
బిగ్‌బాస్ బ్యూటీ పాయల్ రోహత్గి పెళ్లి పీటలెక్కింది. 12 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు సంగ్రమ్ సిన్హాను పెళ్లాడింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆగ్రాలో శనివారం ఘనంగా వీరి వివాహం జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో పాయల్ ఎర్రటి లెహంగాలో, ఒంటి నిండా నగలతో ధగధగ మెరిసిపోతోంది. అంతా బాగానే ఉంది కానీ ఆమె సరిగా మేకప్ వేసుకోలేదన్న విషయం మాత్రం ఇట్టే తెలిసిపోతుంది.
కలకాలం గుర్తుండిపోయే పెళ్లిరోజు మేకప్‌ను ఎందుకు దూరం పెట్టిందో అర్థం కాలేదంటున్నారు ఫ్యాన్స్. కేవలం నుదుటన బొట్టుతో చాలా సింపుల్‌గా కనిపించిందీ నటి. ఇక తన పెళ్లి ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కొందరు తన మేకప్ ఏంటి? ఇలా ఉందని అంటుంటే.. 'మరికొందరు మాత్రం అసలు మేకప్ వేసుకుంటేగా? సహజంగా ఉండాలనుకుంది, కానీ పెద్దగా సెట్టవ్వలేదు', 'లేదు లైట్‌గా వేసుకుంది కానీ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాయల్.. కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన లాకప్ షో రన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే!
చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది
దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అదే నా బ్యూటీ సీక్రెట్
Comments
Please login to add a commentAdd a comment