
Lock Up Show Runner Payal Rohatgi Fires On kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్‌గా వ్యవహరించిన షో లాక్‌ప్ షో విన్నర్‌గా నటుడు మునావర్ ఫరూఖీ నిలవగా.. నటి, కంటెస్టెంట్ పాయల్ రోహత్గీ రన్నర్‌గా నిలిచింది. అయితే పాయల్ ఈ షో విన్నర్ అవుతుందని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. పాయల్ కూడా తానే ఈ షో విన్నర్ అని గట్టిగా నమ్మింది. అయితే చివరకు తమె రన్నర్‌గా నిలవడాన్ని పాయల్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఈ షో టీంతో పాటు హోస్ట్ కంగనాపై సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శ వ్యాఖ్యలు చేసింది. లాకప్ గేమ్‌లో భాగంగా ‘పాయల్ ఈ ఎపిక్ టెస్ట్ పాసవుతుందా?’ అనే గతంలోని పోస్ట్‌ను ఆమె రీషేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది.
చదవండి: వాళ్లకు నా ఇంటి గడప తొక్కే అర్హత లేదు: కంగనా
ఈ సందర్భంగా పనిపాట లేని కొందరు సెలబ్రెటీలు తనని టార్గెట్ చేస్తున్నారని, బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో బాండింగ్ తర్వాత కంగనా లాకప్ విన్నర్‌ను ప్రకటించిందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘నిజానికి ఆట ఆడకుండా, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వ్యక్తి విన్నర్ అవ్వడమే ఈ లాకప్ షో థీమ్ అనుకుంట. అలాంటి వారి కోసమే ఈ షోను పెట్టారు. అయితే లాకప్ ఫైనల్ ఎపిసోడ్ జరిగే వారానికి ముందు కంగనా అర్పిత ఖాన్(సల్మాన్ ఖాన్ సోదరి) ఈద్ పార్టీలో పాల్గొన్న కంగనాకు బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్‌తో మంచి పరిచయం ఏర్పడింది. అప్పుడే తాను లాకప్ విన్నర్ ఎవరనేది నిర్ణయించుకుంది. అందుకే వారికి సంబంధించిన వారినే లాకప్ షో విన్నర్‌గా ప్రకటించుకున్నారు’ అంటూ రాసుకొచ్చింది.
చదవండి: ఓటీటీలో జెర్సీ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇక విన్నర్ మునావర్ ఫరూఖీ గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లై పిల్లలు ఉన్న అతడు షోలో మరో అమ్మాయితో రొమాన్స్ చేశాడు. అంతేకాదు అతడు మిగత ప్లేయర్స్‌ను కూడా మెంటల్‌గా అటాక్ చేశాడు. ఇక ఆ పనిపాట లేని సెలబ్రెటీలు ఇది చూసి నిజం అనుకున్నారు. ఇది వారికి వినోదంగా అనిపించేందోమో. కానీ వారందరిని చూస్తుంటే నాకిప్పుడు బాధేస్తోంది’ అంటూ పాయల్ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అనంతరం హాస్ట్, నటి కంగనాను అన్‌ఫాలో చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు తన సినిమాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పాయల్.
Comments
Please login to add a commentAdd a comment