'రష్మిక బాటలో మరో హీరోయిన్.. నాకు తెలుగబ్బాయే కావాలి' | Payal Radhakrishna bold comments about Her Marriage | Sakshi
Sakshi News home page

Payal Radhakrishna:'రష్మిక బాటలోనే పాయల్.. తెలుగబ్బాయినే పెళ్లాడతా'

May 10 2026 11:42 AM | Updated on May 10 2026 1:33 PM

Payal Radhakrishna bold comments about Her Marriage

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుహాస్‌ మూవీ 'ప్రసన్న వదనం'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. ఆ తర్వాత చౌర్యపాఠం అనే చిత్రంలోనూ మెరిసింది. ఇటీవలే పాపం ప్రతాప్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం పాయల్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న మేకర్స్ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌కు హాజరైన పాయల్ రాధాకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను కన్నడకు చెందిన వ్యక్తినే.. కానీ పెళ్లి విషయంలో మాత్రం తెలుగువాడే కావాలని బోల్డ్ కామెంట్స్ చేసింది. తనకు గుర్తింపు, గౌరవం, ఉపాధిని ఇచ్చింది టాలీవుడ్ పరిశ్రమనేనని తెలిపింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంది. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు ఆర్థిక భరోసాను ఇచ్చిందని వెల్లడించింది. అందుకే తన లైఫ్ పార్ట్‌నర్‌ కూడా తెలుగు వాడే కావాలని కోరుకుంటున్నట్లు పాయల్ వెల్లడించింది.

ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కన్నడ బ్యూటీలంతా తెలుగింటి కోడలైపోతున్నారంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే కన్నడ భామ రష్మిక మందన్నా.. మన తెలుగు హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ సైతం అదే బాటలో దూసుకెళ్తోంది. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది.  తెలుగు కోడలిగా స్థిరపడాలన్న పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement