
ఉన్నది ఉన్నట్లుగా, ముక్కుసూటిగా మాట్లాడే సెలబ్రిటీల్లో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ముందు వరుసలో ఉంటారు. బాలీవుడ్ స్టార్లపై విమర్శలు చేసే ఆమె తాజాగా మరోసారి వారి మీద విరుచుకుపడింది. ఏ స్టార్‌కి కూడా తన ఇంటికి వచ్చే అర్హత లేదని తేల్చి చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో నాకంటూ ఎవరూ ఫ్రెండ్స్ లేరు. నా ఇంటికి వచ్చే అర్హత ఎవరికీ లేదు. కావాలంటే వారిని బయట కలుసుకుని మాట్లాడొచ్చు, అంతే తప్ప ఎవరినీ నా ఇంటికి ఆహ్వానించను' అని చెప్పుకొచ్చింది.
కాగా కంగనా ఇటీవలే అజయ్ దేవ్‌గణ్‌పై ఫైర్ అయిన విషయం తెలిసిందే! అజయ్ దేవ్‌గణ్ అందరి సినిమాలను ప్రమోట్ చేస్తాడు, కానీ నా మూవీని మాత్రం ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. నన్ను పిలిచి తలైవి సినిమా బాగుందని చెప్పాడు, కానీ దాని గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అని ఆగ్రహించింది. ఇదిలా ఉంటే కంగనా నటించిన ధాకడ్ సినిమా మే 20 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
చదవండి👇
Comments
Please login to add a commentAdd a comment