Rejected bail petition
-
Sushil Kumar Bail Petition: క్రూరంగా హింసించి చంపారు.. బెయిల్ ఇవ్వకండి
Wrestler Sushil Kumar Bail Plea Opposed: సాగర్ ధనకర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడు, ఒలింపిక్స్ పతక విజేత సుశీల్ కుమార్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అడిషనల్ సెషన్స్ జడ్జి శివాజీ ఆనంద్.. సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. సాగర్‌ను అడవి పందిని వేటాడినట్లు వేటాడి క్రూరంగా హింసించి చంపారని బాధితుడి తరఫు న్యాయవాది, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ కుమార్ శ్రీ వాస్తవ కోర్టుకు తెలిపారు. మరోవైపు సుశీల్ కుమార్ తరపు లాయర్ తన క్లయింట్‌ను కావాలనే కేసులో ఇరికించారని, మృతుడి మరణ వాంగ్మూలాన్ని 40 రోజులు ఆలస్యంగా కోర్టుకు సమర్పించారని వాదించారు. ఈ కేసులో మొత్తం 13 మందిపై ఐపీసీ 302, 307, 147 సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా, మే 4న ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద 23 ఏళ్ల సాగర్ ధనకర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్.. 2008, 2012 విశ్వక్రీడల్లో కాంస్యం, రజత పతకాలు సాధించాడు. చదవండి: క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్ -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. (వరవరరావుకు తీవ్ర అస్వస్థత) ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు. (వరవరరావు కేసు: ఎఫ్‌బీఐకు హార్డ్‌డిస్క్!) -
ఆ బాలీవుడ్ నటికి బెయిల్ నిరాకరణ
అహ్మదాబాద్: దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసులో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సోమవారం గుజరాత్‌లోని బుండీ కోర్టు కొట్టివేసింది. దీంతోపాటు ఆమెకు ఎనిమిది రోజులపాటు జుడీషియల్ కస్టడిని విధించింది. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఇతర కుటుంబ సభ్యులపై అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన పాయల్‌పై అక్టోబర్ 10న బుండీ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పాయల్ దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై సోమవారం బుండీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కోర్టు బెయిల్ పిటీషన్‌ను తోసిపుచ్చింది. కాగా గాంధీ కుటుంబ సభ్యుల నుంచి తనపై చర్యలు చేపట్టాలని కోరుతూ.. రాజస్ధాన్ సీఎంపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఇటీవల నటి పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబం సభ్యులపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాయల్‌పై రాజ్‌స్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్మేష్ వర్మ ఫిర్యాదు చేశారని బుండీ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లోకేంద్ర పాలివాల్ తెలిపారు. చదవండి: బాలీవుడ్ నటి అరెస్ట్ -
లష్కర్ ఉగ్రవాది బెయిల్ పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును స్థానిక న్యాయస్థానం తోసిపుచ్చింది. భారత్‌లో విధ్వంసకర కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం నిందితుడు మహ్మద్ షాహిద్ అనే ఉగ్రవాది నగరానికి చెందిన ఓ వ్యాపారిని అపహరించేందుకు యత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని హర్యానాలోని మేవట్ ప్రాంతంలో 2013,డిసెంబర్లో పోలీసులు అరెస్టుచేసిన సంగతి విదితమే. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు స్థానిక అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి రితేష్‌సింగ్ తోసిపుచ్చారు. ‘నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాల్సి ఉంది. నిందితుడిపై వచ్చిన అభియోగాలను దృష్టిలో పెట్టుకుని బె యిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నా’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు.