అహ్మదాబాద్: దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసులో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సోమవారం గుజరాత్‌లోని బుండీ కోర్టు కొట్టివేసింది. దీంతోపాటు ఆమెకు ఎనిమిది రోజులపాటు జుడీషియల్ కస్టడిని విధించింది. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఇతర కుటుంబ సభ్యులపై అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన పాయల్‌పై అక్టోబర్ 10న బుండీ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
పాయల్ దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై సోమవారం బుండీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కోర్టు బెయిల్ పిటీషన్‌ను తోసిపుచ్చింది. కాగా గాంధీ కుటుంబ సభ్యుల నుంచి తనపై చర్యలు చేపట్టాలని కోరుతూ.. రాజస్ధాన్ సీఎంపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఇటీవల నటి పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబం సభ్యులపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాయల్‌పై రాజ్‌స్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్మేష్ వర్మ ఫిర్యాదు చేశారని బుండీ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లోకేంద్ర పాలివాల్ తెలిపారు.
చదవండి: బాలీవుడ్ నటి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment