ అంటే గొప్ప ఏమీ కాదు. గ్లోరిఫైడ్ టైలర్స్ మాత్రమే’ అని చాలామంది అనుకొని అపోహపడే కాలంలో డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించింది పాయల్. ఆమె వెస్ట్రన్ క్లాతింగ్ మొదలుపెట్టినప్పుడు దానికి మార్కెట్ లేదు. అయితే ఆ తరువాత మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. పాయల్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆమె మాటల్లోనే చెప్పాలంటే...‘చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే ధోరణిలో కాకుండా మనం చేస్తున్న పనిని మనసారా ప్రేమించాలి. నిద్ర, శ్వాస, కలలో మన లక్ష్యం కనిపించాలి. ఫెయిల్యూర్‌కు చోటివ్వకుండా సాంకేతిక జ్ఞానంపై గట్టి పట్టు సంపాదించాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్లో కొత్తదనం వచ్చేలా చూసుకోవాలి. ప్రశంసలు ఆస్వాదించడానికి మాత్రమే పరిమితమైపోకుండా అన్ని కోణాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. మార్పులు చేర్పులు చేసుకోవాలి. సానుకూల శక్తి, సంకల్పబలం ఎప్పటికీ మనకు తోడుగా ఉండాలి’ కెరీర్ తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది పాయల్. చేదుజ్ఞాపకాలుగా కాదు...ఆ సమయంలోనూ తాను ఎంత ధైర్యంగా ఉందో మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి. ‘విజయం ధైర్యవంతులను వెదుక్కుంటూ వస్తుంది’ అని చెప్పడానికి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆమె తెచ్చుకున్న పేరే నిదర్శనం. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
లవ్ అండ్ ఎమోషన్
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న విడుదల కానుంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. చంద్రబోస్‌గారి సాహిత్యం, సుభాస్ ఆనంద్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ షురూ
దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి కూమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా మారారు. శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్‌పై ఆమె నిర్మిస్తున్న కొత్త చిత్రం షురూ అయింది. నరేన్ వనపర్తి హీరోగా, పాయల్ గుప్తా హీరోయిన్గా నటిస్తున్నారు. మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బి.గోపాల్ క్లాప్ కొట్టగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు అవినాష్ కొకటి. ‘‘నాన్నగారి (జేపీ) ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్మాణంలోకి వచ్చాను’’ అన్నారు మల్లికా రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: శివ. -
Crime News: గొంతుకోసి.. వేడినూనెతో ముఖం కాల్చేసి..
క్రైమ్: దృశ్యం సినిమాలో రాంబాబు పాత్ర పెద్దగా చదువుకోదు. కేవలం.. తాను సంపాదించుకున్న సినిమా నాలెడ్జ్‌తోనే వరుణ్ మిస్సింగ్(మర్డర్) కేసు నుంచి కుటుంబాన్ని రక్షించుకుంటూ వస్తాడు. అయితే నిజజీవితంలోనూ సినిమాలు, టీవీ సీరియళ్లు.. నేరాలకు స్ఫూర్తిగా నిలవడం తరచూ చూస్తుంటాం. తాజాగా.. గ్రేటర్ నోయిడాలో బయటపడ్డ ఉదంతం విస్మయాన్ని కలిగిస్తోంది. పాయల్.. గ్రేటర్ నోయిడాకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని బధ్పురా గ్రామవాసి. తల్లిదండ్రుల గారాల బిడ్డగా పెరిగింది. పెళ్లీడూ వచ్చాక.. సంబంధాలు వెతకడం ప్రారంభించారు ఆమె తల్లిదండ్రులు. అయితే తాను అజయ్‌ను ప్రేమించిన విషయాన్ని చెప్పడానికి ఆమె తటపటాయిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కమ్మేసింది. వ్యాపారంలో నష్టాలు పూడ్చుకునేందుకు పాయల్ తండ్రి బోలెడంత అప్పులు చేశాడు. ఆ భారం కొండంత కావడంతో.. భరించలేకపోయాడు. భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన పాయల్‌కు.. అజయ్ ఆదరణ లభించింది. కానీ, కన్నవాళ్లు లేకపోవడంతో కుమిలిపోయింది పాయల్. ఆ బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. ఇంట్లోనే పాయల్ నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుందనే వార్త స్థానికంగా విషాదం నింపింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహానికి బంధువుల అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కూడా సూసైడ్ కేసుగా క్లోజ్ చేశారు. పాయల్ దూరమైందన్న బాధతో దేశాలు పట్టుకుపోయాడు అజయ్. కట్ చేస్తే.. అదే ఏరియాలో ఓ యువతి మిస్సింగ్ కంప్లయింట్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎంత వెతికినా ఆమె జాడను కనిపెట్టలేకపోయారు పోలీసులు. దీంతో గౌర్ సిటీ ఏరియాలో ఆమె పని చేసే మాల్ దగ్గర నుంచి విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. బధ్పురాకు చెందిన అజయ్, మిస్సింగ్ యువతికి మంచి స్నేహితుడని తేలింది. దీంతో.. పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. పాయల్ కోసమే తాను అదంతా చేశానని, పాయల్ బతికే ఉందన్న షాకింగ్ విషయాన్ని బయటపెడ్డాడు. తండ్రి చేసిన అప్పుల నుంచి తప్పించుకునేందుకు మరో వ్యక్తిని చంపి.. తన ప్లేస్‌లో ఆ శవాన్ని ఉంచి.. చనిపోయినట్లు నాటకం ఆడినట్లు ఒప్పుకుందామె. తాను చూసిన ఓ టీవీ షో స్ఫూర్తితోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది పాయల్. ఇందుకోసం ముందుగా అజయ్.. పాయల్ ఫిజిక్‌తో సరిపోలిన మాల్లో పని చేసే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ఆమెను నమ్మించి..ఓరోజు పాయల్ ఇంటికి తీసుకొచ్చాడు. గొంతు కోసి, ముఖం ఎవరూ గుర్తుపట్టకుండా వేడి నూనె, యాసిడ్ పోసి.. ఆపై బాడీకి నిప్పటించారు ఆ లవ్‌బర్డ్స్. ప్లాన్ ప్రకారం ముందుగా పాయల్, కొన్నిరోజుల గ్యాప్‌లో అజయ్.. ఇద్దరూ ఆ ఊరిని విడిచిపెట్టారు. బాధితురాలు కనిపించడం లేదన్న ఫిర్యాదుతో ఈ మొత్తం నేరం బయటపడింది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. వాళ్ల నుంచి ఓ రివాల్వర్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: బలవంతంగా కామాంధుల చెంతకు.. ఆపై.. -
గేమింగ్‌లో గెలుపు జెండా.. ‘పాయల్ ధారే’ విజయపథం
‘ఉమన్ గేమర్! వినడానికి కొత్తగా ఉంది’ అని ఒకరు ఎగతాళిగా నవ్వారు. ‘ఆడడం బాగానే ఉంటుందిగానీ, కెరీర్‌కు బాగుండదు’ అని గంభీరస్వరంతో నిరాశ పరిచారు మరొకరు. అంతా అయోమయంగా ఉంది. అలా అని ఆగిపోలేదు. ఓనమాలు నేర్చుకుంటూనే, కొత్త విషయాలపై పట్టు సంపాదిస్తూనే మేల్–డామినేటెడ్ స్పేస్ అనుకునే గేమింగ్‌లో బిగ్గెస్ట్ యూట్యూబ్ ఉమన్ గేమర్(ఇండియా)గా గెలుపు జెండా ఎగరేసింది పాయల్ ధారే... కరోనా మహమ్మారి పదునుగా కోరలు చాస్తున్న సమయంలో, లాక్డౌన్ రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన పాయల్ ధారే గేమింగ్–ఫోకస్డ్ ఛానల్‌కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే యూట్యూబ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పై లైవ్‌స్ట్రీమింగ్ కంటెంట్ గురించి ఆమెకు అంతగా అవగాహన లేదు. కాలేజీలో స్నేహితులతో కలిసి ‘పబ్జీ’ గేమ్ ఇష్టంగా ఆడేది. ‘పబ్జీ’ని నిషేధిస్తారనిగానీ, గేమింగ్‌ను తాను కెరీర్‌గా ఎంచుకుంటాననిగానీ అనుకోలేదు పాయల్. గేమింగ్‌పై ఇష్టం పెరుగుతున్న క్రమంలో తన మనసులో మాటను ఇంట్లో చెప్పింది. ‘గేమింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటాను’ తల్దిదండ్రులు ససేమిరా అన్నారు. ‘చదువుపై దృష్టి పెట్టు’ అని మందలించారు. వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా తొలి విజయం సాధించింది పాయల్. తాము ఉండే చింద్వారా పట్టణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రమే. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో గేమింగ్ సెషన్స్ క్లిప్స్‌ను పోస్ట్ చేసేది. 100కె ఫాలోవర్స్‌తో తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఈ సమయంలోనే యూట్యూబ్‌లో ప్రయత్నించమని స్నేహితులు, ఫాలోవర్స్ నుంచి ఒక సూచన వచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం సులభం కాబట్టి మొదట దాన్నే ఎంచుకున్నాను. మీ గేమింగ్ స్కిల్స్‌కు యూట్యూట్ అనేది సరిౖయెన వేదిక అనే సలహాతో పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను’ అంటుంది పాయల్. ఛానల్ మొదలైన తరువాత రకరకాల విషయాలు స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రేక్షకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేది. లైవ్‌స్ట్రీమింగ్ గురించి ఎన్నో రోజులు రిసెర్చ్ చేసింది. ఎలాంటి కంటెంట్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారు? లైవ్‌స్ట్రీమింగ్ పనితీరు ఎలా ఉంటుంది? ఇప్పుడున్న గేమింగ్ ఛానల్స్‌కు భిన్నంగా ఎలా ప్రయత్నించవచ్చు....ఇలా రకకరాల విషయాలపై లోతైన పరిశోధన చేసింది. పాయల్ కాస్త సిగ్గరి. నలుగురి ముందు మాట్లాడాలంటే భయం. కెమెరా ఫేస్ చేయాలంటే కష్టం. ‘ఒకటి సాధించాలని బలంగా అనుకొని బరిలోకి దిగితే, వారిలోని రెండు లోపాలు మాయమవుతాయి’ అంటారు. పాయల్ విషయంలోనూ అదే జరిగింది. బరిలోకి దిగిన తరువాత కెమెరాను హాయిగా ఫేస్ చేయడం నేర్చుకుంది. బెటర్ ఇంటర్నెట్ కోసం సొంత పట్టణం వదిలి, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి మారాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వద్దని గట్టిగా చెప్పారు. వారిని ఒప్పించడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఇక్కడికి మారిన తరువాత సబ్స్కైబర్ల సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో తనకు పేరున్న గేమర్స్లాగా పర్సనల్ కంప్యూటర్ సెటప్ లేదు. లైవ్‌స్ట్రీమ్, అప్‌లోడ్‌కు తన దగ్గర ఉన్న ఫోన్ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మాత్రం తన దగ్గర డ్యూయల్ మానిటర్స్‌తో కూడిన మంచి పీసీ సెటప్ ఉంది. ‘పాయల్ గేమింగ్’ ఛానల్ 2.5 మిలియన్ సబ్స్రైబర్లతో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని పాయల్ ఊహించలేదు. అయితే ఇది అంత సులువుగా దక్కిన విజయం కాదు. ‘సబ్స్క్రైబర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. అయితే అదే ఛానల్ విజయవంతంగా దూసుకుపోతున్నప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రోత్సహించే వారి కంటే రాళ్లు రువ్వే వాళ్లే ఎక్కువగా ఉంటారు. నా లైవ్స్ట్రీమ్స్పై కొందరు హేట్ కామెంట్స్ చేశారు. కొందరు బాడీ షేమింగ్ చేశారు. మొదట్లో బాధపడేదాన్ని. వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే విషయం అర్థమైన తరువాత వాటిని తేలికగా తీసుకున్నాను’ అంటుంది పాయల్. విజయం కోసం పోరాటం ఎంత ముఖ్యమో, ఆ విజయాన్ని నిలుపు కోవడం కోసం గట్టిగా నిలబడడం కూడా అంతే ముఖ్యం. పాయల్ ధారే ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉంది. ఇదీ చదవండి: విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే! -
ప్రియుడితో లాకప్ బ్యూటీ పెళ్లి, మేకప్ బెడిసికొట్టిందిగా!
బిగ్‌బాస్ బ్యూటీ పాయల్ రోహత్గి పెళ్లి పీటలెక్కింది. 12 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు సంగ్రమ్ సిన్హాను పెళ్లాడింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆగ్రాలో శనివారం ఘనంగా వీరి వివాహం జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో పాయల్ ఎర్రటి లెహంగాలో, ఒంటి నిండా నగలతో ధగధగ మెరిసిపోతోంది. అంతా బాగానే ఉంది కానీ ఆమె సరిగా మేకప్ వేసుకోలేదన్న విషయం మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. కలకాలం గుర్తుండిపోయే పెళ్లిరోజు మేకప్‌ను ఎందుకు దూరం పెట్టిందో అర్థం కాలేదంటున్నారు ఫ్యాన్స్. కేవలం నుదుటన బొట్టుతో చాలా సింపుల్‌గా కనిపించిందీ నటి. ఇక తన పెళ్లి ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కొందరు తన మేకప్ ఏంటి? ఇలా ఉందని అంటుంటే.. 'మరికొందరు మాత్రం అసలు మేకప్ వేసుకుంటేగా? సహజంగా ఉండాలనుకుంది, కానీ పెద్దగా సెట్టవ్వలేదు', 'లేదు లైట్‌గా వేసుకుంది కానీ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాయల్.. కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన లాకప్ షో రన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Gaurav Rohatgi (@_gaurav_) View this post on Instagram A post shared by Chandan bhatia | Makeup Artist (@makeupbychandanbhatia) View this post on Instagram A post shared by Raju Mehandi (@rajumehandiwala6) View this post on Instagram A post shared by Sangram U Singh🌟🇮🇳 (@sangramsingh_wrestler) View this post on Instagram A post shared by Team Payal Rohatgi (@payalrohatgi) చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అదే నా బ్యూటీ సీక్రెట్ -
12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్
హీరోయిన్ పాయల్ రోహత్గి తర్వలో పెళ్లిపీటలెక్కబోతోంది. క్రీడాకారుడు, నటుడు సంగ్రమ్ సింగ్‌తో కొత్త జీవితాన్ని ఆరంభించబోతోంది. జూలైలో పెళ్లి చేసుకోనున్నట్లు గతంలోనే వీరిద్దరూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే జూలై 21న సంగ్రమ్ బర్త్‌డే కావడంతో అదే రోజు వీరు వివాహం చేసుకుంటారని అంతా భావించారు. కానీ దానికంటే ముందే పెళ్లితో ఒక్కటి కానున్నామంటున్నాడు సంగ్రమ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కొంత ఉత్సాహంగా, మరికొంత ఉద్వేగంగా ఉంది. కొన్నేళ్లుగా కలిసి ఉంటున్న మా జీవితాల్లో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది. జూలై 9న మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా అమ్మ, సోదరి ఈ తేదీని ఖరారు చేశారు. పెళ్లి వేదిక ఎక్కడైతే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అహ్మదాబాద్ లేదా ఉదయ్‌పూర్‌లో డ్రీమ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే ఈ వేడుకకు కొద్దిమందిని మాత్రమే ఆహ్వానిస్తాం' అని చెప్పుకొచ్చాడు సంగ్రమ్. పెళ్లికి ఎక్కువమందిని పిలవకపోయినా ఇండస్ట్రీ మిత్రుల కోసం ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేస్తామని తెలిపాడు. కాగా సర్వైవర్ ఇండియా అనే రియాలిటీ షో షూటింగ్లో పాయల్, సంగ్రమ్ తొలిసారి కలిశారు. పరిచయమైన కొంతకాలానికే లవ్‌లో పడ్డ వీరిద్దరూ 2014 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సుమారు 12 ఏళ్లపాటు ప్రేమలో తడిసిముద్దయిన ఈ జంట ఎట్టకేలకు ఈ జూలైలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల లాకప్ షోలో పాల్గొన్న పాయల్ ఆ సమయంలో ఓ భయంకర సీక్రెట్‌ను బయటపెట్టింది. కెరీర్ పుంజుకోవడం కోసం ఓ పూజారి సాయంతో చేతబడిలోని వశీకరణం అనే తాంత్రిక విద్యను ప్రయోగించినట్లు తెలిపింది. కానీ దీనివల్ల ఎటువంటి లాభం జరగలేదని వెల్లడించింది. అయితే తన ప్రియుడు సంగ్రమ్ మీద ఎలాంటి చేతబడి చేయలేదని పేర్కొంది. చదవండి 👇 పార్టీలో మెరిసిన రష్మిక, ఎందుకలా ఫీలవుతోందని ట్రోలింగ్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్
Lock Up Show Runner Payal Rohatgi Fires On kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్‌గా వ్యవహరించిన షో లాక్ప్ షో విన్నర్‌గా నటుడు మునావర్ ఫరూఖీ నిలవగా.. నటి, కంటెస్టెంట్ పాయల్ రోహత్గీ రన్నర్‌గా నిలిచింది. అయితే పాయల్ ఈ షో విన్నర్ అవుతుందని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. పాయల్ కూడా తానే ఈ షో విన్నర్ అని గట్టిగా నమ్మింది. అయితే చివరకు తమె రన్నర్‌గా నిలవడాన్ని పాయల్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఈ షో టీంతో పాటు హోస్ట్ కంగనాపై సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శ వ్యాఖ్యలు చేసింది. లాకప్ గేమ్‌లో భాగంగా ‘పాయల్ ఈ ఎపిక్ టెస్ట్ పాసవుతుందా?’ అనే గతంలోని పోస్ట్‌ను ఆమె రీషేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. చదవండి: వాళ్లకు నా ఇంటి గడప తొక్కే అర్హత లేదు: కంగనా ఈ సందర్భంగా పనిపాట లేని కొందరు సెలబ్రెటీలు తనని టార్గెట్ చేస్తున్నారని, బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో బాండింగ్ తర్వాత కంగనా లాకప్ విన్నర్‌ను ప్రకటించిందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘నిజానికి ఆట ఆడకుండా, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వ్యక్తి విన్నర్ అవ్వడమే ఈ లాకప్ షో థీమ్ అనుకుంట. అలాంటి వారి కోసమే ఈ షోను పెట్టారు. అయితే లాకప్ ఫైనల్ ఎపిసోడ్ జరిగే వారానికి ముందు కంగనా అర్పిత ఖాన్(సల్మాన్ ఖాన్ సోదరి) ఈద్ పార్టీలో పాల్గొన్న కంగనాకు బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్‌తో మంచి పరిచయం ఏర్పడింది. అప్పుడే తాను లాకప్ విన్నర్ ఎవరనేది నిర్ణయించుకుంది. అందుకే వారికి సంబంధించిన వారినే లాకప్ షో విన్నర్‌గా ప్రకటించుకున్నారు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఓటీటీలో జెర్సీ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. ఇక విన్నర్ మునావర్ ఫరూఖీ గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లై పిల్లలు ఉన్న అతడు షోలో మరో అమ్మాయితో రొమాన్స్ చేశాడు. అంతేకాదు అతడు మిగత ప్లేయర్స్‌ను కూడా మెంటల్‌గా అటాక్ చేశాడు. ఇక ఆ పనిపాట లేని సెలబ్రెటీలు ఇది చూసి నిజం అనుకున్నారు. ఇది వారికి వినోదంగా అనిపించేందోమో. కానీ వారందరిని చూస్తుంటే నాకిప్పుడు బాధేస్తోంది’ అంటూ పాయల్ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అనంతరం హాస్ట్, నటి కంగనాను అన్‌ఫాలో చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు తన సినిమాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పాయల్. View this post on Instagram A post shared by Team Payal Rohatgi (@payalrohatgi) -
స్నేహం నేపథ్యంలో 'కార్టూన్స్ 90టీస్ కిడ్స్ బె ఈడ' చిత్రం
త్రిగున్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందుతున్న చిత్రం 'కార్టూన్స్ 90టీస్ కిడ్స్ బె ఈడ'. సాయితేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై తీసిన తొలి సీన్‌కి హీరో ఆకాశ్ పూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో సిద్ధు జొన్నలగడ్డ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. 'ఢీ’లో డ్యాన్సర్‌గా, కంటెస్టెంట్‌గా, కొరియోగ్రాఫర్‌గా చేశాను. స్నేహం నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. 1990 దశకంలో పుట్టినవారి అనుభవాలు కూడా ఉంటాయి' అన్నారు సాయితేజ సప్పన్న. 'ఇది కామెడీ డ్రామా మూవీ' అన్నారు శ్రీకాంత్ దీపాల. -
ఆమెది ఎవరూ చేయని సాహసం
ముంబైకి చెందిన పాయల్ కపాడియా.. ఈ పేరు అంతర్జాతీయ సినీ ప్రపంచంలో ఇప్పుడు మారుమోగుతోంది. 74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’కిగానూ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు అందుకుంది ఈమె. తద్వారా ఓ‘యిల్ డె‘ఓర్(గోల్డెన్ ఐ) గెల్చుకున్న మూడో మహిళగా.. భారత్ తరపు నుంచి ఈ ఘనత అందుకున్న తొలి ఫిమేల్ ఫిల్మ్‌మేకర్ చరిత్ర సృష్టించింది. మొత్తం 28 డాక్యుమెంటరీలు ఈ ప్రతిష్టాత్మక కేటగిరీ కోసం పోటీపడగా.. ముంబైకి చెందిన పాయల్ కపాడియాను ప్రైజ్ వరిచింది. వెల్వెట్ అండర్‌గ్రౌండ్, ఆండ్రియా ఆర్నాల్డ్స్ కౌ, త్రో ది లుకింగ్ గ్లాస్ లాంటి టఫ్ డాక్యుమెంటరీలతో కపాడియా తీసిన ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ పోటీపడి నెగ్గింది. ఢిల్లీ డైరెక్టర్ రాహుల్ జైన్ తీసిన ‘ఇన్విజిబుల్ డెమన్స్’ కూడా ఈ కేటగిరీలో పోటీ పడింది. The Oeil d’Or, the award for best documentary presented at the Cannes Film Festival all sections combined, goes to A NIGHT OF KNOWING NOTHING by Payal Kapadia, a film selected at the Directors’ Fortnight. Our warmest congratulations to Payal Kapadia and the entire film crew! 🎉 pic.twitter.com/s0e5ZwyUze — Quinzaine des Réal. (@Quinzaine) July 17, 2021 శెభాష్ పాయల్ విద్యార్థుల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో సాగే డాక్యుమెంటరీ ఇది. విడిపోయి దూరంగా ఉన్న తన లవర్‌కి ఓ యూనివర్సిటీ విద్యార్థి రాసే సీక్వెన్స్‌తో ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ కథ సాగుతుంది. కలలు, వాస్తవం, జ్నాపకాలు, స్మృతులు.. ఇలా అన్నీ ఎమోషన్స్ మేళవించి ఉన్నాయి ఇందులో. ఒక సున్నితమైన అంశం చుట్టూ తిరిగే ఈ కథను చాలా సాహసోపేతమైన ప్రయత్నంగా అభివర్ణించారు ఓయిల్ డెఓర్ జ్యూరీ హెడ్ ఎజ్రా ఎడెల్మన్. ఇదివరకు ఒకసారి ఎఫ్టీఐఐ స్టూడెంట్ అయిన కపాడియా.. వాట్ ఈజ్ సమ్మర్ సేయింగ్ డాక్యుమెంటరీ, లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసింది కూడా. 2017లో ఆమె తీసిన ఆఫ్టర్నూన్ క్లౌడ్స్ షార్ట్ ఫిల్మ్ ‘సినీఫాండేషన్’ సెలక్షన్ కింద కేన్స్‌లో ప్రదర్శించారు కూడా. గోల్డెన్ ఐ కేటగిరీని ఆరేళ్ల క్రితం ప్రవేశపెట్టగా.. మూడుసార్లు మహిళలే గెల్చుకున్నారు. మహిళ దర్శకుల్లో అగ్నెస్ వార్దా (ఫేసెస్ ప్లేసెస్ 2017), సిరియన్ జర్నలిస్ట్ ఫిల్మ్ మేకర్ వాద్ అల్ కతీబ్(సోమా-2019)కి ఈ ప్రెస్టేజియస్ అవార్డు గెల్చుకున్నారు. ఇప్పుడు పాయల్ మూడో వ్యక్తి. అయితే భారత్‌కు చెందిన షెర్లీ అబ్రహం-అమిత్ మధేషియా తీసిన ‘ది సినిమా ట్రావెలర్స్’కు 2017లో గోల్డెన్ అవార్డు స్పెషల్ జ్యూరీ మెన్షన్ మాత్రం ఇచ్చారు. -
'అనగనగా ఓ అతిథి' సినిమా రివ్యూ
చిత్రం: ‘అనగనగా ఓ అతిథి’ తారాగణం: పాయల్, చైతన్యకృష్ణ; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్; రిలీజ్: నవంబర్ 20; ఓ.టి.టి: ఆహా. దురాశ దుఃఖానికి హేతువు! ఈ పెద్దబాలశిక్ష సూక్తికి వెండితెర రూపం ‘అనగనగా ఓ అతిథి’. అయితే చిన్న పాయింట్ చుట్టూ కథను అటూ ఇటూ తిప్పి, గంటాముప్పావు చిత్రం తీశారు. కథేమిటంటే..: బీద రైతు కుటుంబం అన్నపూర్ణ, సుబ్బయ్యలది (వీణా సుందర్, ఆనంద్ చక్రపాణి). ఈడొచ్చినా... వయసు, మనసు తొందరపెట్టే కోరికలేవీ తీరక వేగిపోతున్న పెళ్ళీడు కూతురు మల్లిక (పాయల్ రాజ్‌పుత్). జంగమ దేవర భిక్షాటనకు వచ్చి, వాళ్ళింటికి మహాలక్ష్మి వస్తుందని జోస్యం చెబుతాడు. అనుకోకుండా పెట్టె నిండా నగలు, డబ్బుతో ఓ దేశసంచారి శ్రీనివాస్ (చైతన్య కృష్ణ) ఆ ఇంటికి అతిథిగా వస్తాడు. ఆ రాత్రికి అక్కడే ఉంటానంటాడు. మనుషుల్లో ఉండే కామం, దురాశ, కోరిక, పైశాచికత్వం అనుకోకుండా ఆ రాత్రి మేల్కొంటాయి. అప్పుడు జరిగిన రకరకాల సంఘటనలే మిగతా కథ. ఎలా చేశారంటే..: ఈ సినిమాకు ప్రధాన బలం కీలక పాత్రధారిణి పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్.ఎక్స్ 100’ లాంటి చిత్రాల్లో బొద్దుగా, పూర్తి గ్లామర్‌గా కనిపించిన పాయల్ ఈసారి నాజూకు దేహంతో, డీ గ్లామరైజ్డ్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో ప్రత్యక్షమయ్యారు. కానీ, తన హావభావాలతో, అభినయించే కళ్ళతో కథలోని తన పాత్ర ప్రవర్తనకు తగ్గట్టు ఎన్నో భావాలు పలికించారు. తల్లి పాత్రలో కన్నడ నటి వీణా సుందర్ జీవించారు (తెలుగుకు తొలి పరిచయం. కన్నడ మాతృకలోనూ ఆమె ఇదే పాత్ర చేశారు). పత్తి ఏకుతున్నప్పుడూ, సారాయి దుకాణంలో షాకింగ్ తెలిసినప్పుడూ తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణిని మర్చిపోయి, ఆ పాత్రనే చూస్తాం. ఎలా తీశారంటే..: చిన్న బడ్జెట్ చిత్రాలను వరుసగా ఓ.టి.