
బంజారాహిల్స్: ‘నాకు చీరలంటే ఎంతో ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే నేనొక శారీ లవర్‌ని’ అని చెప్పారు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో గ్జితి వీవ్స్‌లో ఏర్పాటు చేసిన నూతన కలెక్షన్లను మంగళవారం ఆవిష్కరించారు. మహిళలకు చీర అందాన్ని ఇవ్వడమే కాకుండా మరింత గౌరవాన్ని ఇస్తుందని ప్రియాంక అన్నారు.
తాను నిత్యం రకరకాల కలెక్షన్లు అన్వేషిస్తూ ఉంటానని, నచ్చిన చీరను తెప్పించుకోడం.. కట్టుకొని ముచ్చట తీర్చుకోడం జరుగుతుందన్నారు. మార్కెట్‌లోకి ట్రెండీ డ్రెస్‌లకు ధీటుగా శారీలు కూడా వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్జితి వీవ్స్ ప్రతినిధులు సౌజన్య, బాబీ మాట్లాడుతూ ప్రతి అవసరానికీ ఓ చీర, ప్రతి సీజన్‌కు ఓ చీర అనే కాన్సెప్‌్టతో దేశంలోని భిన్న రకాల చేతి వృత్తుల చీరలతో పాటు డిజైనరీ చీరలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
– నటి ప్రియాంక
Comments
Please login to add a commentAdd a comment