![Vijay Devarakonda latest Movie Kingdom Teaser Gets Huge Response](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/devara.jpg.webp?itok=x3V8mSIZ)
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌తో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్. కింగ్‌డమ్ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.
అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. యూట్యూబ్‌లో 10 మిలియన్స్ వ్యూస్‌తో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాయి. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. దీంతో కింగ్‌డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
#Kingdom Teaser delivers all the emotions with KING SIZED MOMENTS! 💥💥💥
10M+ views and standing tall! ❤️🔥❤️🔥
▶️ https://t.co/rHwYoKCDgI#VD12 #Saamraajya @TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla… pic.twitter.com/HpHNpmxWZi— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2025
Comments
Please login to add a commentAdd a comment