టిలో వదులుతున్న వేదిక ‘ఆహా’. ట్రెండ్ లౌడ్ సంస్థతో కలసి, ఈ ‘అనగనగా ఓ అతిథి’ని నిర్మించింది. కన్నడంలో సక్సెసై, అక్కడి కర్ణాటక సర్కారు నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి (వీణా సుందర్) అవార్డులు అందుకున్న ‘ఆ కరాళ రాత్రి’ (2018) చిత్రానికి ఇది రీమేక్. ఓ ప్రసిద్ధ పాశ్చాత్య రచన ఆధారంగా వచ్చిన కన్నడ నాటకం ఆ కన్నడ చిత్రానికి ఆధారం. కన్నడంలో డైరెక్ట్ చేసిన తెలుగు – తమిళుడు దయాళ్ పద్మనాభన్ ఇప్పుడీ రీమేక్‌తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాలుగే పాత్రల చుట్టూ, ఒకే ఇంట్లో తిరిగేలా ఓ పూర్తి నిడివి సినిమా తీయడం కొంత సాహసమే. కథలో ఊహించని ట్విస్టు పెట్టడమూ బాగుంది. కానీ, కన్నడంలో 18 చిత్రాల అనుభవంతో 17 డేస్‌లోనే, రూ. 2.30 కోట్ల తక్కువ బడ్జెట్లో సినిమా తీసిన దర్శకుడు ఈ కథను నడిపించడంలో ఇబ్బంది పడ్డాడు. సినిమాలోని పాత్రల ప్రవర్తన కొన్నిసార్లు లాజిక్కు అందదు. ముఖ్యంగా, ఓ కీలక నిర్ణయం సమయంలో ప్రధాన పాత్రలు తీసుకొనే నిర్ణయానికి హేతువు కనిపించదు. పోస్టర్లలో ఫోటోలకూ, కథకూ సంబంధం లేకపోవడమూ కన్ఫ్యూజింగ్ పబ్లిసిటీ ట్యాక్టిక్స్. అలాంటి తప్పులనూ, కన్నడ ఛాయలనూ, తగ్గిన వేగాన్నీ పట్టించుకోకపోతే, టికెట్ కొనకుండా ఇంట్లోనే చూస్తున్నాం గనక ఈ మాత్రం చాలు లెమ్మని సరిపెట్టుకుంటాం. కొసమెరుపు: సినిమా చూస్తున్నా... సీరియల్ ఫీలింగ్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ పాత్రధారుల నటన, రీరికార్డింగ్ చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు సీరియల్లా సాగే కథనం ఆర్టిఫిషియల్ డైలాగ్స్ లాజిక్కు అందని పాత్రల ప్రవర్తన – రెంటాల జయదేవ -
ఆ బాలీవుడ్ నటికి బెయిల్ నిరాకరణ
అహ్మదాబాద్: దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసులో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సోమవారం గుజరాత్‌లోని బుండీ కోర్టు కొట్టివేసింది. దీంతోపాటు ఆమెకు ఎనిమిది రోజులపాటు జుడీషియల్ కస్టడిని విధించింది. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఇతర కుటుంబ సభ్యులపై అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన పాయల్‌పై అక్టోబర్ 10న బుండీ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పాయల్ దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై సోమవారం బుండీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కోర్టు బెయిల్ పిటీషన్‌ను తోసిపుచ్చింది. కాగా గాంధీ కుటుంబ సభ్యుల నుంచి తనపై చర్యలు చేపట్టాలని కోరుతూ.. రాజస్ధాన్ సీఎంపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఇటీవల నటి పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబం సభ్యులపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాయల్‌పై రాజ్‌స్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్మేష్ వర్మ ఫిర్యాదు చేశారని బుండీ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లోకేంద్ర పాలివాల్ తెలిపారు. చదవండి: బాలీవుడ్ నటి అరెస్ట్