
‘‘అలా నిన్ను చేరి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రేక్షకుల నుంచి ఎక్కువగా స్పందన వస్తోంది. వారంతా ఫస్ట్ హాఫ్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు’’ అని కొమ్మాలపాటి సాయి సుధాకర్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించారు.
కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చూసిన చాలామంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందనడం సంతోషం. ‘అలా నిన్ను చేరి’ నిర్మాతగా మొదటి సినిమా అయినా కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టా. సినిమా చూసిన మా నాన్నగారు బాగా తీశారని మెచ్చుకున్నారు. నా తర్వాతి సినిమా కోసం ప్రస్తుతం థ్రిల్లర్ జానర్‌లో ఓ కథ విన్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment