
అతడే నా ఫస్ట్ క్రష్..
‘ప్రయాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెంగాలీ భామ పాయల్‌ఘోష్...ఊసరవెల్లి సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకుంది. సిటీ జరిగిన ఒక ఫంక్షన్‌కు హాజరైన పాయల్ తన లైఫ్‌స్టైల్ గురించి సిటీప్లస్‌తో ముచ్చటించింది. అవి ఆమె మాటల్లోనే...
సినీ ‘ప్రయాణం’ ఇలా...
మోడల్‌గా కెరీర్ ప్రారంభం అయిన కొన్ని రోజులకే ‘ప్రయాణం’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లాను. సెలక్ట్ అయిన తర్వాత నా లైఫ్ పూర్తిగా మారింది. అప్పట్లో నేను కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. తర్వాత ఒక యాక్టర్‌కు కావలసిన టోనింగ్ షేప్ కోసం సంవత్సరం పైనే కష్టపడ్డాను. ప్రతిరోజు రెండు గంటలు వ్యాయామం, పార్లర్, షూటింగ్స్‌తో బిజీ అయ్యా. ఎక్కువగా మాట్లాడడం నా వీక్‌నెస్.
స్టార్‌డమ్ వాల్యూ ఏంటో తెలియదు...
ఏడేళ్లుగా సినీ ఫీల్డ్‌లో ఉన్నాను. అప్పట్లో నేను నా క్రేజ్‌ను వినియోగించుకోలేకపోయాను. స్టార్‌డమ్ వ్యాల్యూ ఏంటో కూడా అర్థం చేసుకోలేని వయసులో యాక్టర్ అయ్యాను. తర్వాత నన్ను నేను యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి సమయం పట్టింది. ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. హిందీలో ‘పటేల్‌కి పంజాబీ షాది’ అనే సినిమా షూటింగ్‌లో ఉన్నాను. అది పూర్తయ్యాక తెలుగులో కూడా నటిస్తాను. రిషికపూర్ లాంటి పెద్ద యాక్టర్స్‌తో నటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది..
యూరోప్ ట్రిప్ వేయాలని...
నాకు యూరోప్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకూ వెళ్లలేదు. ఎప్పటికైనా వెళ్లాలని ఆశిస్తున్నా. ఇక ఇండియాలో అయితే కోల్‌కతాలో విక్టోరియా సిటీ అంటే ఇష్టం. ఎంతో ప్లెజంట్‌గా ఉంటుంది.
ఆంధ్ర ఫిష్ కర్రీ అదుర్స్...
బేసిక్‌గా నేను బెంగాలీని, బెంగాలీలందరికీ ఫిష్ అంటే ఇష్టం.. అలాగే నాకూ ఫిష్ అంటే ఇష్టం. కానీ ఆంధ్రా స్టైల్ చేపల పులుసు తిన్నాక ఫిష్ అంటే ఇంకా ఇష్టం పెరిగింది. దాని స్పైసీ యామీ టేస్ట్‌కు నేను ఫిదా అయిపోయాను.
ఆ ఒక్కరోజు డైట్ గురించి ఆలోచించను...
నా ప్రాబ్లమే డైట్. ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలనున్నప్పుడు యాక్టర్ ఇలాంటి ఫుడ్ తినాలి అనే నియమం నాకు నచ్చదు. అయినా ఒక్కోసారి లాగించేస్తాను. ప్రతిగా జిమ్‌లో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. నో ప్రాబ్లమ్ జిమ్‌లో అయినా గడుపుతా కానీ వారానికోక రోజు డైట్‌కు సెలవు పెట్టేస్తా....!
లాంగ్ రైడ్‌కి వెళతా...
ఎక్కువగా ట్రావెలింగ్ కోసం ఖర్చుపెడుతుంటా. లాంగ్ రైడ్‌లు ఇష్టం. రెస్టారెంట్ల గురించి తెలుసుకుని మరీ వెళ్తుంటా. దొంగతనంగా సినిమాలు చూసి వస్తుంటాను. వృధా ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. ఎక్కువ సంపాదించాలి. దానిలో కొంత మొత్తం సహాయం చెయ్యాలి, నేను ఎంజాయ్ చెయ్యాలి. ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి.
నా ఫస్ట్ క్రష్
నాకు పదేళ్లు ఉన్నప్పుడు ఒకబ్బాయి ఫొటో చూసి చాలా ఇష్టపడ్డాను. ప్రతి రోజు ఆ ఫోటో చూడడానికి వెళ్లేదాన్ని. కొన్నాళ్లకి ఒక విషయం విని భాధ పడ్డాను. ఎందుకంటే నాలాగే అతన్ని చూసేవాళ్లు చాలా మంది ఉండేవారు. ఆ ఫొటో షారుక్ ఖాన్‌ది. ఆది ఫొటో కాదు సినిమా
పోస్టర్...
మై ఫామిలీ
మాది ఉమ్మడి కుటుంబం. అమ్మ లేదు నాన్న, చెల్లెలు ఉన్నారు. కుటుంబ విలువలు నాకు చాలా ముఖ్యం. అమితంగా నేను గౌరవించేది నా కుటుంబాన్నే. నేను స్టార్ అయినా కాకున్నా నన్ను ప్రేమించేది కుటుంబమే. అందుకే నా కుటుంబం నాకు ముఖ్యం.
రెగ్యులర్‌గా ట్వీట్ చేస్తుంటా...
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటాను. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఎప్పుడూ పోస్టింగ్స్ పెడుతుంటా, అభిమానులతో ఎక్కువ కనెక్టివ్‌గా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి.