కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..! | Indian woman earning Rs 1 crore in London to cleaning flats in Melbourne | Sakshi
Sakshi News home page

కోటి రూపాయలు శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!

May 10 2026 2:14 PM | Updated on May 10 2026 6:11 PM

Indian woman earning Rs 1 crore in London to cleaning flats in Melbourne

మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్‌ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్‌ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.

భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్‌లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్‌సైట్‌లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్‌బోర్న్‌కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. 

మెల్‌బోర్న్‌ ఉద్యోగ మార్కెట్‌ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్‌ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్‌లలో జాయిన్‌ అయ్యేందుకు రెడీ అయిపోయింది. 

అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్‌మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్‌ ఆఫర్‌ Airbnb అపార్ట్‌మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్‌మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. 
ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం  2008లో లండన్‌కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్‌ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 

2023 నాటికి లండన్‌ బోటిక్‌ వెడ్డింగ్‌ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్‌బోర్న్‌కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది.  ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్‌లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్‌బోర్న్‌లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్‌ వైఫ్‌ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. 

ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్‌లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్‌మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్‌ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్‌ అయిపోవడమే మేలని అంటోంది. 

చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్‌ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్‌ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. 

ఇలా ఈ రేంజ్‌కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

 

(చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)
 

Advertisement
 
Advertisement
Advertisement