
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. నిమిషం పాటు ఉన్న ప్రోమోను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. హృదయం లోపల అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ సాంగ్‌ను మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.