టాలీవుడ్ యంగ్ హీరో సస్పెన్స్ థ్రిల్లర్.. సాంగ్ రిలీజ్! | Tollywood Young Hero Suhas Latest Movie Song Release | Sakshi
Sakshi News home page

Prasanna Vadanam Movie: యంగ్ హీరో సుహాస్‌ మరో చిత్రం.. సాంగ్ రిలీజ్!

Published Tue, Apr 9 2024 7:40 PM | Last Updated on Tue, Apr 9 2024 7:40 PM

Tollywood Young Hero Suhas Latest Movie Song Release - Sakshi

ఇటీవల అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌ హీరో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం ప్రసన్న వదనం. ఈ సినిమాకు అర్జున్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇవాళ ఉగాది శుభ సందర్భంగా ఈ చిత్రంలోని 'నిన్నా మొన్న' అనే సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ పాటని ఆకట్టుకునే లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్‌లో సుహాస్, పాయల్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement